పొట్టి కారే కానీ గట్టిదండోయ్.. సైజ్ చూసి అంచనా వేయొద్దు.. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుంది!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో చిన్న ఎలక్ట్రిక్ కార్లకు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్న మోడల్‌గా ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) నిలుస్తోంది. పరిమాణం చిన్నదైనా, పనితీరు, ఉపయోగకరతలో మాత్రం ఈ కారు పెద్దదే అని చెప్పాలి. నగర జీవనశైలికి పూర్తిగా సరిపోయే సిటీ కారుగా ఇది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటోంది. గత కొన్ని నెలలుగా భారతీయ రోడ్లపై ఎక్కువగా కనిపిస్తున్న ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు, 2026 మార్చి నెలలో అద్భుతమైన అమ్మకాల పెరుగుదలను నమోదు చేయడం విశేషం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కామెట్ ఈవీకి భారీ స్థాయిలో డిమాండ్ పెరిగింది. 2025 మార్చిలో కేవలం 173 యూనిట్లు మాత్రమే అమ్ముడైన ఈ కారు, 2026 మార్చిలో 682 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం.

ఈ సంఖ్యలు చూస్తే, ఏకంగా 294 శాతం వార్షిక వృద్ధి. ఇంత భారీ పెరుగుదల సాధించడం, చిన్న ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో ఇది ఎంత బలంగా నిలబడుతుందో తెలియజేస్తోంది. ఈ వృద్ధికి ప్రధాన కారణం, నగర ప్రయాణాలకు అనువుగా ఉండే డిజైన్, తక్కువ ఖర్చుతో నడిచే లక్షణాలు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో సులభంగా డ్రైవ్ చేయగలగడం, పార్కింగ్ సమస్యలకు మంచి పరిష్కారం కావడం వంటి అంశాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

Mg Comet Ev March 2026 Sales Growth 682 Units Its 294 Percent Yoy Surge

అదనంగా, పెరుగుతున్న ఇంధన ధరలు, పర్యావరణంపై అవగాహన పెరగడం కూడా ఈ ఎలక్ట్రిక్ కారుకు డిమాండ్ పెరగడానికి దోహదపడుతున్నాయి. ఇక MG Motor India అమ్మకాల పరంగా చూస్తే, కామెట్ ఈవీ మంచి స్థానం సంపాదించింది. 2026 మార్చిలో సంస్థ విక్రయించిన మొత్తం కార్లలో ఇది మూడవ స్థానంలో నిలవడం విశేషం. ముందున్న మోడళ్లుగా MG Windsor EV (4,530 యూనిట్లు), MG Hector (850 యూనిట్లు) ఉన్నాయి.

ఎంజీ కామెట్ ఈవీ ప్రస్తుతం MG Motor India మొత్తం అమ్మకాలలో దాదాపు 10.45 శాతం వాటాను దక్కించుకోవడం, ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు మార్కెట్లో ఎంత వేగంగా పాపులర్ అవుతోందో స్పష్టంగా చూపిస్తోంది. ఈ వేగం చూస్తే, రాబోయే నెలల్లో కూడా ఇదే వృద్ధి కొనసాగుతుందని కంపెనీ విశ్వాసంగా భావిస్తోంది. పనితీరు పరంగా చూసినా, పరిమాణం చిన్నదే అయినా టెక్నాలజీ పరంగా ఈ కారు ఎక్కడా తగ్గిపోదు.

Mg Comet Ev March 2026 Sales Growth 682 Units Its 294 Percent Yoy Surge

17.3 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తో ఇది పనిచేస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని (ARAI ధృవీకరణతో) కంపెనీ చెబుతోంది. రోజువారీ నగర ప్రయాణాలకు ఇది చాలినంత రేంజ్‌గా చెప్పొచ్చు. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 42 PS శక్తిని, 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ట్రాఫిక్‌లో స్మూత్‌గా, తేలికగా డ్రైవ్ చేయడానికి ఈ పనితీరు సరిపోతుంది.

అదనంగా, IP67 రేటింగ్ ఉన్న బ్యాటరీ వర్షాలు, దుమ్ము వంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితంగా పనిచేసేలా చేస్తుంది. ప్రస్తుత ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.62 లక్షల నుంచి రూ. 9.99 లక్షల మధ్య ఉండగా, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్(BaaS) స్కీమ్ కింద ఈ కారును కేవలం రూ. 4.99 లక్షలకే కొనచ్చు. అయితే, ఈ స్కీమ్‌లో ప్రతి కిలోమీటరుకు రూ. 3.20 బ్యాటరీ అద్దెగా చెల్లించాల్సి ఉంటుంది.

Mg Comet Ev March 2026 Sales Growth 682 Units Its 294 Percent Yoy Surge

More from DriveSpark

Article Published On: Saturday, April 18, 2026, 11:00 [IST]
English summary
Mg comet ev march 2026 sales growth 682 units its 294 percent yoy surge
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+