ఎవరూ కారు కొనకూడదని కంపెనీ అనుకుందా? ఇదేం నిర్ణయం బాస్? ఒక్కసారిగా షాక్ ఇచ్చింది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా వేగంగా ఎదిగిన బ్రాండ్‌లలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor India) ఒకటి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టిన తర్వాత, ఈ సంస్థ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. JSW Group తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత కంపెనీ వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ పొత్తు ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మరింత దూసుకెళ్లిన ఎంజీ, తన బ్రాండ్ ఇమేజ్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది. అయితే ఈ అభివృద్ధి మధ్యలోనే కంపెనీ తాజాగా వినియోగదారులకు కొంత నిరాశ కలిగించే వార్తను ప్రకటించింది. JSW MG Motor India ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

గతంలో ఇతర ప్రముఖ కార్ల కంపెనీలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఎంజీ తీసుకున్న ఈ అడుగు ఆశ్చర్యకరం కాదు కానీ వినియోగదారులకు మాత్రం కొంత భారంగా మారే అవకాశం ఉంది. ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా కంపెనీ పెరుగుతున్న తయారీ వ్యయాలను పేర్కొంది. కార్ల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతుండటంతో పాటు, విడిభాగాల ఉత్పత్తి ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి.

Jsw Mg Motor Announces Price Hike April 2026 India More Details Inside

దీనికి తోడు రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్ వ్యయాలు కూడా పెరగడం వల్ల మొత్తం ఉత్పత్తి ఖర్చు కంపెనీపై అదనపు భారం మోపుతోంది. ఈ పరిస్థితుల్లో ధరలు పెంచడం తప్ప వేరే మార్గం లేదని కంపెనీ భావించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో విస్తరణపై దృష్టి పెట్టిన ఎంజీకి, టెక్నాలజీ అప్‌గ్రేడ్స్, బ్యాటరీ తయారీ ఖర్చులు వంటి అంశాలు కూడా కీలకంగా మారాయి. ఇవన్నీ కలిసివచ్చి కంపెనీకి అదనపు పెట్టుబడులు అవసరమవుతున్నాయి.

అందువల్ల ఈ ఖర్చులను కొంతమేర వినియోగదారులపై మోపాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి, ఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబిస్తోంది. ధరలు పెరగడం వినియోగదారులకు తక్షణంగా ప్రభావం చూపినా, కంపెనీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరిన్ని సాంకేతిక నవీకరణలు, కొత్త మోడళ్లతో మార్కెట్‌లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకోవాలని ఎంజీ లక్ష్యంగా పెట్టుకున్నది.

Jsw Mg Motor Announces Price Hike April 2026 India More Details Inside

ఏప్రిల్ 1 కార్ల ధరలను సగటుగా 2 శాతం మేర పెంచనున్నట్లు స్పష్టమైంది. అంటే ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే ప్రతి మోడల్‌పై కొంతమేర అదనపు భారం వినియోగదారులపై పడనుంది. ప్రస్తుతం ఎంజీ భారతదేశంలో మొత్తం 9 కార్ మోడళ్లను విక్రయిస్తోంది. వీటిలో 5 ఎలక్ట్రిక్ కార్లు కాగా, మిగతా 4 పెట్రోల్/డీజిల్ ఇంజన్ కార్లు ఉన్నాయి. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎంతగా దృష్టి సారించిందో చూపిస్తోంది.

ఎంజీ బ్రాండ్‌లో కామెట్ ఈవీ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7.50 లక్షల నుండి రూ. 9.56 లక్షల వరకు ఉన్నాయి. 2 శాతం ధరల పెంపుతో, ఈ మోడల్ ధరలు సుమారు రూ. 15,000 నుండి రూ. 19,000 వరకు పెరిగే అవకాశం ఉంది. విండ్సర్ ఈవీ కూడా ప్రభావాన్ని ఎదుర్కొననుంది. ప్రస్తుతం ఈ మోడల్ ధరలు రూ. 14 లక్షల నుండి రూ. 18.50 లక్షల మధ్య ఉన్నాయి.

Jsw Mg Motor Announces Price Hike April 2026 India More Details Inside

ఏప్రిల్ నుంచి ధరలు రూ. 28,000 నుండి రూ. 37,000 వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఎంజీ బ్రాండ్‌లో ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లైన ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ, ఎంజీ ఎం9 ఈవీ విషయంలో మాత్రం కంపెనీ వేరే నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 75 లక్షల ధరతో అమ్ముడవుతున్న సైబర్‌స్టర్ ఈవీ, అలాగే రూ. 70.90 లక్షల ధరలో ఉన్న ఎం9 ఎలక్ట్రిక్ కారు ధరలను పెంచబోరని సమాచారం.

More from DriveSpark

Article Published On: Tuesday, March 31, 2026, 11:27 [IST]
English summary
Jsw mg motor announces price hike april 2026 india more details inside
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+