థార్ రాక్స్‌కు గుండె మార్పిడి.. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో సంచలనం..మహీంద్రా కొత్త స్కెచ్ అదుర్స్
ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందుతున్న మహీంద్రా థార్, ఇప్పుడు తన సరిహద్దులను మరింత విస్తరించుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆఫ్-రోడర్‌గా పేరుగాంచిన థార్ రాక్స్ (Thar Roxx) మోడల్‌లో మహీంద్రా కీలక మార్పులు చేస్తోంది. 2025 ముగింపు వేళ ఆటోమొబైల్ ప్రపంచంలో వినిపిస్తున్న అత్యంత క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. మహీంద్రా థార్ రాక్స్‌కు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అమర్చబోతున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 2.2 లీటర్ ఇంజన్‌తో పోలిస్తే, ఇది మరింత అందుబాటు ధరలో, అధిక మైలేజీతో రాబోతోంది. 2026లో కూడా ఈ ఎస్‌యూవీ తన జోరును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మహీంద్రా థార్ రాక్స్ పవర్ఫుల్ 2.2 లీటర్ mHawk డీజిల్, 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్ ఇంజన్లతో అందుబాటులో ఉంది.

అయితే, ఈ భారీ ఇంజన్ల వల్ల కారు ధర, మెయింటెనెన్స్ కాస్త ఎక్కువే. దీనిని దృష్టిలో ఉంచుకుని, మహీంద్రా తన పాపులర్ 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌ను థార్ రాక్స్‌లోకి తీసుకువస్తోంది. ఈ ఇంజన్ ఇప్పటికే 3-డోర్ థార్ (RWD)లో అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఈ మార్పు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ధర. 1.5 లీటర్ ఇంజన్ కలిగిన వాహనాలకు పన్ను రాయితీలు లభించడంతో, కారు ధర గణనీయంగా తగ్గుతుంది. కేవలం లుక్స్ కోసం, సిటీ డ్రైవింగ్ కోసం థార్ కొనేవారికి ఇది ఒక వరం లాంటిది. ఇది దాదాపు 117 bhp పవర్‌ను, 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్-రోడింగ్ కంటే మైలేజీ, స్టైల్ ముఖ్యం అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2026 అప్‌డేటెడ్ థార్ రాక్స్‌లో కేవలం ఇంజన్ మాత్రమే కాదు, ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు ఉండబోతున్నాయి. అప్డేటెడ్ గ్రిల్, సి-షేప్డ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు (C-shaped LED DRLs) కారుకు కొత్త రూపాన్ని ఇస్తాయి.
కారు లోపల డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉండనున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు లెవల్-2 ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్‌ను మహీంద్రా ఈ మోడల్‌లోనూ కొనసాగించబోతోంది. ఇది ఇప్పటికే భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ సాధించిన సంగతి తెలిసిందే.

2025 ఏడాది మహీంద్రాకు ఒక చిరస్మరణీయ సంవత్సరంగా నిలిచింది. అమ్మకాల పరంగా హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి మహీంద్రా రెండవ అతిపెద్ద కార్ల కంపెనీగా నిలిచింది. 2025లో ఏకంగా 5.81 లక్షల ఎస్‌యూవీలను విక్రయించి రికార్డు సృష్టించింది. థార్ రాక్స్, స్కార్పియో-ఎన్, XUV700 వంటి మోడళ్లు ఈ విజయానికి ప్రధాన కారణం. ఇప్పుడు 2026లో థార్ రాక్స్ బడ్జెట్ వేరియంట్ కూడా వస్తే, మారుతి సుజుకికి సైతం గట్టి పోటీ ఎదురుకావడం ఖాయం.
ప్రస్తుతం థార్ రాక్స్ ప్రారంభ ధర రూ. 12.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త 1.5 లీటర్ డీజిల్ వేరియంట్ రాకతో, దీని బేస్ మోడల్ ధర రూ. 11 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ మోడల్ 2026 మధ్య నాటికి షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








