2024లో లేటుగా వచ్చినా రికార్డులు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ కారు.. అందరూ ఈ కారే కావాలంటున్నారు!

కార్ల అమ్మకాలతో భారత ఆటోమొబైల్ మార్కెట్ వెలిగిపోతోంది. మిడిల్ క్లాస్ నుంచి బిలియనీర్ వరకు ప్రతి ఒక్కరూ తమ అవసరాల కోసం కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే తరుణంలో.. ఫ్యూయల్ ఖర్చుల నుంచి తప్పించుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లవైపు అందరూ మొగ్గు చూపుతున్నారు. దీంతో గత కొద్ది కాలంగా ఈవీల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డిసెంబరులో దిగ్గజ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్.. తమ బ్రాండ్ నుంచి Windsor EV సేల్స్‌లో అదరగొట్టింది. "అయామ్ అన్ ప్రెడిక్టిబుల్" అన్నట్లుగా ఊహకందని విధంగా.. కస్టమర్స్‌ని ఆకట్టుకుంది. ఈ నెలలో ఈ కార్ల అమ్మకాలు ఎలా సాగాయో ఇప్పుడు చూద్దాం.

భారత్‌లో ఎంజీ మోటార్ సంస్థ నుంచి ఇది మూడో ఈవీ. గత నెలలో ఈ కారు ఏకంగా 7,516 యూనిట్ల అమ్మకాలను రాబట్టింది. 2023లో ఇదే డిసెంబర్ నెలతో పోలిస్తే 2024 డిసెంబరులో విండ్సర్ ఈవీ అమ్మకాల్లో 55శాతం వృద్ధి సాధించింది ఎంజీ మోటార్ సంస్థ. గతేడాది పండుగ సీజన్ సందర్భంగా లాంచ్ చేసిన ఈ కారు.. తక్కువ సమయంలోనే కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

MG Windsor EV Sales in December 2024

తమ సంస్థ నుంచి మొత్తం అమ్మకాల్లో 70శాతం వాటా ఎలక్ట్రిక్ కార్లదేనని ఎంజీ మోటార్స్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఈవీ అమ్మకాల్లోనూ అధికా వాటా విండ్సర్ ఈవీదే కావడం గమనార్హం. మరో విశేషం ఏంటంటే... జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ మోటార్ సంస్థ కలయిక నుంచి వచ్చిన మొదటి కారు కూడా విండ్సర్ ఈవీనే.

విండ్సర్ ఈవీ కారు ఇండియాలో... Turquoise Green, Pearl White, Clay Beige and Starburst Black వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ కారు బయటివైపు నుంచి ఆకర్షణీయమైన డిజైన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ఫ్రంట్ అండ్ రియర్ ఎల్ఈడీ లైట్ బార్స్‌తో ఉంటుంది.

MG Windsor EV Sales

ఈ కారులో L ఆకారంలో ఉండే ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఫ్లష్ ఫిట్టింగ్ డూర్ హ్యాండిల్స్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, 215/55 R18 టైర్లు ఉంటాయి. కారులోపల చూసినట్లయితే ఇందులో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియెంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

యాంబియెంట్ లైటింగ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఆధునాతన ఫీచర్లు కూడా ఈ విండ్సర్ ఈవీలో ఉంటాయి. ఈ కారు ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్‌తో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రయాణికులకు పటిష్ఠ రక్షణ ఇచ్చే విధంగా డిజైన్ చేయబడింది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ కలవు.

WMG Windsor EV Sales Rivals

అలాగే టీపీఎంస్(Tire Pressure Monitoring System), ఈఎస్‌సీ (Electronic Stability Control), 360 డిగ్రీ కెమెరా వంటి సదుపాయాలు ఇందులో ఉంటాయి. అయితే ఇందులో ఏడీఏఎస్(అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్స్ లేకపోవడం ఒక లోటుగా చెప్పవచ్చు. ఏదైమైనా.. ప్రస్తుతం ఎంజీ మోటార్స్ సంస్థ నుంచి ఈ విండ్సర్ అమ్మకాలతో అదరగొడుతోంది. సింగిల్ బ్యాచ్‌లో ఈ సంస్థ నుంచి ఏకంగా 101 కార్లు రావడం ఒక పెద్ద విశేషంగా పేర్కొనవచ్చు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, January 3, 2025, 12:22 [IST]
English summary
Windsor ev sales in december 2024 highest ever since launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+