కొత్తగా కారు కొనే ప్రతి వాళ్లు ఈ మోడల్ కారే కావాలంటున్నారు.. టాప్ 10 ఎస్‌యూవీల లిస్ట్ ఇదే

భారతదేశంలో ఎస్‌యూవీ (SUV)ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతుకుల రోడ్లు అయినా, గంభీరమైన లుక్ అయినా మనోళ్లకు ఎస్‌యూవీలే ఫస్ట్ ఛాయిస్. అయితే, తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం 2026 (FY2026) సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే మార్కెట్లో ఒక రేంజ్ లో యుద్ధం జరిగినట్లు కనిపిస్తోంది. హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రెజా, టాటా పంచ్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి టాటా నెక్సాన్ (Tata Nexon) మరోసారి ఇండియాస్ నంబర్ 1 ఎస్‌యూవీగా నిలిచింది.

నంబర్ 1 స్థానంలో టాటా నెక్సాన్:
టాటా మోటార్స్ కు నెక్సాన్ ఒక బంగారు బాతు లాంటిది. 2026 ఆర్థిక సంవత్సరంలో ఈ కారు ఏకంగా 2,16,054 యూనిట్ల విక్రయాలతో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది (FY2025)తో పోలిస్తే అమ్మకాల్లో 32.48% భారీ వృద్ధిని సాధించింది. రూ.7.36 లక్షల ప్రారంభ ధరతో పాటు గ్లోబల్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉండటమే దీని విజయ రహస్యం. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉండటం నెక్సాన్ కు పెద్ద ప్లస్ పాయింట్.

Indias Top 10 SUVs of FY26 Nexon Takes the Crown Mahindra Thar Records 50 Growth

రెండో స్థానంలో హ్యుందాయ్ క్రెటా:
ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్ లో రారాజు అయిన హ్యుందాయ్ క్రెటా 2,01,921 యూనిట్ల అమ్మకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఏడాది ప్రాతిపదికన ఇది 3.62% వృద్ధిని నమోదు చేసింది. తన కొత్త అవతారంతో (Facelift) కస్టమర్లను ఆకట్టుకుంటున్నప్పటికీ నెక్సాన్ దూకుడు ముందు రెండో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది.

మూడు, నాలుగు స్థానాల్లో పంచ్, బ్రెజా:
టాటా నుంచి వచ్చిన మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ 1,83,980 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది. అయితే, గతేడాది కంటే దీని అమ్మకాలు 6.40% పడిపోవడం గమనార్హం. ఇక నాలుగో స్థానంలో ఉన్న మారుతి సుజుకి బ్రెజా 1,80,104 యూనిట్లు అమ్ముడైంది. బ్రెజా అమ్మకాలు కూడా 4.79% తగ్గాయి. ఈ రెండు కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం మిగిలిన బ్రాండ్ల నుంచి వస్తున్న గట్టి పోటీయే.

Indias Top 10 SUVs of FY26 Nexon Takes the Crown Mahindra Thar Records 50 Growth

మహీంద్రా స్కార్పియో, ఫ్రాంక్స్ జోరు:
మహీంద్రా నుంచి వచ్చిన బిగ్ డాడీ స్కార్పియో (N, క్లాసిక్ కలిపి) 1,78,800 యూనిట్ల అమ్మకాలతో ఐదో స్థానాన్ని ఆక్రమించింది. ఇది 8.47% వృద్ధిని సాధించింది. ఇక మారుతి నుంచి వచ్చిన స్టైలిష్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ (Fronx) 1,72,363 యూనిట్లతో ఆరో స్థానంలో ఉంది. తన కూపే డిజైన్ తో యువతను ఇది బాగా ఆకర్షిస్తోంది.

రికార్డు సృష్టించిన మహీంద్రా థార్:
ఈ ఏడాది సేల్స్ రిపోర్ట్ లో అసలైన సర్‌ప్రైజ్ మహీంద్రా థార్. ఇది ఏకంగా 48.83% వృద్ధిని నమోదు చేసి 1,26,261 యూనిట్ల విక్రయాలతో ఏడో స్థానంలో నిలిచింది. థార్ రాక్స్ (5-డోర్) లాంచ్ అవ్వడం ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణం. ఆఫ్‌రోడింగ్ ప్రియులే కాకుండా ఫ్యామిలీ కస్టమర్లు కూడా థార్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Indias Top 10 SUVs of FY26 Nexon Takes the Crown Mahindra Thar Records 50 Growth

ఎనిమిది, తొమ్మిది, పదో స్థానాలు:
ఎనిమిదో స్థానంలో హ్యుందాయ్ వెన్యూ (1,17,737 యూనిట్లు) ఉండగా, తొమ్మిదో స్థానంలో కియా సోనెట్ (1,14,142 యూనిట్లు) నిలిచింది. సోనెట్ అమ్మకాలు 14.37% పెరగడం విశేషం. ఇక చివరిగా పదో స్థానంలో మహీంద్రా నమ్మకమైన మోడల్ బోలెరో 1,10,136 యూనిట్లతో తన పట్టును నిలుపుకుంది.

మార్కెట్ విశ్లేషణ
భారతీయ వినియోగదారులు ఇప్పుడు కేవలం మైలేజీ మాత్రమే కాకుండా సేఫ్టీ, టెక్నాలజీకి కూడా పెద్దపీట వేస్తున్నారు. అందుకే 5-స్టార్ సేఫ్టీ ఉన్న నెక్సాన్ టాప్ లో నిలిచింది. అదేవిధంగా, మహీంద్రా కంపెనీ తన ఆఫ్‎రోడ్ ఎస్‌యూవీలతో మార్కెట్ లో తన వాటాను పెంచుకుంటూ పోతోంది. రాబోయే కాలంలో ఈ పోటీ మరింత ముదిరే అవకాశం ఉంది, ఎందుకంటే 2026 లో మరికొన్ని కొత్త ఎస్‌యూవీలు (మహీంద్రా బిఈ 6, టాటా సియెర్రా వంటివి) మార్కెట్లోకి రాబోతున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, April 11, 2026, 7:38 [IST]
English summary
Indias top 10 suvs of fy26 nexon takes the crown mahindra thar records 50 growth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+