తక్కువ బడ్జెట్‌లో ADAS కార్లు.. టాటా, మహీంద్రా, కియా, హోండాలకు చెందిన టాప్ 4 కార్లు ఇవే
భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. కారు కొనేటప్పుడు కేవలం కలర్, డిజైన్ చూసి మురిసిపోయే రోజులు పోయాయి. కస్టమర్లు ఇప్పుడు గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) రేటింగ్స్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ADAS (Advanced Driver Assistance System) టెక్నాలజీ ఉన్న వాహనాలకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రమాదాలను ముందుగానే గుర్తించి కారును అలర్ట్ చేసే ఈ అద్భుతమైన ఫీచర్ ఉన్న కొన్ని అఫోర్డబుల్ కార్ల వివరాలను చూద్దాం.. ఈ లిస్ట్‌లోని కార్ల ఆన్-రోడ్ ధర రూ. 16 లక్షల కంటే తక్కువగానే ఉండటం విశేషం.
టాటా నెక్సాన్ ఫియర్‌లెస్+ PS A (Tata Nexon)
భారతీయ సేఫ్టీ కార్ల రారాజు టాటా మోటార్స్ తమ పాపులర్ ఎస్‌యూవీ నెక్సాన్ (Nexon)లోని టాప్ వేరియంట్ Fearless+ PS Aలో అత్యాధునిక Level-2 ADAS టెక్నాలజీని అందిస్తోంది. ముంబైలో ఈ మోడల్ ఆన్-రోడ్ ధర సుమారు రూ.15.99 లక్షలుగా ఉంది. ఈ వేరియంట్‌లో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో పాటు డీసీటీ (DCT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలయిక లభిస్తుంది.

అయితే ఇందులో డీజిల్, సీఎన్‌జీ లేదా మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లేవు. ఇందులో ఉండే అడాస్ ఫీచర్ల ద్వారా ఫ్రంటల్ కొలిజన్ వార్నింగ్ (ముందు వాహనాన్ని ఢీకొట్టకుండా హెచ్చరించడం), ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి పటిష్టమైన రక్షణ లభిస్తుంది.
కియా సోనెట్ జీటీఎక్స్+ (Kia Sonet GTX+)
సరికొత్త లుక్, మోడ్రన్ ఫీచర్లతో దూసుకుపోతున్న కియా సోనెట్ (Kia Sonet) GTX+ వేరియంట్‌లో Level-1 ADAS ఫీచర్‌ను కంపెనీ ఇస్తోంది. ముంబై మార్కెట్లో దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ. 15.91 లక్షలుగా ఉంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీలో కస్టమర్లకు డీజిల్ ఆటోమేటిక్, టర్బో-పెట్రోల్ డీసీటీ (DCT) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి, కానీ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో రాదు.

దీని అడాస్ సూట్‌లో ఫార్వర్డ్ కొలిజన్ అసిస్ట్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై-బీమ్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ (ముందు వాహనం కదిలితే ఇచ్చే అలర్ట్) వంటి క్రేజీ ఫీచర్లు ఉన్నాయి. భవిష్యత్తులో సోనెట్‌లో మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లు వచ్చే ఛాన్స్ ఉంది.
మహీంద్రా XUV3XO ఏఎక్స్5ఎల్ (Mahindra XUV3XO AX5L)
అత్యంత తక్కువ ధరలోనే పవర్‌ఫుల్ Level-2 ADAS ఫీచర్ కావాలనుకునే వారికి మహీంద్రా కంపెనీ తెచ్చిన సరికొత్త XUV3XO ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులోని 'AX5L' వేరియంట్ ముంబైలో కేవలం రూ. 14.27 లక్షల ఆన్-రోడ్ ధరకే లభిస్తోంది. ఈ ఎస్‌యూవీలో టర్బో-పెట్రోల్, డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లతో పాటు.. కస్టమర్లు తమకు నచ్చిన విధంగా మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎంచుకోవచ్చు. తక్కువ ధరలోనే ఈ కారులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ సెంటరింగ్ వంటి ప్రీమియం సేఫ్టీ ఫీచర్లను మహీంద్రా అందిస్తోంది.

హోండా అమేజ్ జెడ్ఎక్స్ (Honda Amaze ZX)
ఎస్‌యూవీలు కాకుండా ఒక మంచి ఫ్యామిలీ సెడాన్ కారును తక్కువ బడ్జెట్‌లో కొనాలనుకునే వారికి హోండా అమేజ్ (Honda Amaze) ZX వేరియంట్ బెస్ట్ ఛాయిస్. ఈ కారులో Level-1 ADAS సూట్‌ను అందించారు. దీని ఆన్-రోడ్ ధర కేవలం రూ. 10.76 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇంత తక్కువ ధరలో అదాస్ లాంటి మోడ్రన్ సేఫ్టీ టెక్నాలజీ దొరకడం ఈ సెగ్మెంట్‌లో ఇదే మొదటిసారి. ఈ కారులో డ్రైవింగ్‌ను సులువు చేసేలా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్, ఆటో హై-బీమ్, కొలిజన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్స్ వంటి అత్యవసర భద్రతా వసతులను హోండా ఏర్పాటు చేసింది.


Click it and Unblock the Notifications