బడ్జెట్ తక్కువ.. బిల్డప్ ఎక్కువ.. మిడిల్ క్లాస్ వాళ్ల కోసమే తెచ్చిన లగ్జరీ కారు మావ.. అస్సలు మిస్సవ్వద్దు

టాటా కర్వ్ (Tata Curvv) వంటి ఖరీదైన కూపే ఎస్‌యూవీని కొనాలని ఉందా? కానీ బడ్జెట్ తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం మార్కెట్లోకి ఒక అదిరిపోయే ఆప్షన్ వచ్చేసింది. అదే సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్(Citroen Basalt X). చూడటానికి ఎంతో స్టైలిష్‌గా, ప్రీమియం లుక్‌తో కనిపిస్తున్న ఈ కారు.. ధర విషయంలో మాత్రం సామాన్యుడికి అందుబాటులో ఉంది. కేవలం రూ.8.15 లక్షల ప్రారంభ ధరతో, అదిరిపోయే మైలేజీని ఇస్తూ ఇప్పుడు కార్ల ప్రేమికుల హాట్ ఫేవరెట్ గా మారింది. అసలు ఈ కారులో ఏముంది? ఇది టాటా కర్వ్‌కు గట్టి పోటీ ఇస్తుందా? అనే వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్లో టాటా కర్వ్ ధరలు రూ.9.66 లక్షల నుంచి రూ.18.85 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. కానీ దీనికి ధీటుగా వచ్చిన సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ కేవలం రూ.8.15 లక్షల నుండే ప్రారంభమవుతుంది. దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.13.56 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. అంటే టాటా కర్వ్‌తో పోలిస్తే మీరు లక్షల్లో ఆదా చేసుకోవచ్చు. ఈ కారు ప్రధానంగా ప్లస్(Plus), మ్యాక్స్(Max) అనే రెండు కీలక వేరియంట్లలో లభిస్తోంది. ప్రతి వేరియంట్ కూడా ఒకదానికొకటి పోటీ ఇచ్చేలా అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి.

Citroen Basalt X Launched at Rs 8 15 Lakh Affordable Coupe SUV to Rival Tata Curvv

సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ డిజైన్ పరంగా చాలా ఆధునికంగా ఉంటుంది. దీని కూపే స్టైల్ రూఫ్ లైన్ (వెనుక వైపు వంగి ఉండే ఆకారం) దీనికి స్పోర్టీ లుక్ ఇస్తుంది. ముందు భాగంలో షార్ప్ గా ఉండే LED హెడ్ లైట్లు, పగటిపూట మెరిసే LED DRLలు, వెనుక వైపు స్టైలిష్ LED టైల్ లైట్లు కారు అందాన్ని రెట్టింపు చేస్తాయి.

16-ఇంచుల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఈ కారుకు ప్రీమియం అప్పీల్ ఇస్తాయి. ఇక రంగుల విషయానికి వస్తే.. పోలార్ వైట్, స్టీల్ గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది అందుబాటులో ఉంది. ప్రతి కలర్ కూడా కారు బాడీకి ఒక కొత్త మెరుపును ఇస్తుంది. ఈ ఎస్‌యూవీ కేవలం బయట చూడటానికే కాదు, లోపల కూడా చాలా విశాలంగా ఉంటుంది. దీని పొడవు 4,371 మి.మీ, వెడల్పు 1,907 మి.మీ, ఎత్తు 1,627 మి.మీ ఉంటుంది.

Citroen Basalt X Launched at Rs 8 15 Lakh Affordable Coupe SUV to Rival Tata Curvv

ముఖ్యంగా మన దేశంలోని గుంతల రోడ్లను తట్టుకునేలా ఇందులో 207 మి.మీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. 2,775 మి.మీల పొడవైన వీల్ బేస్ ఉండటం వల్ల వెనుక సీట్లో కూర్చున్న వారికి కూడా లెగ్ స్పేస్ పుష్కలంగా లభిస్తుంది. ఐదుగురు ప్రయాణికులు ఎంతో సౌకర్యవంతంగా లాంగ్ డ్రైవ్స్ వెళ్లవచ్చు. వీకెండ్ ట్రిప్పుల కోసం భారీ లగేజీని తీసుకెళ్లడానికి 470 లీటర్ల బూట్ స్పేస్ ఇవ్వడం మరో పెద్ద ప్లస్ పాయింట్.

పర్ఫార్మెన్స్ విషయంలో సిట్రోయెన్ బసాల్ట్ ఎక్స్ ఎక్కడా తగ్గలేదు. ఇందులో రెండు రకాల పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి:
1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్: ఇది 82 PS పవర్, 115 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నగర ప్రయాణాలకు చాలా పొదుపుగా ఉంటుంది.
1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్: కొంచెం ఎక్కువ వేగం, పవర్ కోరుకునే వారి కోసం ఇది బెస్ట్. ఇది 110 PS పవర్, 190 Nm టార్క్‌ను ఇస్తుంది.

Citroen Basalt X Launched at Rs 8 15 Lakh Affordable Coupe SUV to Rival Tata Curvv

ఈ కారు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, ఇది 18 నుంచి 19.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లు. కేవలం 11.99 సెకన్లలోనే ఇది 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

నేటి తరం కుర్రాళ్లకు కావాల్సిన అన్ని రకాల టెక్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లోపల క్యాబిన్ చూడగానే 10.2 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేను సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్-బటన్ స్టార్ట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, వేసవిలో హాయినిచ్చే వెంట్రిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఈ కారు స్పెషాలిటీ.

సేఫ్టీ విషయంలో సిట్రోయెన్ అస్సలు రాజీ పడలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్ గా వస్తాయి. వీటితో పాటు ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), పార్కింగ్ కోసం రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. కుటుంబంతో సురక్షితంగా ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక గొప్ప భరోసా.

More from DriveSpark

Article Published On: Sunday, February 8, 2026, 11:36 [IST]
English summary
Citroen basalt x launched at rs 8 15 lakh affordable coupe suv to rival tata curvv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+