ఈ కారును వెతికి మరీ కొంటున్నారు.. షోరూమ్ ముందు జనాల తాకిడి..!

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ రన్నింగ్ ఖర్చు, ఆధునిక టెక్నాలజీ వంటి కారణాలతో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) సంచలనం సృష్టిస్తోంది. ఎంజీ మోటార్ (MG Motor) కంపెనీ 2024 సెప్టెంబర్‌లో ఈ ఎలక్ట్రిక్ కారును భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి విండ్సర్ ఈవీ అమ్మకాల జోరు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.

ముఖ్యంగా ఫ్యామిలీ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు, స్టైలిష్ డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్ల కారణంగా యువతను కూడా బాగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా, ఒకసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ ఇవ్వడం, తక్కువ నిర్వహణ ఖర్చుతో ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చడం ఈ కారుకు ప్రధాన బలాలుగా మారాయి. దీంతో చాలా మంది పెట్రోల్ కార్లకు బదులుగా ఇప్పుడు విండ్సర్ ఈవీని ఎంపిక చేసుకుంటున్నారు.

Mg Windsor Ev Becomes Favourite Among Buyers Amid Petrol Price Hike

అమ్మకాల గణాంకాల ప్రకారం, ప్రతి నెలా భారతదేశంలో సుమారు 4,000 నుంచి 5,000 యూనిట్ల వరకు విండ్సర్ ఈవీలు అమ్ముడవుతున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో చాలామంది తమ నెలవారీ రవాణా ఖర్చులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. అలాంటి వారికి విండ్సర్ ఈవీ మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండటంతో ఈ కారును కొనడానికి చాలా మంది పోటీ పడుతున్నారు.

ఒక్క 2025 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 46,000 విండ్సర్ ఈవీలను విక్రయించి ఎంజీ భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో విండ్సర్ ఈవీ ముందంజలో కొనసాగుతోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కారును కంపెనీ అందుబాటు ధరల్లోనే మార్కెట్లో అందిస్తోంది. చిన్న 38 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే విండ్సర్ ఈవీని BaaS ప్లాన్‌తో రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు విక్రయిస్తోంది.

Mg Windsor Ev Becomes Favourite Among Buyers Amid Petrol Price Hike

ఇక పెద్ద 52.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే విండ్సర్ ఈవీ ప్రోను BaaS ప్లాన్‌తో రూ. 12.25 లక్షల ధరకు అందిస్తోంది. ఈ ధరల్లో ఇంత మంచి రేంజ్, ఫీచర్లు అందుబాటులో ఉండటమే ఈ కారుకు భారీ డిమాండ్ రావడానికి ప్రధాన కారణం. పనితీరు పరంగా చిన్న 38 kWh బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే 332 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

అంతేకాకుండా 45 kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో 45 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీంతో నగర ప్రయాణాలతో పాటు లాంగ్ డ్రైవ్‌లకు కూడా ఈ EV మంచి ఎంపికగా మారుతోంది. ఇక ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారుల కోసం తీసుకొచ్చిన 52.9 kWh బ్యాటరీ ప్యాక్ మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఈ పెద్ద బ్యాటరీ ఛార్జ్ చేస్తే 440 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

Mg Windsor Ev Becomes Favourite Among Buyers Amid Petrol Price Hike

దీనిని కూడా DC ఫాస్ట్ ఛార్జర్‌తో సుమారు గంటలోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయగలగడం మరో పెద్ద ప్లస్ పాయింట్‌. పైగా ఫీచర్స్ కూడా ఈ కారులో డజన్ల కొద్ది ఉన్నాయి. పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ సమయంలో తక్కువ రన్నింగ్ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి విండ్సర్ ఈవీ బెస్ట్ ఆప్షన్‌గా మారుతోంది. అందుకే ప్రస్తుతం ఈ కారును కొనడానికి దేశవ్యాప్తంగా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.

Article Published On: Sunday, May 17, 2026, 9:30 [IST]
English summary
Mg windsor ev becomes favourite among buyers amid petrol price hike
Read more on: #mg motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+