బీఎస్‌6 వచ్చినా బెదరని డీజిల్ కార్లు.. ఈ 5 కార్లు మార్కెట్‌ను ఏలుతున్నాయి.. రూ.10లక్షల బడ్జెట్లో టాప్ కార్లు

భారత మార్కెట్లో పెట్రోల్ కార్ల సంఖ్య పెరిగిపోవడం, డీజిల్ కార్ల సంఖ్య తగ్గడం చూస్తూనే ఉన్నాం. దీనికి ప్రధాన కారణం బీఎస్6 నిబంధనలు. ఎందుకంటే డీజిల్ ఇంజిన్‌లను బీఎస్6 కు అప్‌గ్రేడ్ చేయడం ఖర్చుతో కూడుకున్న పని. కానీ డీజిల్ కార్లకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలు ఇప్పటికీ తక్కువ ధరకే డీజిల్ కార్లను అందిస్తున్నాయి. ఈ డీజిల్ కార్లు కేవలం రూ.10లక్షల లోపే అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం కార్ల మార్కెట్‌లో చాలా వరకు పెట్రోల్ కార్లే రాజ్యమేలుతున్నాయి. బీఎస్6 కాలుష్య నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తి ఖర్చు పెరిగింది. దీనితో మారుతి సుజుకి వంటి ప్రముఖ కంపెనీలు డీజిల్ కార్ల ఉత్పత్తిని తగ్గించాయి.

Top Diesel Cars You Can Buy Under Rs 10 Lakhs Post-BS6 Norms

కానీ, డీజిల్ కార్లకు ఉన్న ప్రత్యేక అభిమానుల కోసం, కొన్ని కంపెనీలు ఇప్పటికీ రూ.10 లక్షల లోపు ధరలో మంచి డీజిల్ కార్లను అందిస్తున్నాయి. ఈ కార్లు కేవలం ధరకే కాదు, ఎక్కువ టార్క్, మంచి మైలేజ్, అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తాయి.

1. టాటా నెక్సాన్
టాటా మోటార్స్ నుండి వచ్చిన నెక్సాన్ ఒక కాంపాక్ట్ ఎస్‌యూవీ. దీని స్మార్ట్ ప్లస్ వేరియంట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. రూ.10 లక్షల లోపు ఎక్స్-షోరూమ్ ధరతో ఈ కారు లభిస్తుంది. ఈ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. నెక్సాన్ దాని స్ట్రాంగ్ బాడీ, సేఫ్టీకి ప్రసిద్ధి చెందింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ పొందింది.

Top Diesel Cars You Can Buy Under Rs 10 Lakhs Post-BS6 Norms

2. మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ
మహీంద్రా సరికొత్త ఎస్‌యూవీ ఇది. దీని ఎంఎక్స్2 వేరియంట్ నుండే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు అడ్వాన్సుడ్ ఫీచర్లు, స్ట్రాంగ్ పర్ఫామెన్స్ కారణంగా మార్కెట్లో మిగతా కార్లకు మంచి పోటీ ఇస్తుంది.

3. మహీంద్రా బొలెరో
మహీంద్రా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో బొలెరో ఒకటి. విశాలమైన ఇంటీరియర్, ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్లే కెపాసిటీ బొలెరో స్పెషాలిటీ. రూ.10 లక్షల లోపు ధరలో బొలెరో మాత్రమే కాకుండా దాని మరొక వెర్షన్ అయిన బొలెరో నియో కూడా డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మంచి పనితీరుతో గుర్తింపు పొందాయి.

Top Diesel Cars You Can Buy Under Rs 10 Lakhs Post-BS6 Norms

4. కియా సోనెట్
కొరియన్ స్టైల్ ఎస్‌యూవీ అయిన కియా సోనెట్ దాని ప్రీమియం డిజైన్, ఫీచర్లకు పేరుగాంచింది. ఈ కారులో హెచ్‌టీఈ (ఆప్షనల్) వేరియంట్ నుండి రూ.10 లక్షల లోపు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. దీనిని కంపెనీ భారతదేశంలో తయారు చేసింది. దాని అద్భుతమైన మైలేజ్ కారణంగా బాగా పాపులర్ అయింది.

5. హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ వెన్యూ కూడా రూ.10 లక్షల లోపు డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌ను అందిస్తోంది. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ రెండూ ఒకే కంపెనీకి చెందినవి కాబట్టి, ఈ రెండు కార్లలో ఒకే 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లభిస్తుంది. వెన్యూ దాని ఫీచర్లు, సౌకర్యం, అద్భుతమైన పర్ఫామెన్స్ కారణంగా మంచి అమ్మకాలను నమోదు చేస్తుంది.

Top Diesel Cars You Can Buy Under Rs 10 Lakhs Post-BS6 Norms

6. టాటా ఆల్ట్రోజ్
టాటా నుండి వచ్చిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్. దీని ప్యూర్ వేరియంట్ నుండి డీజిల్ ఇంజిన్ ఆప్షన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. నెక్సాన్ లాగే, ఆల్ట్రోజ్ కూడా గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఇది సేఫ్టీకి ప్రాధాన్యత ఇచ్చేవారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

గమనిక: పైన పేర్కొన్న ధరలు అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఆన్-రోడ్ ధరలు రిజిస్ట్రేషన్, పన్నులు, ఇన్సూరెన్స్ వంటి ఎక్స్ ట్రా ఖర్చుల వల్ల ఇంకా కొన్ని లక్షలు ఎక్కువగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, September 10, 2025, 7:14 [IST]
English summary
Top diesel cars you can buy under rs 10 lakhs post bs6 norms
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+