స్టైలిష్ డిజైన్, అద్భుతమైన మైలేజ్.. 2025లో టాటా నుండి కొనుగోలు చేయదగిన టాప్ 5 కార్లు ఇవే!

టాటా మోటార్స్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది సేఫ్టీ. అందుకే కస్టమర్లు టాటా కార్లను కొనేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తారు. మీరు ఈ 2025లో కొత్త టాటా కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆల్ట్రోజ్, టియాగో ఈవీ, కర్వ్, పంచ్, నెక్సాన్ మోడళ్లు మీకు మంచి ఎంపికలు కావచ్చు. ఈ కార్ల ధరలు, వాటిలోని ముఖ్యమైన ఫీచర్ల గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

1. టాటా టియాగో ఈవీ : ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ సరసమైన ధరలో లభిస్తుంది. కాబట్టి మధ్యతరగతి, ధనిక వర్గాల కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. దీని కనీస ధర రూ.7.99 లక్షలు, గరిష్ట ధర రూ.11.14 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంది. డేటోనా గ్రే, ప్రిస్టీన్ వైట్, టీల్ బ్లూ, అరిజోనా బ్లూ, సూపర్నోవా కాపర్ వంటి రంగులలో లభిస్తుంది.

Tata Tiago

ఇందులో 5 సీటింగ్ ఆప్షన్ ఉంది. 19.2 కిలోవాట్, 24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 250 నుండి 315 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజ్) ఇస్తుంది. 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

2. టాటా ఆల్ట్రోజ్ : ఈ కారు ధర రూ.89 లక్షల నుండి రూ.1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఎంబర్ గ్లో, ప్రిస్టీన్ వైట్, డ్యూన్ గ్లో, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ వంటి రంగులలో లభిస్తుంది. ఇందులో 5 సీట్లు ఉన్నాయి. 345 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంది.

Tata Altroz

ఈ కారు 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్, 1.2-లీటర్ సిఎన్‌జి ఇంజిన్లను కలిగి ఉంది. ఇది 19 నుండి 26 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 4-స్పీకర్ సెటప్, రియర్ ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్, 6-ఎయిర్‌బ్యాగ్‌లు సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

3. టాటా కర్వ్ : కొత్త కర్వ్ కూపే ఎస్‌యూవీ ధర రూ.9.99 లక్షల నుండి రూ.19.51 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.2-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. ఇది 11నుండి 15కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5సీట్లు ఉన్నాయి. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6-ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Tata Curv

4. టాటా పంచ్ : ఇదొక చిన్న సైజు ఎస్‌యూవీ. దీని కనీస ధర రూ.6.20 లక్షలు, గరిష్ట ధర రూ.10.32 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.2-లీటర్ పెట్రోల్, సిఎన్‌జి ఇంజిన్లను కలిగి ఉంది. ఇది 18 నుండి 26.99 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీటింగ్ ఆప్షన్ ఉంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Tata Punch

5. టాటా నెక్సాన్ : ఈ ఎస్‌యూవీ ధర రూ.8 లక్షల నుండి రూ.15.60 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ సిఎన్‌జి ఇంజిన్లను కలిగి ఉంది. ఇది 17 నుండి 24 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది. ఇందులో 5 సీట్లు ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, July 21, 2025, 14:40 [IST]
English summary
Top 5 tata cars to buy in 2025 starting from rs 6 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+