దీనిని చూసిన తర్వాత గ్యారెంటీగా మీకు మరేకారు నచ్చదు..రూ.12 లక్షలకే ఇంత పెద్ద SUVనా?
కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలకు వెళ్లాలన్నా, సిటీ రోడ్ల మీద రాజసం ఉట్టిపడేలా తిరగాలన్నా అందరికీ గుర్తుకు వచ్చే పేరు MG హెక్టార్ (MG Hector). ఇండియాలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంటర్నెట్ కార్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎస్‌యూవీ, ఇప్పుడు సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చింది.
ముఖ్యంగా ఒక చిన్న కారు కొనే ధరకే భారీ ఎస్‌యూవీని అందిస్తూ జెఎస్‌డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా (JSW MG Motor India) సంచలనం సృష్టిస్తోంది. మధ్యతరగతి కుటుంబాల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకట్టుకుంటున్న ఈ సెకండ్ జనరేషన్ హెక్టార్ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.

సాధారణంగా ఒక మంచి ఎస్‌యూవీ (SUV) కొనాలంటే 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఎంజి హెక్టార్ ఈ లెక్కలన్నీ మార్చేసింది. కేవలం రూ.11.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి రావడం ద్వారా చిన్న కార్లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు కొనాలనుకునే వారిని కూడా తనవైపు తిప్పుకుంటోంది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద కారు కావాలనుకునే కుటుంబాలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పాలి.
కొత్త ఎంజి హెక్టార్ డిజైన్ విషయానికి వస్తే, ఇది రోడ్డుపై చాలా గంభీరంగా కనిపిస్తుంది. దీని ముందు భాగంలో ఉన్న ఓరా హెక్స్ గ్రిల్ కారుకు ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. కొత్తగా రూపొందించిన బంపర్లు కారు వెడల్పుగా, బలంగా ఉన్నట్లు చూపిస్తాయి. అంతేకాకుండా, కొత్త ఓరా బోల్ట్ అల్లాయ్ వీల్స్ ఎక్స్‌టీరియర్ అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. ఈసారి కంపెనీ సెలాడన్ బ్లూ, పెర్ల్ వైట్ వంటి కొత్త రంగులను కూడా ప్రవేశపెట్టింది. ఇవి కారుకు మరింత క్లాస్ లుక్‌ని ఇస్తున్నాయి.

హెక్టార్ క్యాబిన్ లోపల అడుగుపెడితే ఏదో లగ్జరీ హోటల్ గదిలోకి వెళ్ళినట్లు ఉంటుంది. ఈ విభాగంలోనే అత్యంత విశాలమైన ఇంటీరియర్, అద్భుతమైన లెగ్‌రూమ్ దీని సొంతం. ఐదు సీట్ల వేరియంట్‌లో ఐస్ గ్రే ఫినిషింగ్ ఉండగా, ఆరు, ఏడు సీట్ల వేరియంట్లలో అర్బన్ టాన్ థీమ్ లభిస్తుంది. దీనివల్ల కారు లోపల చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది. 14 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఈ కారులో ప్రధాన ఆకర్షణ. ఇది మీ స్మార్ట్‌ఫోన్ లాగే చాలా వేగంగా పనిచేస్తుంది.
ఎంజి హెక్టార్ అంటేనే టెక్నాలజీ. ఇందులో ఉన్న i-SWIPE టచ్ జెస్టర్ కంట్రోల్ ద్వారా కేవలం చేతి కదలికలతో ఏసీ, మ్యూజిక్, నావిగేషన్‌ను కంట్రోల్ చేయవచ్చు. ఐ-స్మార్ట్ (i-SMART) సిస్టమ్ ద్వారా 70 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్లను వాడుకోవచ్చు. మీ ఫోనే కారుకు కీ (Digital Key) లాగా పనిచేస్తుంది. రిమోట్ ద్వారా మీరు ఇంట్లో కూర్చునే కారు ఏసీని ఆన్ చేయవచ్చు. అంటే ఎండలో కారు దగ్గరికి వెళ్లేసరికి లోపల చల్లగా ఉంటుందన్నమాట.

కుటుంబంతో ప్రయాణించేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. అందుకే ఎంజి ఇందులో లెవల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (Level-2 ADAS)ను అందించింది. ఇది రోడ్డుపై ఉన్న ప్రమాదాలను ముందే పసిగట్టి డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. 360 డిగ్రీ హెచ్‌డీ కెమెరా వల్ల కారును పార్కింగ్ చేయడం చాలా సులభం. ఎబిఎస్, ఇబిడి, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో స్టాండర్డ్ (అన్ని మోడళ్లలో) గా వస్తాయి.
కొత్త హెక్టార్‌లో 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 143 PS పవర్, 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో గానీ, హైవేలపై గానీ ఈ కారు నడపడం చాలా సాఫీగా ఉంటుంది. మాన్యువల్, సివిటి (CVT) గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంజి షీల్డ్ ప్రోగ్రామ్ కింద మూడు ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, మూడు ఏళ్ల రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి సౌకర్యాలు కల్పిస్తుండటంతో కస్టమర్లకు నిర్వహణ ఖర్చు కూడా భారంగా అనిపించదు.

ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా భారతీయులు ఎంజి హెక్టార్‌ను ఎంచుకున్నారంటేనే దీని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చిన్న కారు ధరకే భారీ ఎస్‌యూవీని, అది కూడా అత్యాధునిక సాంకేతికతతో పొందాలనుకునే వారికి కొత్త ఎంజి హెక్టార్ ఒక అద్భుతమైన ఎంపిక. మీ పాత కారును ఎక్స్ఛేంజ్ చేసుకుని 100 శాతం ఫైనాన్స్ సదుపాయంతో కూడా దీనిని సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








