మిడిల్ క్లాస్ వారు ఎక్కువగా కొనే కార్లు.. ధర చాలా తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. ఇండియాలో చాలా పాపులర్!

ఎస్‌యూవీలకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లకు ఉన్న ఆదరణను దాటి Suv సెగ్మెంట్ దూసుకుపోతుంది. అయితే, గతంలో మాదిరిగా కాకపోయినా సెడాన్ కార్లను కొనుగోలు చేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి, హ్యుందాయ్‌, టాటా మోటార్స్‌ వంటి తయారీదారులకు చెందిన పలు సెడాన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ దగ్గర బడ్జెట్ రూ.7 లక్షల వరకు ఉండి, కొత్త సెడాన్ కొనుగోలు చేయాలనే ఆలోచిస్తున్న వారికి ఈ కథణంలో మూడు సెడాన్ల గురించి వివరించడం జరిగింది. మారుతికి చెందిన, దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న డిజైర్, హ్యుందాయ్‌కి చెందిన ఆరా, అలాగే, టాటా మోటార్స్‌కు చెందిన టిగోర్ కార్ల గురించి ఇక్కడ చూద్దాం.

Maruti Suzuki Dzire: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మొత్తం కార్లలో మారుతి సుజుకి డిజైర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఇండియా మధ్యతరగతి ప్రజలకు ఇది చాలా ఇష్టమైన కారు. దీని ధర ప్రస్తుతం భారత మార్కెట్లో ప్రారంభ ఎక్స్ షోరూమ్ రూ.625,600. టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి రూ.9.31 లక్షల మధ్య ఉంది. ఇది 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.2-లీటర్ CNG ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

Best Affordable Sedan Cars In India Maruti Dzire Hyundai Aura And Tata Tigor

మైలేజ్ విషయానికి వస్తే, సీఎన్‌జీ వేరియంట్లు 33.73 కిలోమీటర్లు/కిలో వరకు, పెట్రోల్ వేరియంట్లు 24.79 కిలోమీటర్లు/లీటర్ వరకు ఇస్తాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కారు LXI, VXI, ZXI, ZXI+ వేరియంట్లలో కొనుగోలు చేయడానికి లభిస్తుంది. ఇక, ఫీచర్స్ విషయానికి వస్తే, లోపల కూర్చున్న ప్రయాణికులకు అవసరమయ్యే అన్ని అధునాతన వ్యవస్థలను స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్,కంఫర్ట్ సీట్లు మొదలగుని ఉన్నాయి.

Hyundai Aura: దక్షిణ కొరియా దిగ్గజ హ్యుందాయ్‌ ప్రసిద్ద సెడాన్ ఆరా భారత మార్కెట్లో ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6 లక్షల వరకు లభిస్తుంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి కాస్త ఎక్కువగా రూ.8.60 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు వెళ్తుంది. దీని పవర్‌ట్రెయిన్ గురించి చూసినట్లయితే, 1.2-లీటర్ కప్పా పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. ఇది 82 bhp శక్తిని ఉత్పత్తి చేస్తూ మంచి పనితీరును అందిస్తుంది.

Best Affordable Sedan Cars In India Maruti Dzire Hyundai Aura And Tata Tigor

ఈ కారులో అందించిన ఫీచర్స్ గురించి చూసినట్లయితే, దీని లోపల సీట్లు చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. అలాగే, విశాలమైన లెగ్‌రూమ్‌‌తో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసే సమయంలో ఎలాంటి అలసట అనిపించదు. ముఖ్యంగా 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ద్వారా మీకు కావాల్సిన వివరాలను సులభంగా చూసుకోవడంతో పాటు ఇంటీరియర్ అంశాలను కూడా కంట్రోల్ చేయగలరు. ఇది పెట్రోల్‌తో 17 కి.మీలు, సీఎన్‌జీలో 22 కిమీ మైలేజ్ ఇస్తుంది.

Tata Tigor: ప్రముఖ వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌కు చెందిన టాటా టిగోర్ తక్కువ ధరలో మార్కెట్లో లభిస్తున్న సెడాన్ కార్లలో ఒకటి. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర వచ్చేసి రూ.5.55 లక్షల నుంచి మొదలై టాప్ ఎండ్ వేరియంట్ రూ.8.84 లక్షల వరకు చేరుతుంది. ఆన్‌రోడ్ ధర అయితే దేశంలోని ప్రాంతాలను బట్టి అక్కడి స్థానిక ఛార్జీలు, ఇన్సూరెన్స్, మొదలగు వాటితో కలుపుకుని కాస్త ఎక్కువగా ఉంటుంది.

Best Affordable Sedan Cars In India Maruti Dzire Hyundai Aura And Tata Tigor

దీని పవర్‌ట్రెయిన్ గురించి చూసినట్లయితే, 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 84 bhp శక్తిని ఉత్పత్తి చేస్తూ మంచి పనితీరును అందిస్తుంది. ప్రధానంగా మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్‌ 19 కి.మీ, CNG వేరియంట్ కిలో సీఎన్‌జీకి దాదాపుగా 26.49 కి.మీ వరకు అందిస్తుంది. దీని సేఫ్టీ గురించి మాట్లాడితే, ఈ కారుకు గ్లోబల్ NCAP రేటింగ్‌లో 4-స్టార్ పొందడం విశేషం.

Article Published On: Friday, July 17, 2026, 9:06 [IST]
English summary
Best affordable sedan cars in india maruti dzire hyundai aura and tata tigor
Read more on: #auto news #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+