పక్క కంపెనీలకు చెమటలు పట్టాల్సిందే.. మార్కెట్‎ను కొల్లగొట్టేందుకు 4 బ్రహ్మస్త్రాలను దింపుతున్న హ్యుందాయ్

దేశంలోని రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్.. గత కొంతకాలంగా మార్కెట్లో తగ్గిన తమ అమ్మకాలను మళ్లీ పుంజుకునేలా చేయడానికి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాబోయే కొద్ది నెలల్లో, వచ్చే ఏడాదిలో సరికొత్త ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్లతో కూడిన 4 సరికొత్త ఎస్‌యూవీ కార్లను భారతీయ మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఏ కారుకు ఆ కారు ప్రత్యేకమైన సెగ్మెంట్ లో ఉండేలా ప్లాన్ చేసిన ఈ సరికొత్త కార్ల వివరాలను తెలుసుకుందాం.

1. నెక్స్ట్-జనరేషన్ హ్యుందాయ్ క్రెటా (Next-Generation Hyundai Creta)
భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు సరికొత్త తరం (Next-Gen) మోడల్‌గా రూపాంతరం చెందుతోంది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన రోడ్ టెస్టింగ్‌లు భారత్‌లో జోరుగా సాగుతున్నాయి. ఈ సరికొత్త కారును అడ్వాన్స్‌డ్ K3 ప్లాట్‌ఫారమ్‌పై రూపొందిస్తున్నారు. దీనివల్ల కారు బాడీ స్ట్రక్చర్ మరింత బలంగా మారడమే కాకుండా, కారు ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ పూర్తిగా కొత్త లుక్‌తో, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో కనిపించనుంది.

hyundai upcoming 4 new suvs india launch creta alcazar hybrid palisade news

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో పాటు.. ఈ నెక్స్ట్ జనరేషన్ క్రెటాలో హ్యుందాయ్ మొదటిసారిగా స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్‌ను పరిచయం చేయబోతోంది. దీనివల్ల కారు మైలేజ్ ఊహించని రేంజ్‌లో పెరుగుతుంది. ఈ సరికొత్త క్రెటాను 2026 చివరి నాటికి కంపెనీ ప్రపంచానికి పరిచయం చేసి.. 2027 ప్రారంభంలో అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.

2. న్యూ హ్యుందాయ్ అల్కజార్ ఫేస్‌లిఫ్ట్ (New Hyundai Alcazar)
హ్యుందాయ్ సంస్థ తమ పాపులర్ 7-సీటర్ మోడల్ అయిన అల్కజార్‎కు కూడా ఒక భారీ అప్‌డేట్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను సరికొత్త డిజైన్ ఎలిమెంట్స్, మోడ్రన్ ఫీచర్లతో మార్కెట్లోకి తీసుకురానున్నారు. మహీంద్రా ఎక్స్‌యూవీ 700, టాటా సఫారీ వంటి పెద్ద కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా దీనిని రీ-డిజైన్ చేస్తున్నారు.

hyundai upcoming 4 new suvs india launch creta alcazar hybrid palisade news

ఈ కొత్త అల్కజార్ కారులో కూడా నెక్స్ట్ జనరేషన్ క్రెటాలో ఉపయోగించబోయే సరికొత్త 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఇంజిన్‌ను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల పెద్ద 7-సీటర్ కారు అయినప్పటికీ సిటీ, హైవేలలో అద్భుతమైన మైలేజీ అందిస్తుంది. అయితే దీని ఫీచర్లు, ఖచ్చితమైన డిజైన్ మార్పులకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

3. హ్యుందాయ్ Ni1i (Hyundai Ni1i - New 7-Seater)
హ్యుందాయ్ ప్రస్తుతం అంతర్గతంగా Ni1i అనే కోడ్‌నేమ్‌తో ఒక సరికొత్త 7-సీటర్ లార్జ్ ఎస్‌యూవీపై పనిచేస్తోంది. ఈ కారు ప్రస్తుత మార్కెట్లో ఉన్న అల్కజార్ కంటే పై సెగ్మెంట్‌లో (ప్రీమియం కేటగిరీ) రాబోతోంది. సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త కారు భారత మార్కెట్లో ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ టక్సన్ (Tucson) స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

hyundai upcoming 4 new suvs india launch creta alcazar hybrid palisade news

ఇది పూర్తి ప్రీమియం లుక్, లగ్జరీ ఇంటీరియర్‌తో రాబోతున్న పెద్ద కారు. మార్కెట్లో అత్యంత విజయవంతంగా దూసుకుపోతున్న మహీంద్రా XUV 7XO, టాటా సఫారీ వంటి కార్లకు ఇది డైరెక్ట్ పోటీదారుగా నిలుస్తుంది. ఈ ప్రీమియం ఎస్‌యూవీలో కూడా హ్యుందాయ్ సరికొత్తగా డెవలప్ చేసిన 1.5-లీటర్ స్ట్రాంగ్-హైబ్రిడ్ ఇంజిన్‌ను ఆప్షన్‌గా అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

4. హ్యుందాయ్ పాలిసేడ్ (Hyundai Palisade)
హ్యుందాయ్ కార్ల లైన్ అప్‌లోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ, ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా హ్యుందాయ్ పాలిసేడ్(Palisade) భారత మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇది అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే భారీ విజయాన్ని అందుకున్న మోడల్. ఇండియాలో లగ్జరీ కార్ల సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ.. అత్యున్నత స్థాయి టెక్నాలజీ, ప్రీమియం సీటింగ్, లగ్జరీ క్యాబిన్ ఫీచర్లతో ఈ కారును హ్యుందాయ్ ప్రవేశపెట్టనుంది.

hyundai upcoming 4 new suvs india launch creta alcazar hybrid palisade news

పాలిసేడ్ ఎస్‌యూవీలో అత్యంత పవర్‌ఫుల్ 2.5-లీటర్ హైబ్రిడ్ పెట్రోల్ పవర్‌ట్రెయిన్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఇందులో ఉండే పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండు కలిసి సంయుక్తంగా ఏకంగా 329 bhp ల భారీ పవర్‌ను, 459 Nm ల అత్యధిక టార్క్‌ను జనరేట్ చేస్తాయి. కొండలు, లోయలు, కఠినమైన రోడ్లపై కూడా రాకెట్‌లా దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఈ సెగ్మెంట్ కార్లలో లభించే అన్ని రకాల సేఫ్టీ (ADAS), కంఫర్ట్ ఫీచర్లు ఇందులో పీక్ లెవెల్లో ఉండబోతున్నాయి.

Article Published On: Monday, June 22, 2026, 14:10 [IST]
English summary
Hyundai upcoming 4 new suvs india launch creta alcazar hybrid palisade news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+