ఇంట్లో అందరూ కలిసి తిరగడానికి బెస్ట్ కారు.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇది ఓ సారి చూడండి
భారత ఆటోమొబైల్ మార్కెట్లో మధ్యతరగతి కుటుంబాల అవసరాలను, వారి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని కార్లను లాంచ్ చేసే కంపెనీలకు ఆదరణ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రవేశపెట్టిన మల్టీ పర్పస్ వెహికల్ (MPV) నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) మార్కెట్లో సరికొత్త సంచలనంగా మారింది.
ఇటీవల విడుదలైన జూన్ 2026 అమ్మకాల గణాంకాల ప్రకారం.. నిస్సాన్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలోనే అత్యధికంగా అమ్ముడైన బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిస్సాన్ గ్రావైట్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గడిచిన జూన్ నెలలోనే ఏకంగా 1,839 మంది కస్టమర్లు ఈ సరికొత్త 7-సీటర్ కారును కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఒకవైపు కంపెనీకి చెందిన పాపులర్ మోడల్ మ్యాగ్నైట్ సేల్స్ 11 శాతం మేర తగ్గినప్పటికీ, గ్రావైట్ మాత్రం తన అద్భుతమైన స్పేస్, లుక్, రీజనబుల్ ధరతో కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మధ్యతరగతి ప్రజలు కారు కొనేటప్పుడు ప్రధానంగా చూసేది దాని ధర. ఈ విషయంలో కస్టమర్లకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ కారు బేస్ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.65 లక్షలుగా (కొన్ని నగరాల్లో రూ. 5.73 లక్షలుగా) ఉంది. ఇక అన్ని హంగులు ఉన్న దీని టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.09 లక్షల వరకు ఉంటుంది.
ఇంత తక్కువ ధరలో ఏడుగురు ప్రయాణించే పవర్‌ఫుల్ ఫ్యామిలీ కారు దొరకడం అనేది సామాన్య కుటుంబాలకు పెద్ద ఊరట అనే చెప్పాలి. బడ్జెట్ ధరతో పాటు వివిధ బ్యాంకుల ద్వారా లభిస్తున్న సులభమైన లోన్ ఆప్షన్లు, నెలవారీ అతి తక్కువ ఈఎంఐ (EMI) సౌకర్యాలు కూడా ఉండటంతో, ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారస్తులు సైతం ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో మైలేజీ అనేది కారు కొనుగోలు నిర్ణయాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. నిస్సాన్ గ్రావైట్ మైలేజీ పరంగా కూడా వినియోగదారుల జేబుకు చాలా అనుకూలంగా డిజైన్ చేయబడింది. ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ కారు ఆటోమేటిక్ (AMT) వేరియంట్ లీటరుకు గరిష్టంగా 19.6 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది.
అలాగే దీని మాన్యువల్ ట్రాన్స్మిషన్ (MT) వేరియంట్ లీటరుకు 19.3 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. నగరాల్లోని భారీ ట్రాఫిక్‌లో ఆఫీసులకు వెళ్లడానికైనా, లేదా లాంగ్ వీకెండ్స్ లో హైవేలపై ప్రయాణించడానికైనా ఈ కారు చాలా తక్కువ ఖర్చుతో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ కారులో అమర్చిన 1.0 లీటర్ త్రీ-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 72bhp పవర్, 96Nm టాక్‌ను ఉత్పత్తి చేస్తూ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ను చాలా స్మూత్‌గా మారుస్తుంది.

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, గ్రావైట్ కారులో కస్టమర్లకు లగ్జరీ అనుభూతిని ఇచ్చేలా ప్రీమియం స్వెడ్, లేదరెట్ క్విల్టెడ్ సీట్లను అమర్చారు. ఫ్యామిలీతో కలిసి ఊర్లకు లేదా విహారయాత్రలకు వెళ్లేటప్పుడు లగేజీ సమస్య లేకుండా ఉండేందుకు ఇందులో భారీ బూట్ స్పేస్‌ను కల్పించారు. దీనిలోని థర్డ్ రో సీట్లను తీసివేసి 5-సీటర్ మోడ్‌లోకి మార్చుకుంటే ఏకంగా 625 లీటర్ల విశాలమైన బూట్ స్పేస్ లభిస్తుంది.
సామాను ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధునిక టెక్నాలజీ ఫీచర్ల విషయానికొస్తే.. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎండకాలంలో కూడా కారు మొత్తం త్వరగా చల్లబడేలా 3-వరుసల ఏసీ వెంట్లతో కూడిన ట్రాపికల్ ఏసీ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఎన్నో స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సాధారణంగా బడ్జెట్ ధరలో వచ్చే కార్లలో భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉంటాయనే ఒక అపనమ్మకం చాలా మందిలో ఉంటుంది. కానీ నిస్సాన్ సంస్థ గ్రావైట్ విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. ప్రయాణికుల రక్షణ కోసం ఈ కారులోని అన్ని స్టాండర్డ్ వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను (6-Airbags) బేసిక్ ఫీచర్‌గా అందించింది.
దీనితో పాటు రోడ్డుపై కారు అదుపు తప్పకుండా చూసే ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్, ఘాట్ రోడ్లపై లేదా కొండ ప్రాంతాలపై కారు వెనక్కి జారిపోకుండా ఆపే హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లను కూడా చేర్చారు. తక్కువ బడ్జెట్‌లో కుటుంబ భద్రతకు పెద్దపీట వేస్తూ, విలాసవంతమైన ప్రయాణాన్ని అందించే కారు కోసం చూసే మధ్యతరగతి వర్గాలకు నిస్సాన్ గ్రావైట్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications
