ఇలా కూడా కారు ఉంటుందా? ఒక్క చూపుతోనే కట్టిపడేసే లుక్.. కొత్త సవాల్ విసరబోతున్న ఎలక్ట్రిక్ SUV

భారత ఆటోమొబైల్ రంగంలో ఇటీవలి కాలంలో వేగంగా వినిపిస్తున్న పేరు జెఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW Group). ఇప్పటికే ఎంజీ మోటార్ (MG Motor)తో కలిసి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మంచి ప్రస్థానం సాగిస్తున్న ఈ గ్రూప్, ఇప్పుడు మరింత పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. కేవలం భాగస్వామ్యాలకే పరిమితం కాకుండా, భారతదేశంలో స్వతంత్ర ప్రయాణీకుల మొబిలిటీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి JSW సన్నాహాలు ప్రారంభించడం గమనార్హం. ఇది భవిష్యత్ EV మార్కెట్‌పై వారి గంభీర దృష్టిని చూపిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగా, చైనా ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం Chery తో కూడా భాగస్వామ్యాన్ని ప్రకటించడం కీలక మలుపు. ఈ రెండు బ్రాండ్లు కలిసి భారత మార్కెట్‌లో పలు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టేందుకు అంగీకరించాయి.

మొదటిగా JSW మోటార్స్ నుంచి ఒక ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) SUV రానుండటం విశేషం. ఇది సంప్రదాయ ఇంధన సామర్థ్యాన్ని, ఎలక్ట్రిక్ టెక్నాలజీ ప్రయోజనాలను కలిపిన మోడల్‌గా ఉండబోతోంది. ఇదిలా ఉంటే, చెరీ ఐకార్ వీ23 (Chery iCar V23) ఎలక్ట్రిక్ SUV కూడా భారత మార్కెట్‌కు రానున్నట్లు సమాచారం. ఆటోకార్ ఇండియా కూడా దీన్ని ధృవీకరించింది. ఇప్పటికే ఈ మోడల్‌ను దేశీయ రోడ్లపై పరీక్షించడం ప్రారంభించారని వార్తలు చెబుతున్నాయి.

Jsw Motors To Bring Chery Icar V23 Electric Suv To India Soon Details

రగ్గడ్ స్టైల్‌ను ఇష్టపడే వారికి Chery iCar V23 ఒక ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తోంది. బాక్సీ డిజైన్, బలమైన వైఖరితో ఈ మోడల్ లగ్జరీ SUVలకే సవాల్ విసిరేలా కనిపిస్తోంది. కొలతల పరంగా ఇది సరికొత్త మారుతి సుజుకి ఈ-విటారాకు సమానంగా ఉంటుంది. సుమారు 4,220 mm పొడవు, 1,915 mm వెడల్పు, 1,845 mm ఎత్తు, 2,735 mm వీల్‌బేస్‌తో విస్తృతమైన స్థలం అందిస్తుంది.

డిజైన్ విషయానికి వస్తే, ముందుభాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, సీల్డ్-ఆఫ్ ఫ్రంట్ ఫేసియా ప్రధాన ఆకర్షణ. బంపర్ స్టైలింగ్ కొంతవరకు Jeep Wrangler ను గుర్తుకు తెస్తుంది. సైడ్ ప్రొఫైల్‌లో వెనుక క్వార్టర్ గ్లాస్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. చాలా EVల్లో కనిపించే ఫ్లష్ డోర్ హ్యాండిల్స్‌కు బదులుగా పుల్-టైప్ హ్యాండిల్స్ వాడటం దీనికి మరింత రగ్గడ్ ఫీల్ ఇస్తుంది. వేరియంట్‌ను బట్టి 19-అంగుళాల లేదా 21-అంగుళాల వీల్ ఎంపికలు లభిస్తాయి.

Jsw Motors To Bring Chery Icar V23 Electric Suv To India Soon Details

వెనుక భాగంలో సాధారణ స్పేర్ వీల్‌కు బదులుగా, సైడ్-హింగ్డ్ టెయిల్‌గేట్‌పై అమర్చిన బాక్సీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ బాక్స్ ఉండటం దీని యుటిలిటీని పెంచుతుంది. ఇంటీరియర్‌లోకి వస్తే, Chery iCar V23 సింపుల్‌గా కనిపించినా టెక్నాలజీ పరంగా మాత్రం చాలా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. డాష్‌బోర్డ్ డిజైన్ మినిమలిస్టిక్ స్టైల్‌లో ఉండగా, మధ్యలో భారీగా కనిపించే 15.4-అంగుళాల ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8155 చిప్‌తో నడుస్తుండటంతో ఫాస్ట్ రెస్పాన్స్, స్మూత్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. దాని పక్కనే AC వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ నియంత్రణలు అందుబాటులో ఉంటాయి. లెథరెట్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, ప్రీమియమ్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు క్యాబిన్‌కు లగ్జరీ ఫీల్ ఇస్తాయి. ప్రాక్టికాలిటీ పరంగా వెనుక సీట్లు ఫోల్డబుల్‌గా ఉండటంతో బూట్ స్పేస్‌ను గరిష్టంగా 744 లీటర్ల వరకు పెంచుకోవచ్చు.

Jsw Motors To Bring Chery Icar V23 Electric Suv To India Soon Details

పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో ఇది సింగిల్ మోటార్ వేరియంట్ సుమారు 134 bhp పవర్ ఇస్తే, మరొక వెర్షన్ 248 bhp శక్తిని అందిస్తుంది. డ్యూయల్ మోటార్ AWD వేరియంట్ 211 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. బ్యాటరీ ఎంపికలలో 59.93 kWh, 81.76 kWh ప్యాక్‌లు లభిస్తాయి. చిన్న బ్యాటరీతో సుమారు 360 కి.మీ.ల రేంజ్, పెద్ద బ్యాటరీతో దాదాపు 430 కి.మీ.ల రేంజ్ లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 24, 2026, 12:29 [IST]
English summary
Jsw motors to bring chery icar v23 electric suv to india soon details
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+