వర్షాకాలం లాంగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 కార్లు ఉంటే 1000 కి.మీ ప్రయాణం ఆలోచించకుడా వెళ్లొచ్చు
చల్లని జల్లులు కురుస్తున్నప్పుడు కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. కానీ, వర్షాకాలంలో రోడ్డు ప్రయాణం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా 1000 కిలోమీటర్ల వంటి సుదీర్ఘ ప్రయాణాలు చేసేటప్పుడు చినుకులతో పాటు వచ్చే చిక్కులు (జారుడు రోడ్లు, భారీ నీటి గుంతలు) మామూలుగా ఉండవు. ఇలాంటి సమయంలో మనల్ని, మన కుటుంబాన్ని కాపాడేది కారులోని సేఫ్టీ ఫీచర్లు మాత్రమే. అందుకే వర్షాకాలం ట్రిప్పుల కోసం సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ పొందిన, తిరుగులేని పట్టున్న 5 బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.
1. స్కోడా కుషాక్ (Skoda Kushaq)
స్కోడా కుషాక్ తన స్ట్రాంగ్ బాడీ, అద్భుతమైన బిల్డ్ క్వాలిటీకి పేరుగాంచింది. గ్లోబల్ NCAP సేఫ్టీ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ కారు, వర్షాకాలంలో 1000 కి.మీ ప్రయాణానికి పర్ఫెక్ట్ ఛాయిస్. భారీ వర్షం వల్ల రోడ్లు జారుడుగా మారినప్పుడు దీనిలోని ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) కారు అదుపు తప్పకుండా కాపాడుతుంది. ఇందులో ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తున్నాయి. కుషాక్ లోని 1.0L లేదా 1.5L టర్బో ఇంజిన్లు భారీ నీటి జల్లుల్లో కూడా అద్భుతమైన పవర్‌ను అందిస్తాయి. సుదీర్ఘ ప్రయాణంలో అలసట కలగకుండా ఉండేందుకు దీని సస్పెన్షన్ సెటప్ చాలా స్మూత్‌గా ఉంటుంది.

2. మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto)
మీరు ఏడుగురు లేదా ఎనిమిది మంది సభ్యులతో కూడిన పెద్ద కుటుంబంతో ప్రయాణం చేస్తుంటే, ఇన్విక్టోను మించిన ఆప్షన్ లేదు. భారత్ NCAP లో 5-స్టార్ రేటింగ్ పొందిన ఈ ప్రీమియం MPV, వర్షంలోనూ స్థిరంగా ప్రయాణిస్తుంది. భారీ వర్షం కురుస్తున్నప్పుడు విజిబిలిటీ తక్కువగా ఉన్నా, దీనిలోని 360-డిగ్రీ కెమెరా పార్కింగ్, డ్రైవింగ్‌లో ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా జారుడు రోడ్లపై బ్రేక్ వేసినప్పుడు ఆల్-డిస్క్ బ్రేక్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) డ్రైవర్‌కు పూర్తి నియంత్రణను ఇస్తాయి. 1000 కి.మీ ప్రయాణంలో ఇన్విక్టో ఇచ్చే కంఫర్ట్ మరియు హైబ్రిడ్ మైలేజ్ అదనపు ఆకర్షణ.

3. టాటా సియెర్రా(Tata Sierra)
టాటా సియెర్రా రీఎంట్రీ అదిరిపోయే సేఫ్టీ ఫీచర్లతో జరిగింది. 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పాటు ఇందులో లెవల్-2 ADAS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. భారీ వర్షంలో మన కంటికి సరిగ్గా కనిపించని అడ్డంకులను దీనిలోని బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ కీప్ అసిస్ట్ గుర్తిస్తాయి. వర్షాకాలంలో హైవేల మీద డ్రైవ్ చేసేటప్పుడు కారు లేన్ దాటకుండా ఇది హెచ్చరిస్తుంది. దీని రగ్గడ్ లుక్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల రోడ్లపై నీరు నిలిచినా భయం లేకుండా ముందుకు వెళ్లవచ్చు. సీటింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుండటం వల్ల లాంగ్ ట్రిప్‌లో ఇది మీకు మంచి తోడుగా ఉంటుంది.

4. మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx)
ఒకప్పుడు కేవలం ఆఫ్-రోడింగ్‌కే పరిమితమైన థార్, ఇప్పుడు రాక్స్ వెర్షన్‌తో ఫ్యామిలీ ఎస్‌యూవీగా మారిపోయింది. దీనికి కూడా 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. వర్షాకాలంలో థార్ రాక్స్ ఇచ్చే అతిపెద్ద ధైర్యం దాని వాటర్ వేడింగ్ (Water Wading) సామర్థ్యం. అంటే రోడ్డు మీద మోకాళ్ల లోతు నీరు ఉన్నా థార్ ఈజీగా దాటేస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (EBD) వంటి ఫీచర్లు దీనిని ఒక పటిష్టమైన కోటలా మారుస్తాయి. కొండ ప్రాంతాలకు లేదా పల్లెటూరి మట్టి రోడ్లకు వెళ్లాలనుకునే వారికి థార్ రాక్స్ నెంబర్ వన్ ఆప్షన్.

5. టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner)
టయోటా ఫార్చ్యూనర్ అంటేనే ఒక నమ్మకం. ANCAP నుంచి 5-స్టార్ రేటింగ్ పొందిన ఈ భారీ ఎస్‌యూవీలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) వంటి ఫీచర్లు ఉంటాయి. 2.8L పవర్‌ఫుల్ డీజిల్ ఇంజిన్, 4x4 ఆప్షన్ ఉండటం వల్ల ఎంతటి భారీ వర్షం, బురద రోడ్లైనా ఫార్చ్యూనర్ ఆగదు. 1000 కిలోమీటర్ల ప్రయాణం అంటే టయోటా ఇంజిన్ పై మనకు ఉండే గుడ్డి నమ్మకం అది నిలబెట్టుకుంటుంది. ఫార్చ్యూనర్ లోని ఎత్తైన డ్రైవింగ్ పొజిషన్ వల్ల వర్షంలో రోడ్డు పై వ్యూ చాలా క్లియర్ గా ఉంటుంది, ఇది డ్రైవర్‌కు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








