రూ.10 లక్షల లోపు అత్యంత సురక్షితమైన కార్లు ఇవే.. ఈ కార్లకు 5-స్టార్ రేటింగ్ ఎందుకిచ్చారంటే ?
గతంలో ప్రజలు కారు కొనేటప్పుడు మైలేజ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు సేఫ్టీ అనేది ఒక ముఖ్యమైన అంశంగా మారింది. ఈ కారణంగానే గ్లోబల్ ఎన్‌క్యాప్, ఆసియన్ ఎన్‌క్యాప్ వంటి క్రాష్ టెస్ట్ ఏజెన్సీలు కార్లకు సేఫ్టీ రేటింగ్‌లను ఇస్తున్నాయి. ఈ ఏజెన్సీలు నిర్వహించే క్రాష్ టెస్టులలో అత్యధిక రేటింగ్ పొందిన కొన్ని కార్లు ఇప్పుడు భారతీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా, రూ. 10 లక్షల లోపు ధరలో లభించే కొన్ని 5-స్టార్ రేటింగ్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా నెక్సాన్ : భారతీయ కార్లలో భద్రతకు ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పిన కారు టాటా నెక్సాన్. ఈ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్, భారతీయ భద్రతా సంస్థ అయిన భారత్ ఎన్‌క్యాప్ రెండింటిలోనూ పూర్తి 5-స్టార్ రేటింగ్ పొందింది. వాస్తవానికి, గ్లోబల్ ఎన్‌క్యాప్‌లో 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి భారతీయ కారు నెక్సానే. ఇది మంచి డిజైన్‌తో పాటు, అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

టాటా పంచ్ : నెక్సాన్ విజయాన్ని చూసి, దాని స్ఫూర్తితోనే టాటా పంచ్ తయారైంది. పరిమాణంలో నెక్సాన్ కంటే చిన్నదైనా, సేఫ్టీ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. టాటా పంచ్ కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో పూర్తి 5-స్టార్ రేటింగ్ సాధించింది. తక్కువ ధరలో మంచి సేఫ్టీ ఉన్న కారు కావాలనుకునేవారికి టాటా పంచ్ ఒక అద్భుతమైన ఎంపిక.
టాటా ఆల్ట్రోజ్ : టాటా కంపెనీ నుంచి వచ్చిన మరో సురక్షితమైన కారు ఆల్ట్రోజ్. ఇది కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు ఎక్కువ అప్‌డేట్లు రాకపోయినా, దాని దృఢమైన బాడీ నిర్మాణం, సేఫ్టీ ఫీచర్ల కారణంగా టాటా అమ్మకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. స్టైలిష్ డిజైన్‌తో సేఫ్టీని కోరుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ : మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన లేటెస్ట్ కారు ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ. ఈ కారు ఇటీవల భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందింది. ఇది గతంలో ఉన్న ఎక్స్‌యూవీ300 కారుకు అప్‌డేటెడ్ వెర్షన్. ఈ కారులో అడ్వాన్సుడ్ ఫీచర్లు, మంచి పర్ఫార్మెన్స్ తో పాటు అద్భుతమైన భద్రత కూడా లభిస్తుంది.
మారుతి సుజుకి డిజైర్ : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెడాన్ కార్లలో మారుతి సుజుకి డిజైర్ ఒకటి. ఈ కారు కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించి, భద్రతలో తన స్థానాన్ని నిరూపించుకుంది. డిజైర్ అనేది మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు సెడాన్ వెర్షన్. ఇది ప్రతి నెలా వేలల్లో అమ్ముడవుతుంది. తక్కువ ధర, ఎక్కువ మైలేజ్‌తో పాటు భద్రత కూడా ఉండటంతో దీనికి మంచి ఆదరణ లభిస్తుంది.

క్రాష్ టెస్టులలో 5-స్టార్ రేటింగ్ పొందడం అంత సులభమైన విషయం కాదు. వివిధ రకాల పరీక్షలు, తీవ్రమైన ప్రమాదాల సిమ్యులేషన్స్ తర్వాతే ఈ రేటింగ్‌లు ఇస్తారు. ఈ రేటింగ్‌లు వినియోగదారులకు కారు భద్రతపై స్పష్టమైన అవగాహన కల్పిస్తాయి. అందువల్ల, రూ. 10 లక్షల లోపు ధరలో భద్రతతో కూడిన కారును కొనుగోలు చేయాలనుకుంటే, పైన పేర్కొన్న కార్లు ఒక మంచి ఎంపికగా ఉంటాయి.


Click it and Unblock the Notifications








