అమ్మకాల్లో ఈ కారుకు ఎదురే లేదు.. 30 రోజుల్లో ఎన్ని వేల కార్లు అమ్మిందో తెలిస్తే షాకే

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మే 2026 నెలలో కంపెనీ కార్ల అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. భారతీయ కస్టమర్లు హ్యుందాయ్ మోడళ్లకు బ్రహ్మరథం పట్టారు. మోడల్ వారీగా చూసుకుంటే.. ఎప్పటిలాగే కంపెనీ మోస్ట్ పాపులర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంది. మిగతా కార్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నా క్రెటా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు.

సింహాసనాన్ని వదలని హ్యుందాయ్ క్రెటా
మే నెలలో హ్యుందాయ్ క్రెటా రికార్డు స్థాయిలో మొత్తం 15,235 యూనిట్ల అమ్మకాలను జరిపింది. గతేడాది మే 2025 లో క్రెటా అమ్మకాలు 14,860 యూనిట్లుగా ఉన్నాయి. అంటే వార్షిక ప్రాతిపదికన క్రెటా అమ్మకాల్లో 3 శాతం వృద్ధి నమోదైంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో క్రెటా తన హవాను చూపిస్తూ.. హ్యుందాయ్ కంపెనీ మొత్తానికే ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తోంది.

hyundai car sales may 2026 creta number one suv venue exter tucson zero sales details

హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్టర్ల పరుగు
అమ్మకాల లిస్ట్‌లో హ్యుందాయ్ వెన్యూ రెండో స్థానాన్ని ఆక్రమించింది. మే నెలలో వెన్యూ ఏకంగా 56 శాతం వార్షిక వృద్ధితో 11,714 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక మూడో స్థానంలో మైక్రో ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్టర్ నిలిచింది. ఇది 12 శాతం వృద్ధితో 6,595 యూనిట్ల సేల్స్ సాధించింది. నాలుగో స్థానంలో హ్యుందాయ్ ఆరా సెడాన్ కారు 5,077 యూనిట్ల అమ్మకాలతో తన పట్టు నిలుపుకుంది.

ఐ20 ఎలైట్ ఓకే.. గ్రాండ్ i10 డౌన్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో హ్యుందాయ్ ఐ20 ఎలైట్ 16 శాతం వార్షిక వృద్ధితో 4,749 యూనిట్లను విక్రయించి ఐదో స్థానంలో నిలిచింది. అయితే, కంపెనీకి ఒకప్పటి పాపులర్ మోడల్ అయిన హ్యుందాయ్ గ్రాండ్ i10 అమ్మకాలు ఈసారి భారీగా పడిపోయాయి. గతంతో పోలిస్తే ఏకంగా 33 శాతం క్షీణతతో కేవలం 2,920 యూనిట్ల సేల్స్ మాత్రమే నమోదయ్యాయి. అలాగే ఏడు సీటర్ ఎస్‌యూవీ హ్యుందాయ్ అల్కజార్ కూడా 12 శాతం క్షీణతతో కేవలం 814 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది.

hyundai car sales may 2026 creta number one suv venue exter tucson zero sales details

టక్సన్ కారుకు జీరో కస్టమర్లు
సెడాన్ మోడల్ హ్యుందాయ్ వెర్నా అమ్మకాలు కూడా 22 శాతం తగ్గి 723 యూనిట్లకు పడిపోయాయి. కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు హ్యుందాయ్ ఐయోనిక్ 5 కేవలం 10 యూనిట్లు అమ్ముడైంది. అయితే అందరినీ షాక్‌కు గురిచేసే విషయం ఏంటంటే, హ్యుందాయ్ ప్రీమియం ఎస్‌యూవీ టక్సన్ (Hyundai Tucson) ను కొనేందుకు మే నెలలో ఒక్క కస్టమర్ కూడా ముందుకు రాలేదు. గతేడాది మే 2025లో 60 యూనిట్లు అమ్ముడైన టక్సన్.. ఈసారి సున్నా (0) అమ్మకాలతో తీవ్ర నిరాశ పరిచింది.

ఓవరాల్‌గా హ్యుందాయ్ సూపర్ గ్రోత్
కొన్ని మోడళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ, ఓవరాల్‌గా హ్యుందాయ్ కంపెనీ మే 2026 లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. గత నెలలో హ్యుందాయ్ మొత్తం 47,837 కార్లను విక్రయించింది. గతేడాది మే 2025 లో జరిగిన 43,861 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇది 9 శాతం ఎక్కువ. భారత మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు పెరుగుతున్న డిమాండ్, హ్యుందాయ్ నమ్మకమైన సర్వీస్ కారణంగానే ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Article Published On: Monday, June 8, 2026, 17:51 [IST]
English summary
Hyundai car sales may 2026 creta number one suv venue exter tucson zero sales details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+