28 కి.మీ మైలేజ్, 5 సీటర్, 6 ఎయిర్‌బ్యాగ్స్..కేవలం రూ.8లక్షల్లోపే దొరికే లగ్జరీ కార్లు ఇవే..మిస్సవ్వకండి
దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఎస్‌యూవీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. వినియోగదారులు కూడా ఒకరితో మరొకరు పోటీ పడుతూ ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా సరికొత్త కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ చెప్పిన మోడల్స్ బెస్ట్ ఆప్షన్లు కావొచ్చు. 8 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలో మంచి మైలేజ్, 5-సీటర్ ఆప్షన్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లతో లభిస్తున్న 5 ప్రముఖ ఎస్‌యూవీల పూర్తి వివరాలను తెలుసుకుందాం.
1. టయోటా అర్బన్ క్రూయిజర్ టైసర్
ఇది ప్రస్తుతం మార్కెట్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఎస్‌యూవీ. అన్ని వర్గాల కస్టమర్‌లకు అందుబాటులో ఉండే దీని ధర రూ.7.21 లక్షల నుంచి రూ.12.06 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. టైసర్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్‌తో లభిస్తుంది.

ఇది 20.1 నుంచి 28.51 కి.మీ వరకు అత్యధిక మైలేజీని అందిస్తుంది. ఇందులో 5 సీట్లు, 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
2. టాటా పంచ్
భారతీయ వినియోగదారుల ఫేవరెట్ కార్లలో టాటా పంచ్ ముందుంటుంది. దీని ధర రూ. 5.50 లక్షల నుంచి రూ. 9.30 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ ఎస్‌యూవీ 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. ఇది 18 నుంచి 26.99 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది.

పంచ్ 5 సీట్ల ఆప్షన్‌ను కలిగి ఉంది. ఇందులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.
3. హ్యుందాయ్ ఎక్స్‌టర్
హ్యుండాయ్ ఎక్స్‌టర్ కొనుగోలుదారులు ఇష్టపడే మరో ఎస్‌యూవీ. దీని ధర రూ. 5.68 లక్షల నుంచి రూ. 9.61 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఎక్స్‌టర్ 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ CNG ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 19 నుంచి 27 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. ఈ 5-సీటర్ ఎస్‌యూవీ 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. సేఫ్టీ పరంగా ఇందులో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.

4. రెనాల్ట్ కైగర్
మార్కెట్‌లో ఉన్న ముఖ్యమైన ఎస్‌యూవీలలో రెనాల్ట్ కైగర్ ఒకటి. దీని ధర రూ. 5.76 లక్షల నుంచి రూ. 10.34 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కైగర్ 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందింది. ఇది 19 నుంచి 20 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఈ 5-సీటర్ కారు 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

5. నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ మాగ్నైట్ విశ్వసనీయత కలిగిన మరొక ఎస్‌యూవీ. దీని ధర రూ.5.62 లక్షల నుంచి రూ.10.76 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. మాగ్నైట్ 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 17.9 నుంచి 19.9 కి.మీ వరకు మైలేజీని ఇస్తుంది. ఈ 5-సీటర్ ఎస్‌యూవీలో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.



Click it and Unblock the Notifications








