ఇండియాలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 కాంపాక్ట్ ఎస్‎యూవీలు ఇవే.. ఈ ఐదు పెట్రోల్ ఆటోమేటిక్ కార్లే!

ప్రస్తుతం దేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ విస్తరిస్తుంది. కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య అమాంతం పెరుగుతోంది. దీంతో కార్ల కంపెనీలు కూడా వారి అవసరాలకు అనుగుణంగా కొత్త మోడల్స్ తీసుకొస్తున్నాయి. అలాగే ప్రస్తుతం మెట్రో సిటీల్లో పెరుగుతున్న ట్రాఫిక్‎కు అనుగుణంగా తిరగడానికి వీలుగా ఆటోమేటిక్ కార్లను పెంచుతున్నాయి కంపెనీలు.

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కార్ మోడల్స్‎కు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా, పెట్రోల్ ఇంజిన్లతో లభించే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కార్లకు దేశంలో రెట్టింపు ఆదరణ లభిస్తోంది. ఈ పోస్ట్‌లో పెట్రోల్ ఇంజిన్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యధిక మైలేజ్ కలిగిన టాప్ ఐదు కార్ మోడళ్ల గురించి తెలుసుకుందాం.

Petrol Automatic Cars With High Milage

మారుతి సుజుకి బ్రెజ్జా: మారుతి సుజుకి బ్రెజ్జా ఈ జాబితాలో టాప్ పొజిషన్లో ఉంది. ఈ కారు లీటరుకు 19.80 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. 1.5-లీటర్ K15C ఇంజిన్‌తో లభించే ఈ SUV, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్లను అందిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 11.15 లక్షలు (ఎక్స్-షోరూమ్).

ఇండియాలో బ్రెజ్జా నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి LXi, VXi, ZXi, ZXi+. ఈ కారు మోడల్‌లో 1.5-లీటర్, K15C ఇంజిన్ ఉపయోగించారు. ఈ మోటారు గరిష్టంగా 103 bhp పవర్, 137 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మోడల్ రెండు గేర్‌బాక్స్ ఆఫ్షన్లను అందిస్తుంది. అవి 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్.

Maruti Brezza

కియా సోనెట్: కియా సోనెట్ కూడా మంచి మైలేజీనిచ్చే ఆటోమేటిక్ పెట్రోల్ కార్లలో ఒకటి. ఇది లీటరుకు 19.20కి.మీ. వరకు మైలేజీని అందిస్తుంది. అందుకే ఈ జాబితాలో సోనెట్ మారుతి బ్రెజ్జా తర్వాత స్థానంలో ఉంది. ఈ కారును పెట్రోల్ ఆప్షన్‌లోనే కాకుండా డీజిల్ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఆఫ్షన్లు కూడా ఉన్నాయి.

Take a Poll

అదేవిధంగా, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ IMT, 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆఫ్షన్లలో కూడా లభిస్తుంది. దీని ధర రూ. 12.70 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.

KIA Sonet

మహీంద్రా XUV 3XO: మహీంద్రా XUV 3XO కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించింది. ఈ మోడల్ మహీంద్రా ఉత్పత్తి చేసే కార్లలో అత్యధికంగా అమ్ముడయ్యే కారు. దీని పెట్రోల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లీటరుకు 17.96 కి.మీ నుంచి 18.2 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఈ కారు మూడు ఇంజిన్ ఆఫ్షన్లలో లభిస్తుంది. దీని ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 13.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్).

హ్యుందాయ్ వెన్యూ: హ్యుందాయ్ వెన్యూ కూడా మంచి మైలేజీనిచ్చే SUV. దీని పెట్రోల్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లీటరుకు 18.31 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్, 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 11.95 లక్షలకు లభిస్తుంది.

Hyundai Venue

టాటా నెక్సాన్: ఈ మోడల్ ఆఖరి స్థానంలో ఉన్నప్పటికీ ఇది మంచి మైలేజీని అందిస్తుంది. ఈ కారు గత నెలలో టాటా కార్లలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. దీని పెట్రోల్ ఆటోమేటిక్ ఆప్షన్ లీటరుకు 17.18 కి.మీ మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా, ఇది సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారు పెట్రోల్, డీజిల్, CNG, ఎలక్ట్రిక్ వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 9.60 లక్షలు.

డ్రైవ్‌స్పార్క్ వ్యాఖ్య : ఈ పోస్ట్‌లో పెట్రోల్ ఆటోమేటిక్ కార్లలో అధిక మైలేజీని కోరుకునే కస్టమర్లకు అనువైన కార్ మోడళ్లను మాత్రమే అందించాం. ఈ కార్ మోడళ్లు SUV లను ప్రత్యేకంగా ఇష్టపడే కస్టమర్లకు అదనపు జాక్‌పాట్ అవుతాయని భావిస్తున్నాం. ఈ కార్లలో ఒకదాన్ని కొనడం వల్ల మీకు ఎక్కువ మైలేజ్ రావడమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది.

Tata Nexon

పైన పేర్కొన్న కార్లలో వివిధ రకాల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు ఉపయోగించారు. వీటిలో టార్క్ కన్వర్టర్, AMT (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్), DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్), IMT (ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) ఉన్నాయి. ప్రతి ట్రాన్స్‌మిషన్ రకానికి దాని స్వంత ప్రయోజనాలు, ప్రతికూలతలు ఉన్నాయి. ఉదాహరణకు, DCT స్పీడుగా గేర్ మార్పులను అందిస్తుంది. అయితే AMT మరింత కాస్త తక్కువ ధరలో లభిస్తుంది.

కారు మైలేజీ అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటిలో డ్రైవింగ్ ఎలా చేస్తున్నారు, ట్రాఫిక్ పరిస్థితులు, వెహికల్ మెయింటెనెన్స్, టైర్ ప్రెజర్ ఉన్నాయి. ఆటోమేటిక్ కార్లు మాన్యువల్ కార్ల కంటే కొంచెం తక్కువ మైలేజీని అందిస్తాయి, ఎందుకంటే గేర్ మార్పులను ఆటోమేటిక్‌గా చేయడానికి అదనపు శక్తి అవసరం అవుతుంది. ఈ కార్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

Mahindra XUV 3Xo

భారతదేశంలో ట్రాఫిక్ పరిస్థితులు పెరుగుతున్నందున, ఆటోమేటిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. కొత్తగా మార్కెట్ లోకి విడుదల అవుతున్న కార్లల్లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఆటోమేటిక్ కార్ల ధరలు మాన్యువల్ కార్ల కంటే కొంచెం ఎక్కువ. ఈ కార్లలో అనేక ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 26, 2025, 12:00 [IST]
English summary
Top5 petrol automatic cars with the best mileage in india fuel efficient suv models for city driving
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+