మెకానిక్ గోల లేదు.. ఇన్సూరెన్స్ బాధలేదు.. ఇక ప్రతి నెల అద్దె చెల్లించి నచ్చిన కారు తీసుకెళ్లొచ్చు

కారు కొనాలనేది మధ్యతరగతి భారతీయుల అతిపెద్ద కల. కానీ మారుతున్న కాలంతో పాటు కార్ల వినియోగంలోనూ విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు కారు కొనాల్సిన పనిలేదు, నెలనెలా అద్దె చెల్లించి మీకు నచ్చిన మోడల్‌ను యజమానిలా వాడుకోవచ్చు. ఈ సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారత్‌లో అడుగుపెట్టింది. నిస్సాన్ తన పాపులర్ మోడల్స్ అయిన మ్యాగ్నైట్ (Magnite), గ్రావైట్ (Gravite) కార్లను లీజుకు ఇచ్చేందుకు సరికొత్త ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.

ఏమిటీ నిస్సాన్ లీజింగ్ ప్రోగ్రామ్?
నిస్సాన్ మోటార్ ఇండియా తన వినియోగదారుల కోసం కార్పొరేట్ లీజింగ్ ప్రోగ్రామ్‎ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రముఖ గ్లోబల్ లీజింగ్ సంస్థ ఏవిస్ ఇండియా (Avis India)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్కీమ్ కింద నిస్సాన్ మ్యాగ్నైట్, గ్రావైట్ మోడల్ కార్లను 60 నెలల (5 ఏళ్ల) వరకు లీజుకు తీసుకోవచ్చు. గరిష్టంగా 50,000 కిలోమీటర్ల వరకు ఈ కారును వినియోగించుకోవచ్చు. దీనికి సంబంధించి నెలవారీ అద్దె కేవలం రూ.9,399 (ట్యాక్స్‌లు కాకుండా) నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఎంచుకునే వేరియంట్, ఫీచర్లను బట్టి ఈ అద్దె మారుతూ ఉంటుంది.

Drive Nissan Magnite Gravite on Monthly Lease No Maintenance No Tension

ఈ భాగస్వామ్యంలో నిస్సాన్ కేవలం కార్ల పంపిణీ బాధ్యతలను మాత్రమే చూసుకుంటుంది. అయితే, ఏవిస్ ఇండియా సంస్థ కారు కొనుగోలు, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్ (సర్వీసింగ్), ఇన్సూరెన్స్, లీజు ముగిసిన తర్వాత అందించే సేవలను చూసుకుంటుంది. అంటే వినియోగదారుడు కేవలం నెలనెలా అద్దె కట్టి, పెట్రోల్ పోయించుకుని కారు నడుపుకుంటే సరిపోతుంది. కారు సర్వీసింగ్ ఎప్పుడు చేయించాలి? ఇన్సూరెన్స్ రినవల్ ఎప్పుడు? అనే టెన్షన్లు ఉండవు. ఈ విధానం ముఖ్యంగా కార్పొరేట్ ఉద్యోగులకు, తరచూ కార్లు మార్చే అలవాటు ఉన్నవారికి వరంగా మారనుంది.

హైదరాబాద్‌లో నిస్సాన్ గ్రావైట్ హవా
నిస్సాన్ తన కొత్త మోడల్ గ్రావైట్ (Gravite) పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇటీవల హైదరాబాద్‌లోని తన డెలివరీ భాగస్వామి వైబ్రెంట్ నిస్సాన్ ద్వారా ఒకే రోజు 100 యూనిట్ల గ్రావైట్ కార్లను డెలివరీ చేసి రికార్డు సృష్టించింది. దక్షిణాది మార్కెట్‌లో నిస్సాన్ తన పట్టును పెంచుకోవడంలో ఈ విక్రయాలు ఎంతో దోహదపడతాయని నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీ సౌరభ్ వత్సా ధీమా వ్యక్తం చేశారు. కస్టమర్లకు మరింత దగ్గర కావడానికి రిటైల్ నెట్‌వర్క్‌ను కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Drive Nissan Magnite Gravite on Monthly Lease No Maintenance No Tension

రాబోతున్న కొత్త ఎస్‌యూవీ
నిస్సాన్ నుంచి రాబోతున్న మరో క్రేజీ అప్‌డేట్ నిస్సాన్ టెక్టాన్. ఇది పాత టెరానో (Terrano) ఎస్‌యూవీకి వారసురాలిగా మార్కెట్లోకి రానుంది. జూన్ 2026 లో ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు ఈ కారుపై ఆసక్తిని పెంచాయి. రెక్కాంగ్యులర్ హెడ్‌లైట్లు, స్లీక్ డిజైన్, పవర్‌ఫుల్ బాడీ వర్క్, ఆధునిక ఫీచర్లతో టెక్టాన్ అలరించనుంది. దీని ధర సుమారు రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కావచ్చని అంచనా.

టెక్టాన్ ఇంజిన్, పెర్ఫార్మెన్స్:
నిస్సాన్ టెక్టాన్ రెండు ఇంజిన్ ఆప్షన్లతో రానుంది. ఒకటి 1.0 లీటర్ టర్బోఛార్జ్డ్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 100 పీఎస్ పవర్, 166 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. రెండవది 1.3 లీటర్ టర్బోఛార్జ్డ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, ఇది ఏకంగా 163 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ మరియు డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఉంటాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఇందులో హైబ్రిడ్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

లీజింగ్ స్కీమ్ ఎవరికి లాభం?
సొంతంగా కారు కొనాలంటే డౌన్ పేమెంట్ కట్టాలి, బ్యాంక్ లోన్ తీసుకోవాలి, ప్రతినెలా భారీ ఈఎంఐలు చెల్లించాలి. వీటన్నిటికీ తోడు ఇన్సూరెన్స్, ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్వీసింగ్ ఛార్జీలు తడిసి మోపెడవుతాయి. కానీ నిస్సాన్ లీజింగ్ స్కీమ్‌లో ఇవేమీ ఉండవు. మీకు నచ్చినంత కాలం వాడుకుని, తర్వాత కారును తిరిగి ఇచ్చేయవచ్చు లేదా మరో కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ అవ్వవచ్చు. అందుకే ప్రస్తుత కాలంలో కారు కొనడం కంటే లీజుకు తీసుకోవడమే తెలివైన పని అని నిపుణులు సూచిస్తున్నారు.

Article Published On: Friday, April 24, 2026, 10:25 [IST]
English summary
Drive nissan magnite gravite on monthly lease no maintenance no tension
Read more on: #nissan #nissan magnite
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+