క్లచ్ నొక్కే పనిలేదు.. గేర్లు మార్చే తలనొప్పి లేదు.. జస్ట్ రూ.5 లక్షల్లో దొరికే టాప్ కార్లు ఇవే

ట్రాఫిక్‌లో పదే పదే గేర్లు మారుస్తూ, క్లచ్ నొక్కలేక విసిగిపోతున్నారా? ఒక మంచి ఆటోమేటిక్ కారు కొనాలని ఉందా.. కానీ బడ్జెట్ తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో తక్కువ బడ్జెట్‌లోనే బెస్ట్ ఆటోమేటిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. టాటా, మారుతి సుజుకి, నిస్సాన్ వంటి ప్రముఖ కంపెనీలు అదిరిపోయే డిజైన్, పవర్‌ఫుల్ ఇంజన్, అదిరిపోయే ఇంటీరియర్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆటోమేటిక్ కార్లను అందిస్తున్నాయి. రూ.5 లక్షల లోపు ప్రారంభ ధరతో లభించే టాప్ అఫోర్డబుల్ ఆటోమేటిక్ కార్ల పూర్తి వివరాలు తెలుసుకుందాం.

1. మారుతి సుజుకి ఆల్టో K10:
మారుతి సుజుకి నుంచి వచ్చిన మోస్ట్ పాపులర్, బడ్జెట్ ఫ్రెండ్లీ మోడల్ ఆల్టో K10. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పోలిస్తే దీని ఏఎమ్‌టీ (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్) వేరియంట్ కొంచెం స్లోగా అనిపించినప్పటికీ, సింగిల్ క్లచ్ ఆటోమేటిక్‌గా ఇది చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

Best Budget Automatic Cars in India Top AMT Cars Starting Under Rs 5 Lakh
సిటీ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయడానికి ఈ కారు చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. దీనిలోని క్రీప్ ఫంక్షన్ వల్ల బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో కారును చాలా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. హైవేలపై ఓవర్‌టేక్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ యాక్సిలరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కారు ఆటోమేటిక్ మోడల్ ధర రూ.4.95 లక్షల నుంచి రూ.5.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉంది.

2. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్:
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్లలో మారుతి వ్యాగన్ ఆర్ (Wagon R) ఒకటి. ఈ కారు రెండు రకాల పవర్‌ఫుల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో పాటు ఆటోమేటిక్ (AMT) గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో మొదటిది 69 హార్స్‌పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ఇచ్చే 1.0-లీటర్ ఇంజన్ కాగా.. రెండోది 91 హార్స్‌పవర్, 114 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.2-లీటర్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు మార్కెట్లో ఎంతో నమ్మకమైనవిగా, మంచి మైలేజ్ ఇచ్చేవిగా పేరు తెచ్చుకున్నాయి. ఈ మోడ్రన్ టాల్‌బాయ్ కారు ఆటోమేటిక్ వేరియంట్ల ధరలు రూ.5.97 లక్షల నుండి రూ.6.95 లక్షల వరకు ఉన్నాయి.

Best Budget Automatic Cars in India Top AMT Cars Starting Under Rs 5 Lakh

3. టాటా టిగోర్:
టాటా మోటార్స్ తమ స్టైలిష్ సెడాన్ కారు టిగోర్ (Tata Tigor)లో పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ (CNG) ఆప్షన్‌లోనూ ఏఎమ్‌టీ (AMT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందిస్తోంది. దీని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 86 హార్స్‌పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఇస్తుంది.

అదే సీఎన్‌జీ మోడ్‌లో అయితే 76 హార్స్‌పవర్, 97 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కస్టమర్లకు బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) కొరత లేకుండా టాటా ఇందులో 'ట్విన్ సిలిండర్ టెక్నాలజీ'ని వాడింది. దీనివల్ల సిఎన్‌జీ సిలిండర్లు ఉన్నప్పటికీ సామాన్లు పెట్టుకోవడానికి గరిష్ట స్థలం లభిస్తుంది. దీని ధర రూ.6.80 లక్షల నుండి రూ.8.84 లక్షల మధ్య ఉంటుంది.

Best Budget Automatic Cars in India Top AMT Cars Starting Under Rs 5 Lakh

4. నిస్సాన్ మాగ్నైట్:
కాంపాక్ట్ ఎస్‌యూవీ లవర్స్ కోసం నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో 72hp పవర్ ఇచ్చే 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌తో పాటు ఏఎమ్‌టీ (AMT) గేర్‌బాక్స్ లభిస్తుంది. అలాగే మరింత పవర్ కావాలనుకునే వారి కోసం 100hp పవర్‌తో నడిచే టర్బో-పెట్రోల్ సీవీటీ (CVT) ఆటోమేటిక్ ఆప్షన్ కూడా ఉంది.

Best Budget Automatic Cars in India Top AMT Cars Starting Under Rs 5 Lakh

ఈ టర్బో ఇంజన్ లో-ఆర్‌పిఎమ్ (Low RPM) వద్ద కూడా ఎలాంటి లాగ్ లేకుండా స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బడ్జెట్ పరంగా చూస్తే మాగ్నైట్ బేస్ ఆటోమేటిక్ వేరియంట్ దాని పోటీ కారు రెనాల్ట్ కైగర్ కంటే దాదాపు రూ.76,000 వరకు చౌకగా వస్తుంది. దీని ధరలు రూ.6.24 లక్షల నుంచి రూ.10.96 లక్షల వరకు ఉన్నాయి.

Article Published On: Monday, June 1, 2026, 7:32 [IST]
English summary
Best budget automatic cars in india top amt cars starting under rs 5 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+