సగం ధరకే ఎలక్ట్రిక్ కారు.. పొట్టిదే కానీ నలుగురు 230 కి.మీ వెళ్లొచ్చు, ఇప్పుడు దీని అవసరం ఉంది!

భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో చిన్న కార్లకు కూడా భారీ డిమాండ్ పెరుగుతోందని మరోసారి నిరూపించింది జెఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) సంస్థకు చెందిన ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV). చూడటానికి ఎంతో కాంపాక్ట్‌గా, చిన్నగా కనిపించే ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు నగరాల్లో ప్రయాణించే వినియోగదారుల ఫేవరెట్‌గా మారుతోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో సులభంగా డ్రైవ్ చేయగలగడం, పార్కింగ్‌కు తక్కువ స్థలం సరిపోవడం, అలాగే తక్కువ ఖర్చుతో నడవడం వంటి కారణాలతో కామెట్ EVకు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఎంత వేగంగా ఎదుగుతోందో స్పష్టంగా అర్థమవుతోంది.

ఏప్రిల్ 2026 నెలలో మాత్రమే ఎంజీ మోటార్ భారత మార్కెట్లో మొత్తం 601 కామెట్ EV కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ కారు కేవలం 191 యూనిట్ల అమ్మకాలకే పరిమితమై ఉండగా, ఇప్పుడు ఒక్కసారిగా భారీ స్థాయిలో డిమాండ్ పెరగడం గమనార్హం. ఈ లెక్కల ప్రకారం, కామెట్ EV ఏకంగా 215 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.

MG Comet EV April 2026 Sales Recorded 601 Units More Details Inside

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న ఆదరణ మధ్య, ఇది MGకు ఒక పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. కామెట్ EV విజయానికి ప్రధాన కారణం దీని ప్రత్యేకమైన అర్బన్ డిజైన్, వినియోగదారులకు అందించే సౌలభ్యం. చిన్న కుటుంబాలు, ఉద్యోగులు, కాలేజ్ విద్యార్థులు, అలాగే రోజువారీ నగర ప్రయాణాలు చేసే వారికి ఇది చాలా అనుకూలంగా మారుతోంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో ఈ కారును ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

MG Comet EV ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత చవకైన, స్మార్ట్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.62 లక్షల నుంచి రూ. 9.99 లక్షల వరకు ఉండగా, ఎంజీ అందిస్తున్న Battery as a Service (BaaS) పథకం ద్వారా దీన్ని మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

MG Comet EV April 2026 Sales Recorded 601 Units More Details Inside

ఈ స్కీమ్ కింద కామెట్ EV ప్రారంభ ధర కేవలం రూ. 4.99 లక్షలకే అందుబాటులో ఉంటుంది. అయితే ఇందులో బ్యాటరీ ధరను వేరుగా పరిగణిస్తారు. ప్రతి కిలోమీటర్‌కు రూ. 3.20 బ్యాటరీ రెంటల్ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఒకేసారి పెద్ద మొత్తం ఖర్చు చేయకుండా తక్కువ బడ్జెట్‌లోనే సొంతం చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ఎంచుకుంటే కారు అసలు ధర కంటే సగం ధరకే ఈవీని సొంతం చేసుకోవచ్చు.

పనితీరు విషయానికి వస్తే, MG కామెట్ EV చిన్న కారు అయినప్పటికీ నగర ప్రయాణాలకు సరిపోయే మంచి పనితీరును అందిస్తుంది. ఇందులో రియర్-వీల్ డ్రైవ్ సెటప్‌తో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ మోటార్ గరిష్టంగా 42 PS పవర్, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సిటీ ట్రాఫిక్‌లో స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని ఇవ్వడానికి ఈ పవర్ సరిపోతుందని కంపెనీ చెబుతోంది.

MG Comet EV April 2026 Sales Recorded 601 Units More Details Inside

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌పై ఈ కారు గరిష్టంగా 230 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందించగలదు. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, షాపింగ్ లేదా నగరాల్లో చిన్న దూరాల ప్రయాణాలకు ఈ రేంజ్ చాలానే ఉపయోగపడుతుంది. తక్కువ రన్నింగ్ ఖర్చు, కాంపాక్ట్ డిజైన్, సులభమైన డ్రైవింగ్ అనుభూతి కారణంగా కామెట్ EV ప్రస్తుతం నగర వినియోగదారుల్లో మంచి ఆదరణ పొందుతోంది.

Article Published On: Wednesday, May 20, 2026, 11:28 [IST]
English summary
Mg comet ev april 2026 sales recorded 601 units more details inside
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+