ఇది రోడ్డు మీద వెళ్తుంటే అందరూ కన్ను ఆర్పకుండా చూస్తారంతే..మహీంద్రా థార్ రాక్స్ స్టార్ వచ్చేసింది

మహీంద్రా అండ్ మహీంద్రా తన అత్యంత ప్రజాదరణ పొందిన థార్ రాక్స్ (Thar Roxx) ఎస్యూవీలో సరికొత్త స్టార్ ఎడిషన్‎ను (Star Edition) భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆఫ్-రోడింగ్ ప్రియులను, లగ్జరీ కోరుకునే యూత్‎ను ఆకట్టుకునేలా దీనిని రూపొందించారు. దీని ప్రారంభ ధరను రూ.16.85 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. కొత్త లుక్, అదిరిపోయే ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ కారు మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది.

మహీంద్రా థార్ రాక్స్ ఇప్పటికే మార్కెట్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కంపెనీ స్టార్ ఎడిషన్‎ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఎడిషన్ ప్రధానంగా విజువల్ అప్‌డేట్స్‌తో, అంటే చూడటానికి మరింత స్టైలిష్‌గా ఉండేలా మార్పులు చేశారు. అయితే, ఇంజిన్, మెకానికల్ పరంగా పాత రాక్స్ మోడల్‌లోనే ఉన్న ఫీచర్లనే ఇందులోనూ కొనసాగించారు.

Mahindra Thar Roxx Star Edition Launched in India at Rs 16 85 Lakh with Premium Features

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ స్టార్ ఎడిషన్ కేవలం రియర్-వీల్-డ్రైవ్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మహీంద్ర ఈ స్టార్ ఎడిషన్‌ను మూడు ప్రధాన వేరియంట్లలో అందిస్తోంది. డీజిల్ మాన్యువల్ మోడల్ ధర రూ.16.85 లక్షలుగా ఉంది. పెట్రోల్ ఆటోమేటిక్ మోడల్ రూ.17.85 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. డీజిల్ ఆటోమేటిక్ మోడల్ అత్యధికంగా రూ.18.35 లక్షల ధరను కలిగి ఉంది. ఈ ధరలన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.

ఇంజిన్ సామర్థ్యం: మహీంద్ర థార్ రాక్స్ స్టార్ ఎడిషన్‌లో రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. పెట్రోల్ వెర్షన్ కోసం G20 TGDi ఎమ్-స్టాలియన్ ఇంజిన్‌ను వాడారు. ఇది 170 bhp పవర్, 380 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే వస్తుంది. ఇక డీజిల్ లవర్స్ కోసం D22 ఎమ్-హాక్ (mHawk) ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 170 bhp పవర్, 400 Nm టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ మోడల్‌లో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు రెండూ ఉన్నాయి.

Mahindra Thar Roxx Star Edition Launched in India at Rs 16 85 Lakh with Premium Features

ఎక్స్‎టీరియర్ : సాధారణ రాక్స్ మోడల్‌తో పోలిస్తే స్టార్ ఎడిషన్ చాలా భిన్నంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో కొత్తగా పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్‌ను అమర్చారు. అంతేకాదు అల్లాయ్ వీల్స్ కూడా పియానో బ్లాక్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్నాయి. ఈ ఎడిషన్ కోసం మహీంద్రా సిట్రిన్ యెల్లో అనే సరికొత్త రంగును పరిచయం చేసింది. దీంతో పాటు టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, స్టెల్త్ బ్లాక్ వంటి రంగుల్లో కూడా ఈ కారు లభిస్తుంది.

లగ్జరీ ఇంటీరియర్ : కారు లోపలి భాగం ఇప్పుడు మరింత రిచ్‌గా మారింది. డార్క్ ప్రీమీయం ఫినిషింగ్‌తో కూడిన ఇంటీరియర్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. సీట్లు ఆల్-బ్లాక్ లెదరెట్ మెటీరియల్‌తో, స్వీడ్ యాక్సెంట్స్‌తో డిజైన్ చేశారు. వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే వెంటిలేటెడ్ సీట్లు (ముందు భాగంలో), స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, వెనుక ప్రయాణీకుల సౌకర్యం కోసం 60:40 స్ప్లిట్ రిక్లైనింగ్ సీట్లను ఇందులో అమర్చారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ ఫోల్డింగ్ మిర్రర్లు దీని ప్రత్యేకత.

Mahindra Thar Roxx Star Edition Launched in India at Rs 16 85 Lakh with Premium Features

అడ్వాన్సుడ్ టెక్నాలజీ : టెక్నాలజీ పరంగా మహీంద్రా ఎక్కడా తగ్గలేదు. ఇందులో 10.25 ఇంచ్ హెచ్‌డీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అంతే పరిమాణం గల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇచ్చారు. ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, అడ్రినోక్స్ 83 కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సంగీత ప్రియుల కోసం 9 స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డన్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాను కూడా అమర్చారు.

సేఫ్టీ : ప్రయాణీకుల భద్రత కోసం మహీంద్రా ఆరు ఎయిర్‌బ్యాగులను (ఫ్రంట్, సైడ్, కర్టెన్) స్టాండర్డ్ ఫీచర్‌గా ఇస్తోంది. వీటితో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం వంటివి ఉన్నాయి. ఆఫ్-రోడింగ్ చేసేటప్పుడు ఉపయోగపడే స్నో, సాండ్, మడ్ అనే మూడు టెర్రైన్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.

గతంలో XUV700, స్కార్పియో-ఎన్ వంటి మోడల్స్‌కు స్పెషల్ ఎడిషన్స్ తెచ్చి భారీ విజయం అందుకున్న మహీంద్రా, ఇప్పుడు థార్ రాక్స్ స్టార్ ఎడిషన్‌తో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తోంది. మీకు ఈ కొత్త స్టార్ ఎడిషన్ నచ్చినట్లయితే వెంటనే సమీపంలోని మహీంద్రా షోరూమ్‌ను సందర్శించి బుక్ చేసుకోవచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, January 24, 2026, 16:24 [IST]
English summary
Mahindra thar roxx star edition launched in india at rs 16 85 lakh with premium features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+