దేశమంతా ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వస్తోంది.. అందరి చూపు ఈ కారుపైనే.. ఫార్చ్యూనర్‌కు ఛాలెంజ్!

భారత ఆటోమొబైల్ రంగంలో తనదైన స్టైల్‌తో ప్రత్యేక గుర్తింపును సంపాదించిన ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India), చాలా తక్కువ కాలంలోనే విశ్వసనీయతతో పాటు ఆధునిక టెక్నాలజీకి ప్రతీకగా నిలిచింది. బ్రిటిష్ వారసత్వాన్ని కలిగి ఉన్న ఈ బ్రాండ్, భారత మార్కెట్ అవసరాలను లోతుగా అర్థం చేసుకుని, స్టైల్, సేఫ్టీ, ఫీచర్ల మధ్య సమతుల్యతను కాపాడుతూ వినియోగదారుల మనసును గెలుచుకుంటోంది. ఈ ప్రయాణంలో మరో కీలక అడుగుగా, కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన ఎంజీ మేజెస్టర్‌ (MG Majestor) ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మోడల్, డిజైన్, పనితీరు, మరియు ఫీచర్ల పరంగా కొత్త ప్రమాణాలను సెట్ చేయాలనే లక్ష్యంతో వస్తోంది.

ఈ కారు రాకతో ఇప్పటికే మార్కెట్‌లో బలమైన స్థానం కలిగి ఉన్న టయోటా ఫార్చ్యూనర్ ఎస్‌యూవీకు గట్టి పోటీ తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మేజెస్టర్‌ను కంపెనీ ఏప్రిల్ 20న అధికారికంగా విడుదల చేయనుండగా, ఈ ఎస్‌యూవీపై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆసక్తిగల వినియోగదారులు రూ.41,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ వాహనాన్ని ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది.

Mg Majestor Launch On April 20 In India Here Expected Price Specifications Details

ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్‌కు ప్రత్యామ్నాయంగా తన ప్రెజెన్స్‌ను చూపించిన కంపెనీ, ఇప్పుడు ఆ స్థానాన్ని మరింత బలపరచేందుకు కొత్త అడుగు వేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్లస్టర్ మోడల్ స్థానంలో, త్వరలోనే కొత్త ఫ్లాగ్‌షిప్ SUV అయిన మేజెస్టర్‌ను తీసుకురానుంది. ప్రీమియం సెగ్మెంట్‌లో ఇప్పటికే ఫార్చ్యూనర్ బలమైన స్థానం కలిగి ఉంది. ఈ మోడల్ ధర రూ. 34.16 లక్షల నుంచి రూ. 42.37 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

ఈ నేపథ్యంలో, మేజెస్టర్‌ను అదే స్థాయిలో, లేదా కాస్త ఎక్కువ ప్రీమియం ఫీలింగ్‌తో రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల మధ్య ధరలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంటే, ఇది నేరుగా ఫార్చ్యూనర్‌కు పోటీగా నిలబడేలా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. పర్ఫార్మెన్స్ విషయంలో మేజెస్టర్ ఎలాంటి రాజీ పడకుండా రానుందని తెలుస్తోంది. ఇందులో 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది.

Mg Majestor Launch On April 20 In India Here Expected Price Specifications Details

ఈ ఇంజిన్ సుమారు 215 hp పవర్, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ముఖ్యంగా హైవే డ్రైవ్స్, ఆఫ్-రోడ్ పరిస్థితుల్లో ఇది మంచి పనితీరును చూపే అవకాశం ఉంది. ఇంకా డ్రైవింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరచేందుకు, ఈ SUV 4-వీల్ డ్రైవ్ (4WD) సిస్టమ్‌తో రానుంది. దీనికి 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేయడం వల్ల గేర్ మార్పులు స్మూత్‌గా, శక్తి పంపిణీ సమర్థంగా జరుగుతాయి.

ఎంజీ మేజెస్టర్‌ డిజైన్ విషయంలో బాక్సీ, బలమైన లుక్‌తో ఒక ఫుల్-సైజ్ SUVగా కనిపిస్తుంది. రోడ్డుపై ఇది వెంటనే గుర్తుపడేలా, స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంటుంది. ముందుభాగంలో పెద్ద గ్రిల్, గ్లాస్ బ్లాక్ ఎలిమెంట్స్, నిలువుగా అమర్చిన LED హెడ్‌లైట్లు, DRLs దీనికి మోడర్న్ లుక్ ఇస్తాయి. సైడ్‌లో భారీ క్లాడింగ్, 19-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ బలమైన స్టాన్స్‌ను చూపిస్తాయి.

Mg Majestor Launch On April 20 In India Here Expected Price Specifications Details

వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ లైట్లు ఉండటం స్టైలిష్ టచ్‌ను ఇస్తుంది. అలాగే, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పటికీ ఎక్కడం సులభంగా ఉండేందుకు సైడ్ స్టెప్స్‌ను కూడా అందించారు. ఫీచర్ల పరంగా పూర్తిగా ప్రీమియం అనుభవం అందించేందుకు అధునాతన టెక్నాలజీని అందించారు. ఇంటీరియర్‌లో రెండు 12.4-అంగుళాల డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, 12-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్ మొదలగునవి ఉన్నాయి.

అలాగే, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదనంగా, వైర్‌లెస్ ఛార్జర్లు, పవర్డ్ సీట్లు, 64 కలర్ అంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్‌తో సీట్లు వంటి లగ్జరీ అంశాలు కూడా ఇచ్చారు. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, హిల్ హోల్డ్ & డిసెంట్ కంట్రోల్, TPMS, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, April 6, 2026, 18:32 [IST]
English summary
Mg majestor launch on april 20 in india here expected price specifications details
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+