వెంటనే బడ్జెట్ రెడీ చేస్కోండి.. పక్క కంపెనీలు కుళ్లుకునేలా హ్యుందాయ్ 4 సరికొత్త ఎస్‌యూవీలు
భారతదేశ కార్ల మార్కెట్లో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది. రాబోయే 2030 సంవత్సరం నాటికి భారత మార్కెట్లో ఏకంగా 26 కొత్త మోడళ్లను లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇందులో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండనున్నాయి.
అయితే హ్యుందాయ్ తన పూర్తి ఫోకస్‌ను ప్రస్తుతం విపరీతమైన డిమాండ్ ఉన్న ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌పైనే పెట్టింది. ఇందులో భాగంగానే 2027 నాటికి 4 సరికొత్త పవర్‌ఫుల్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి లైన్ క్లియర్ చేసింది. వీటిలో తొలిసారిగా ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ, ఎమ్‌పీవీ (MPV) సెగ్మెంట్లలోకి కూడా హ్యుందాయ్ అడుగుపెడుతుండటం విశేషం. ఈ అప్‌కమింగ్ 4 ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

టాటా పంచ్ ఈవీకి పోటీగా మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
హ్యుందాయ్ కంపెనీ నుంచి రాబోతున్న కార్లలో మొదటిది ఒక చిన్న మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ప్రస్తుతం దీనికి 'HE1i' అనే కోడ్‌నేమ్ ఇచ్చారు. ఇది మార్కెట్లోకి వస్తే ప్రస్తుతం మంచి సేల్స్‌తో దూసుకుపోతున్న టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)కి నేరుగా గట్టి పోటీ ఇస్తుంది.
లీకైన సమాచారం ప్రకారం, ఈ చిన్న ఈవీ కారు చాలా బోల్డ్, బాక్సీ స్టైల్ లుక్‌తో ఉండబోతోంది. గ్లోబల్ మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ తరహాలోనే ఇందులో 42kWh,49kWh సామర్థ్యం గల పవర్‌ఫుల్ బ్యాటరీ ప్యాక్‌లను అందించే అవకాశం ఉంది. ఈ కారును భారతీయ కస్టమర్ల కోసం 2026 దీపావళి సీజన్ లేదా 2027 ప్రారంభంలో లాంచ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

సరికొత్త ఇంజన్‌తో హ్యుందాయ్ బేయాన్-బేస్డ్ ఎస్‌యూవీ
మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వెన్యూ, క్రెటా కార్ల మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేయడానికి హ్యుందాయ్ తన సరికొత్త బేయాన్-బేస్డ్ (Bayon-based) ఎస్‌యూవీని తీసుకువస్తోంది. ఈ కారు మార్కెట్లోకి వచ్చాక మారుతి సుజుకి అప్‌కమింగ్ కారు విక్టోరిస్‌తో తలపడనుంది.
ఈ ఎస్‌యూవీ అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఇందులో సరికొత్త 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను వాడనున్నారు. నివేదికల ప్రకారం.. ఈ కొత్త ఇంజన్ క్రెటాలో ఉండే భారీ 1.5-లీటర్ టర్బో ఇంజన్ కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటూనే, కస్టమర్లకు అద్భుతమైన మైలేజీని ఇవ్వడానికి బాగా సహాయపడుతుంది.

తొలిసారి హైబ్రిడ్ ఇంజన్‌తో నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతూ అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు సరికొత్త నెక్స్ట్-జనరేషన్ అవతారంలో రాబోతోంది. ఈ కొత్త మోడల్ కారు ప్రస్తుతం ఉన్న క్రెటా కంటే పొడవుగా, వెడల్పుగా ఉంటూ లోపల కేబిన్ స్పేస్ పరంగా చాలా పెద్దదిగా ఉండబోతోంది.
దీని డిజైన్‌లో హ్యుందాయ్ చాలా అగ్రెసివ్ మార్పులు చేయడమే కాకుండా లోపల ఇంటీరియర్‌ను హైటెక్ ఫీచర్లతో ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్దనుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రెటా చరిత్రలోనే తొలిసారిగా ఇందులో పవర్‌ఫుల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్ ఆప్షన్ లభించనుంది. ఈ కారుతోనే హ్యుందాయ్ సరికొత్త ప్లియోస్ కనెక్ట్ సిస్టమ్ కూడా ఇండియాలో మొదటిసారి పరిచయం కానుంది.

పెద్ద కుటుంబాల కోసం హ్యుందాయ్ 3-రో 7-సీటర్ ఎస్‌యూవీ
ఉమ్మడి కుటుంబాలు లేదా పెద్ద ఫ్యామిలీల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ ఒక ప్రీమియం 3-రో (7-సీటర్) ఎస్‌యూవీపై కూడా వేగంగా పనిచేస్తోంది. దీనికి 'Ni1i' అనే కోడ్‌నేమ్ పెట్టారు. ఇది చైనా మార్కెట్లో విక్రయించే హ్యుందాయ్ టక్సన్ లాంగ్-వీల్ బేస్ మోడల్‌పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.
హ్యుందాయ్ కి చెందిన కొత్త తలేగావ్ ప్రొడక్షన్ ప్లాంట్‌లో తయారయ్యే మొదటి కార్లలో ఇది ఒకటి కానుంది, అందువల్ల దీని ధర అందరికీ అందుబాటులో ఉండేలా కంట్రోల్ చేయవచ్చు. అప్‌కమింగ్ కొత్త క్రెటా లాగే ఈ 7-సీటర్ ఎస్‌యూవీలో కూడా అదిరిపోయే మైలేజ్ ఇచ్చే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌ను అమర్చనున్నారు, ఇది లాంగ్ జర్నీలు చేసేవారికి చాలా బెస్ట్ ఆప్షన్‌గా మారుతుంది.


Click it and Unblock the Notifications