భారీ షాక్‌కు రెడీగా ఉండండి.. మహీంద్రా నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీ వస్తోంది
భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం హైబ్రిడ్ కార్ల హవా వేగంగా పెరుగుతోంది. పెట్రోల్ ఖర్చులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న సందేహాలు, ఎక్కువ మైలేజ్ కావాలనే ఆలోచనతో చాలా మంది ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో మహీంద్రా(Mahindra) కూడా తన తొలి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీ((Hybrid suv))ని తీసుకురావడానికి భారీ ప్లాన్ సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహీంద్రా(Mahindra) సంస్థ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మార్కెట్లో టయోటా(toyota), మారుతి సుజుకి(maruti suzuki) హైబ్రిడ్ వాహనాలకు వస్తున్న స్పందనను చూసిన తర్వాత మహీంద్రా కూడా ఇదే దారిలో అడుగులు వేస్తోంది.

ఇటీవల కంపెనీ ప్రదర్శించిన కొత్త కాన్సెప్ట్ మోడల్స్‌లో భవిష్యత్తు టెక్నాలజీకి సంబంధించిన సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో వచ్చే కొత్త ఎస్‌యూవీపై ఆటో రంగంలో భారీ చర్చ నడుస్తోంది.
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం మహీంద్రా తన కొత్త XUV 7XO(mahindra xuv 7xo) మోడల్‌ను స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో తీసుకురావొచ్చని తెలుస్తోంది. 2027 ప్రాంతంలో ఈ వాహనం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఈ ఎస్‌యూవీలో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేసే అవకాశం ఉంది. చిన్న బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ సిస్టమ్ నగరాల్లో తక్కువ దూరాలకు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్‌లో ప్రయాణించే అవకాశం కల్పించొచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే పెట్రోల్ ఇంజిన్ పనిచేసే విధంగా టెక్నాలజీ ఉండే అవకాశముంది. దీంతో మైలేజ్ భారీగా పెరగడంతో పాటు ఇంధన ఖర్చు కూడా తగ్గొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు కొనాలనుకునే చాలా మందికి ఒక భయం ఉంది. అదే ఛార్జింగ్ స్టేషన్లు. లాంగ్ ట్రిప్స్ సమయంలో ఛార్జింగ్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యకు హైబ్రిడ్ టెక్నాలజీ మధ్యస్థ పరిష్కారంగా మారుతోంది.
హైబ్రిడ్ వాహనాల్లో బ్యాటరీతో పాటు పెట్రోల్ ఇంజిన్ కూడా ఉండటం వల్ల డ్రైవింగ్ రేంజ్ ఎక్కువగా ఉంటుంది. నగరాల్లో బ్యాటరీతో ప్రయాణం.. హైవేలపై పెట్రోల్ ఇంజిన్ సపోర్ట్.. ఈ కాంబినేషన్ ఇప్పుడు చాలా మందిని ఆకట్టుకుంటోంది.

మహీంద్రా కేవలం స్ట్రాంగ్ హైబ్రిడ్‌తో ఆగిపోవడం లేదు. కంపెనీ ఇప్పుడు రేంజ్ ఎక్స్‌టెండర్ టెక్నాలజీపై కూడా ప్రయోగాలు చేస్తోంది. ఇందులో పెట్రోల్ ఇంజిన్ నేరుగా చక్రాలను తిప్పదు. కేవలం బ్యాటరీని ఛార్జ్ చేసే జనరేటర్‌లా పనిచేస్తుంది.
దీంతో వాహనం పూర్తిగా ఎలక్ట్రిక్ డ్రైవింగ్ అనుభూతిని ఇస్తూనే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ భారత మార్కెట్లో పెద్ద మార్పు తీసుకురావొచ్చని ఆటో నిపుణులు చెబుతున్నారు.
మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే థార్.ఈ కాన్సెప్ట్‌ను కంపెనీ ప్రదర్శించింది. డ్యూయల్ మోటార్ సెటప్, ఆల్ వీల్ డ్రైవ్, భారీ బ్యాటరీ ప్యాక్‌తో ఇది రానుందని సమాచారం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 నుంచి 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే అవకాశముందని అంచనా. ఆఫ్‌రోడ్ ప్రేమికుల కోసం ఇది గేమ్ ఛేంజర్‌గా మారొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
భారత మార్కెట్లో ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలకు మారడానికి ఇంకా సమయం పడుతుందని చాలా కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే మధ్యంతర పరిష్కారంగా హైబ్రిడ్ టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్, తక్కువ ఇంధన ఖర్చు, పవర్‌ఫుల్ పనితీరు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు హైబ్రిడ్ ఎస్‌యూవీలు కొత్త ఆప్షన్‌గా మారే అవకాశముంది.


Click it and Unblock the Notifications