పవర్‌ఫుల్ ఆఫ్‌రోడ్ కారు వచ్చేసింది.. రోడ్డు మీద ఇక దుమ్ము లేచిపోద్ది! ధర ఎంతంటే?
భారత ఆటోమొబైల్ రంగంలో మరో పెద్ద ఎంట్రీగా జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) తమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొత్త SUV అయిన ఎంజీ మెజెస్టర్ (MG Majestor)ను అధికారికంగా విడుదల చేసింది. ధర విషయానికి వస్తే, MG మెజెస్టర్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4x2 ఆటోమేటిక్ టాప్ ట్రిమ్ (6, 7 సీటర్ ఆప్షన్) ధర రూ.40.99 లక్షలుగా నిర్ణయించగా, మరింత అడ్వాన్స్‌డ్ 4x4 ఆటోమేటిక్ టాప్ ట్రిమ్ (కేవలం 7 సీటర్) ధర రూ.44.99 లక్షలుగా ఉంది. ఈ ధరలతో ఇది ప్రీమియం SUV కేటగిరీలో తన స్థానం బలంగా నమోదు చేసుకుంది. ఇవి ఎక్స్‌షోరూమ్ ధరలు. ఆన్‌రోడ్ అయితే దేశంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాలను బట్టి మారుతు ఉంటాయి.
సైజ్ పరంగా, మెజెస్టర్ తన సెగ్మెంట్‌లో అత్యంత పెద్ద SUVలలో ఒకటిగా నిలుస్తోంది. 5046 mm పొడవు, 2016 mm వెడల్పు, 1870 mm ఎత్తు, 2950 mm వీల్‌బేస్‌తో ఇది రోడ్డుపై బలమైన ప్రెజెన్స్‌ను చూపిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే మోసాయిక్ మ్యాట్రిక్స్ గ్రిల్, డ్రాగన్ ఐస్ DRLs, ట్రై-బీమ్ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, రైజ్డ్ హుడ్ లైన్, 19-ఇంచ్ అల్లాయ్స్ లుక్‌ను మరింత పెంచుతున్నాయి.

మెజెస్టర్ లోపలి క్యాబిన్‌ను పూర్తిగా ప్రీమియం లగ్జరీ అనుభూతి ఇచ్చేలా డిజైన్ చేశారు. లోపల అడుగుపెట్టగానే కనిపించే బ్లాక్-థీమ్ ఇంటీరియర్ ఆకట్టుకుంటుంది. మృదువైన ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్‌తో క్యాబిన్ చాలా హై-ఎండ్ ఫీలింగ్‌ను ఇస్తుంది. సీట్ల విషయానికి వస్తే, ఈ SUVలో వెంటిలేటెడ్, మసాజ్ ఫంక్షన్‌తో కూడిన సీట్లు. డ్రైవర్ సీటుకు 12-వే అడ్జస్టబిలిటీ ఉండగా, ఫ్రంట్ ప్యాసింజర్ సీటుకు 8-వే అడ్జస్టబిలిటీ అందుబాటులో ఉంది.
ఇంటీరియర్‌లో 64-కలర్ అంబియంట్ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, డ్యూయల్ 12.3-ఇంచ్ స్క్రీన్లు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కనెక్టివిటీ చాలా సులభంగా ఉంటుంది. మ్యూజిక్ ప్రేమికుల కోసం 12 JBL సరౌండ్ సౌండ్ స్పీకర్లు అందించారు. అలాగే డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్లు, 220V పవర్ అవుట్‌లెట్ వంటి సౌకర్యాలు దీన్ని పూర్తిగా టెక్-ఫ్రెండ్లీ SUVగా మార్చాయి.

అదనంగా 75కి పైగా iSMART కనెక్టెడ్ కార్ ఫీచర్లు రిమోట్ కంట్రోల్, ట్రాకింగ్, సేఫ్టీ అలర్ట్స్ వంటి ఆధునిక సదుపాయాలను అందిస్తాయి. పవర్ విషయానికి వస్తే, మేజెస్టర్‌లో ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను అందించారు. ఇది 215.5 PS గరిష్ట శక్తి, 478.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు, ఇది 2WD, అడ్వాన్స్‌డ్ 4WD డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ SUV ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది దీని అడ్వాన్స్‌డ్ 4WD సిస్టమ్. ఇందులో 10 ఆఫ్-రోడ్ మోడ్‌లు ఉండటం వల్ల ఏ రకమైన రోడ్ పరిస్థితుల్లోనైనా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. అంతేకాకుండా ఆటో మోడ్‌లో సాధారణ పరిస్థితుల్లో 2WDగా పనిచేసి, ట్రాక్షన్ కోల్పోయిన వెంటనే ఆటోమేటిక్‌గా 4WDకి మారుతుంది. వర్షం, మంచు లేదా స్లిప్పరీ రోడ్లలో ఇది పెద్ద అడ్వాంటేజ్‌గా మారుతుంది.

ఆఫ్-రోడ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఫ్రంట్, రియర్, సెంటర్ డిఫరెన్షియల్ లాక్స్‌ను అందించారు. ఇది ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి కనిపించే ఫీచర్‌గా చెప్పవచ్చు. కఠినమైన భూభాగాల్లో కూడా వీల్ ట్రాక్షన్ కోల్పోయినా వాహనం సులభంగా రికవరీ అవుతుంది. దీనితో పాటు క్రాల్ కంట్రోల్ మోడ్, 219 mm గ్రౌండ్ క్లియరెన్స్, 810 mm వాటర్ వాడింగ్ సామర్థ్యం ఈ SUVను నిజమైన ఆల్-టెరైన్ మెషీన్‌గా మార్చాయి.
సేఫ్టీ విషయంలో కూడా మేజెస్టర్ అత్యంత బలంగా నిలుస్తుంది. ఇందులో Level 2 ADAS టెక్నాలజీని అందించారు, ఇది డ్రైవింగ్ సమయంలో స్టీరింగ్, బ్రేకింగ్, యాక్సిలరేషన్ వంటి విషయాల్లో సహాయం చేస్తుంది. అంతేకాకుండా 360 డిగ్రీల HD కెమెరా, ESP, ABS, EBD, TCS, RMI వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ప్రతి ప్రయాణంలో పూర్తి నియంత్రణను, నమ్మకాన్ని ఇస్తాయి.


Click it and Unblock the Notifications