ఈ కారులో వెళితే ప్రాణాలకు ఫుల్ సేఫ్టీ.. పైగా లీటరుకు 24కిమీ ఇస్తుంది..కాబట్టే దేశంలోనే నం.1 అయింది
టాటా మోటార్స్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్ (Tata Nexon)తో భారతీయ రోడ్లపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతోంది. 2025 సంవత్సరం ఆరంభం నుంచి ముగింపు వరకు అమ్మకాల్లో నెంబర్ 1 స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్న నెక్సాన్, డిసెంబర్ 2025లో కూడా తన జోరును కొనసాగించింది. కేవలం గడిచిన ఒక్క నెలలోనే సుమారు 19,400 యూనిట్లు అమ్ముడయ్యాయంటే, ఈ కారుపై జనాలకు ఉన్న నమ్మకం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
టాటా నెక్సాన్ 2025 చివరి మూడు నెలల్లో తన సత్తాను చాటింది. సెప్టెంబర్ (22,573 యూనిట్లు), అక్టోబర్ (22,083 యూనిట్లు), నవంబర్ (22,434 యూనిట్లు) అమ్మకాలను చూస్తే, ఇది దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా నిలిచింది. డిసెంబర్ నాటికి సుమారు 19,400 యూనిట్లు విక్రయించి, మారుతి, హ్యుందాయ్ వంటి దిగ్గజాలకు నిద్ర లేకుండా చేస్తోంది. 2025 క్యాలెండర్ ఇయర్‌లో నెక్సాన్ ఏకంగా 2.01 లక్షల యూనిట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది.

మధ్యతరగతి కుటుంబాలకు టాటా నెక్సాన్ ఒక కలల కారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8.00 లక్షల నుంచి ప్రారంభమై రూ.14.15 లక్షల వరకు ఉంటుంది. ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోలిస్తే, నెక్సాన్ ఇచ్చే బిల్డ్ క్వాలిటీ, ఫీచర్లు సామాన్యుడి బడ్జెట్‌కు సరిగ్గా సరిపోతాయి. తక్కువ మెయింటెనెన్స్, టాటా సర్వీస్ సెంటర్ల నెట్‌వర్క్ ఈ కారు విజయానికి మరో ప్రధాన కారణం.
భారతీయులు కారు కొనేటప్పుడు ఇప్పుడు ప్రధానంగా చూసేది సేఫ్టీ. ఈ విషయంలో నెక్సాన్ ఏమాత్రం రాజీ పడదు. Bharat NCAP క్రాష్ టెస్టుల్లో నెక్సాన్ 5-స్టార్ రేటింగ్ సాధించింది. గడిచిన ఏడాదిలో వచ్చిన కొత్త వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా మార్చారు. అలాగే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ESC), ట్రాక్షన్ కంట్రొల్, పటిష్టమైన బాడీ స్ట్రక్చర్‌తో ప్రయాణించే వారి ప్రాణాలకు భరోసా ఇస్తోంది. అందుకే ఫ్యామిలీ మ్యాన్ మొదటి ఛాయిస్ ఎప్పుడూ నెక్సాన్ నే!

నెక్సాన్ కేవలం సేఫ్టీలోనే కాదు, మైలేజీలో కూడా ముందంజలో ఉంది. పెట్రోల్ మోడల్ లీటరుకు 17-19 కి.మీ మైలేజీ ఇస్తుండగా, డీసెల్ వేరియంట్ ఏకంగా 21-24 కి.మీ మైలేజీ ఇస్తోంది. ఇక ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా నెక్సాన్ ఈవీ (Nexon EV) తన సత్తా చాటుతోంది. ఇటీవల ప్రవేశపెట్టిన CNG మోడల్ కూడా సామాన్యుడి జేబుకు భారం తగ్గించేలా మైలేజీ ఇస్తుండటంతో అమ్మకాలు మరింత పెరిగాయి.
కారు లోపల అడుగుపెడితే ఇది సామాన్యుడి కారు అని ఎవరూ అనలేరు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మారుస్తాయి. వాయిస్ కమాండ్ ద్వారా సన్‌రూఫ్ ఓపెన్ చేయడం వంటి ఫీచర్లు నేటి తరం వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications








