జేబులో రూపాయి లేకున్నా కారు ఇంటికి తీసుకెళ్లొచ్చట..నిస్సాన్ మాగ్నైట్ స్కీమ్ మామూలుగా లేదుగా

టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్‌లకి గట్టి పోటీ ఇస్తున్న నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ప్రస్తుతం కొనుగోలుదారుల కోసం కళ్లు చెదిరే ఆఫర్లతో ముందుకు వచ్చింది. సొంత కారు కలను సాకారం చేసుకోవాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కోసం నిస్సాన్ మోటార్ ఇండియా తన ఫైనాన్స్ భాగస్వామి NRFSI (నిస్సాన్ రెనో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండియా) ద్వారా అదిరిపోయే స్కీమ్‌లను ప్రకటించింది. కేవలం తక్కువ వడ్డీకే కాకుండా, జేబులో ఒక్క రూపాయి లేకపోయినా కారును ఇంటికి తీసుకెళ్లే వెసులుబాటును కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిస్సాన్ మాగ్నైట్ అదిరిపోయే ఆఫర్లు
సాధారణంగా బ్యాంకులు కారు లోన్లపై 8% నుంచి 10% వరకు వడ్డీ వసూలు చేస్తాయి. కానీ మంచి సిబిల్ స్కోర్ ఉన్న కస్టమర్లకు నిస్సాన్ కేవలం 5.55% ప్రారంభ వడ్డీ రేటుతోనే లోన్ అందిస్తోంది. ఈ వడ్డీ రేటు మార్కెట్లోనే అత్యంత తక్కువని చెప్పవచ్చు. దీనివల్ల నెలవారీ ఈఎంఐ (EMI) భారం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు, కారు ధరతో పాటు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులను కూడా కలిపి 100% ఆన్-రోడ్ ఫండింగ్ ఇస్తోంది. అంటే మీరు డౌన్ పేమెంట్ కట్టాల్సిన అవసరం లేకుండానే (Zero Downpayment) కారును సొంతం చేసుకోవచ్చు.

Nissan Magnite Dhamaka Offer Get 100 On-Road Funding at Just 5 55 Interest

ఫైనాన్స్ స్కీమ్‌లో మరిన్ని ప్రయోజనాలు
ఈ లోన్ ఆఫర్‌లో మరో గొప్ప విషయం ఏమిటంటే.. లోన్ రీపేమెంట్ టెన్యూర్ కూడా ఏకంగా 7 ఏళ్ల వరకు ఉంటుంది. లోన్ తీసుకున్న 24 నెలల తర్వాత ఎప్పుడైనా మీరు లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అదనపు ఫోర్‌క్లోజర్ ఛార్జీలు ఉండవు. అవసరమైతే మధ్యలో పార్ట్ పేమెంట్ చేసే సదుపాయం కూడా ఉంది. ఈ లోన్ ప్రక్రియ అంతా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది, కేవలం కేవైసీ మినహా మిగతా అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది. నిస్సాన్ పాత కస్టమర్లకైతే అదనంగా రూ. 22,000 వరకు బెనిఫిట్స్, లాయల్టీ బోనస్ కూడా లభిస్తాయి.

ఫీచర్ల ఖజానా నిస్సాన్ మాగ్నైట్
నిస్సాన్ మాగ్నైట్ కేవలం ధరలోనే కాదు, ఫీచర్ల పరంగా కూడా ఎక్కడా తగ్గదు. ఇందులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ (CVT) వేరియంట్లలో లభిస్తుంది. కారు లోపల 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం ఉన్నాయి. భద్రత కోసం 360 డిగ్రీల కెమెరా, ఏబీఎస్ విత్ ఈబీడీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు రైడర్‌కు మంచి రక్షణనిస్తాయి. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మన ఊర్లల్లోని గతుకుల రోడ్లపై కూడా సాఫీగా ప్రయాణించవచ్చు.

Nissan Magnite Dhamaka Offer Get 100 On-Road Funding at Just 5 55 Interest

ధర, పోటీ
నిస్సాన్ మాగ్నైట్ బేస్ వేరియంట్ వీసియా ధర సుమారు రూ.5.62 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ ఎండ్ మోడల్ ధర రూ.10.96 లక్షల వరకు ఉంటుంది. ఆన్-రోడ్ ధరలు మీరు ఉండే నగరాన్ని బట్టి మారుతుంటాయి. ఈ కారు మార్కెట్లో ప్రధానంగా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనో కైగర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే ప్రస్తుతం నిస్సాన్ ఇస్తున్న 5.55% వడ్డీ రేటు ఆఫర్ కచ్చితంగా కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 25, 2026, 13:44 [IST]
English summary
Nissan magnite dhamaka offer get 100 on road funding at just 5 55 interest
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+