టాటా-మహీంద్రాకే వణుకు పుట్టిస్తుంది.. మార్కెట్ ట్రెండ్ మార్చేస్తుంది! చిన్నగా మొదలై, పెద్దగా పెరిగింది
భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్థిరంగా ఎదుగుతూ తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఒకప్పుడు పరిమిత మోడళ్లతో మాత్రమే కనిపించిన ఈ బ్రాండ్, ఇప్పుడు విస్తృతమైన పోర్ట్‌ఫోలియోతో దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకుని, తగిన విధంగా ఉత్పత్తులను అందించడం ద్వారా తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ఇక పోటీ విషయానికి వస్తే, ఇప్పటికే మార్కెట్లో బలమైన స్థానం కలిగిన కంపెనీలను ఎదుర్కొంటుంది.
ముఖ్యంగా టాటా మోటార్స్ (Tata Motors), హ్యూందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) వంటి దిగ్గజాలకు సమానంగా నిలబడి పోటీ ఇవ్వడం చిన్న విషయం కాదు. అయినప్పటికీ, JSW ఎంజీ మోటార్ ఇండియా తన వ్యూహాలతో ఈ పోటీని సమర్థంగా ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలపై పెడుతున్న దృష్టి.

తాజాగా ఎంజీ మోటార్ గణనీయమైన వృద్ధిని నమోదు చేసి పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. 2026 మార్చిలో కంపెనీ ప్రదర్శించిన పనితీరు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే స్పష్టమైన పురోగతిని సూచిస్తోంది. అమ్మకాల నివేదిక ప్రకారం, కంపెనీ 2026 మార్చి నెలలో మొత్తం 6,528 హోల్‌సేల్ యూనిట్లను డీలర్లకు పంపించింది. ఇది 2025 మార్చితో పోల్చితే 19 శాతం వృద్ధి. ఇది బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసం ఎంతగా పెరుగుతోందో తెలియజేస్తోంది.
ఈ వృద్ధి కేవలం గణాంకాల్లో మాత్రమే కాకుండా, మార్కెట్లో కంపెనీ ప్రస్తుత స్థితిని బలంగా ప్రతిబింబిస్తోంది. ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) వాహనాలతో పాటు, న్యూ ఎనర్జీ వెహికల్స్ (NEV) ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లను విస్తృతంగా ప్రవేశపెట్టి, భవిష్యత్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కలిపి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్‌ను పెంచుతున్నాయి. దాంతో ఆ సెగ్మెంట్‌లో తన బలాన్ని పెంచుకుంటోంది.

ఈ విధంగా ఒకవైపు సంప్రదాయ వాహనాలు, మరోవైపు భవిష్యత్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రిక్ మోడళ్లను సమతుల్యంగా అందిస్తూ, కంపెనీ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటోంది. అందుకే, పోటీ ఎంత ఉన్నా, JSW MG Motor India భారత మార్కెట్లో ఒక కీలక ప్లేయర్‌గా నిలుస్తోంది. ప్రస్తుతం కంపెనీకి చెందిన పలు మోడళ్ల కస్టమర్ల అభిమానాన్ని పొందుతున్నాయి. ముఖ్యంగా ఎంజీ విండ్సర్ ఈవీ ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న కారుగా ఉంది.
అదే సమయంలో చిన్న కార్ల విభాగంలో సత్తా చాటుతుంది ఎంజీ కామెట్. ఇవే కాకుండా హెక్టర్, ఆస్టర్, లగ్జరీ విభాగంలో సైబర్‌స్టర్, ఎంజీ ఎ9 వంటి పలు వాహనాలు ప్రత్యర్థులకు బలమైన పోటీగా నిలుస్తూ కంపెనీ అమ్మకాలు పెరగడానికి దోహదం చేస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉన్న ఇలాంటి సమయంలో 19 శాతం వృద్ధి నమోదు చేయడం అంటే గొప్ప విషయం అని చెప్పాలి.

ఇదిలా ఉంటే, మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి మొత్తం MG పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా 2% వరకు ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో, ప్రీమియం సెగ్మెంట్‌కు చెందిన MG SELECT పోర్ట్‌ఫోలియోలోని వాహనాలపై మరింత పెరుగుదల ఉండనుంది. ఇందులో భాగంగా MG Cyberster, M9 వంటి ఫ్లాగ్‌షిప్ మోడళ్ల ధరలను గరిష్టంగా 7% వరకు పెంచనున్నట్లు కంపెనీ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








