లగ్జరీ ఫీచర్లు.. అదిరిపోయే బూట్ స్పేస్.. బడ్జెట్ ధరలో వస్తున్నా పడిపోతున్న ఆ కంపెనీ కార్ సేల్స్

భారత మార్కెట్లో నిస్సాన్ ఇండియా కంపెనీ మే నెల మోడల్ వైజ్ సేల్స్ డేటా అధికారికంగా విడుదలైంది. ప్రస్తుతం నిస్సాన్ సంస్థ భారతీయ మార్కెట్లో ప్రధానంగా రెండు మోడళ్లను విక్రయిస్తోంది. అందులో ఒకటి సూపర్ హిట్ ఎస్‌యూవీ మాగ్నైట్ కాగా.. మరొకటి ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన చౌకైన 7-సీటర్ ఎమ్‌పీవీ గ్రావైట్ (Gravite). అయితే గత మే నెల నిస్సాన్ కంపెనీకి కాస్త నిరాశనే మిగిల్చింది. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన కొత్త 7-సీటర్ గ్రేవైట్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. మే నెలలో నిస్సాన్ మొత్తం 2,948 యూనిట్లను విక్రయించగా.. అందులో మాగ్నైట్ కారు 1,665 యూనిట్ల సేల్స్‌తో టాప్‌లో నిలిచింది.

గడిచిన ఐదు నెలల సేల్స్ రిపోర్ట్
నిస్సాన్ కంపెనీ ఈ ఏడాది గడిచిన ఐదు నెలల్లో సాధించిన అమ్మకాలను పరిశీలిస్తే.. జనవరిలో మాగ్నైట్ 2,502 యూనిట్లు, ఫిబ్రవరిలో 2,230 యూనిట్లు, మార్చితో 2,033 యూనిట్లు, ఏప్రిల్‌లో 1,775 యూనిట్లు, మే నెలలో 1,665 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరోవైపు కొత్తగా వచ్చిన గ్రావైట్ మోడల్ మార్చి నెలలో 2,375 యూనిట్ల బంపర్ ఓపెనింగ్ సాధించినప్పటికీ.. ఆ తర్వాత ఏప్రిల్‌లో 1,428 యూనిట్లకు, మే నెలలో కేవలం 1,283 యూనిట్లకు పడిపోయింది. ఈ విధంగా చూస్తే నిస్సాన్ కంపెనీలో గ్రావైట్ కంటే మాగ్నైట్ కారు కొనుగోలు చేయడానికే కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

nissan magnite suv sales beats nissan gravite 7 seater mpv features price safety rating

నిస్సాన్ మాగ్నైట్ ఇంజిన్, స్పెసిఫికేషన్లు
నిస్సాన్ మాగ్నైట్ కారు మార్కెట్లో రెండు ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో మొదటిది 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (NA) పెట్రోల్ ఇంజిన్ కాగా, ఇది 71bhp పవర్, 96Nm టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ (MT) లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టీ (AMT) గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇక రెండవది పవర్‌ఫుల్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఈ కారు తన సెగ్మెంట్‌లో బెస్ట్ ఇన్ క్లాస్ కంఫర్ట్, రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

అడ్వాన్స్డ్ ఫీచర్లు, లగ్జరీ లుక్
ఈ బడ్జెట్ ఎస్‌యూవీలో ప్రీమియం ఫీచర్లకు కొదవ లేదు. ఇందులో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌గా 360 డిగ్రీ లెదర్ టచ్ ఇంటీరియర్, హీట్ ఇన్సులేషన్ కోటింగ్ కలిగిన అల్ట్రా కంఫర్ట్ సీట్లు ఉన్నాయి. వీటితో పాటు వైర్‌లెస్ చార్జర్, 360 డిగ్రీ కెమెరా, అరౌండ్ వ్యూ మానిటర్, సరికొత్త ఐ-కీ (i Key), వాక్ అవే లాక్ సిస్టమ్, 60 మీటర్ల దూరం నుంచే పనిచేసే రిమోట్ ఇంజిన్ స్టార్ట్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. కారులోపల స్వచ్ఛమైన గాలి కోసం అడ్వాన్స్డ్ ఎయిర్ ఫిల్టర్, ఆటో డిమ్ ఫ్రేమ్‌లెస్ ఐఆర్‌వీఎమ్ (IRVM) అద్దాలు, 4 మోడ్స్ యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. అలాగే ప్రయాణాల్లో ఎక్కువ లగేజీ తీసుకెళ్లడానికి ఏకంగా 540 లీటర్ల భారీ బూట్ స్పేస్ లభిస్తుంది.

nissan magnite suv sales beats nissan gravite 7 seater mpv features price safety rating

క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్
నిస్సాన్ మాగ్నైట్ కారుకు ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ పెరగడానికి దాని భద్రతా ప్రమాణాలే ముఖ్య కారణం. నిస్సాన్ సంస్థ తన అప్‌డేటెడ్ మాగ్నైట్ మోడల్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)ను స్టాండర్డ్‌గా అందించింది. దీనివల్ల ప్రఖ్యాత గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్ట్ నిర్వహించినప్పుడు.. పెద్దల రక్షణ (Adult Safety) విషయంలో ఈ కారు అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అలాగే పిల్లల రక్షణ (Child Safety)లో 3-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ రేటింగ్‌తో దక్షిణాఫ్రికా, భారత మార్కెట్లలో అత్యంత సురక్షితమైన బడ్జెట్ కారుగా నిలిచింది.

ధర, మార్కెట్ పోటీ
భారత మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.5.65 లక్షలుగా ఉంది. దీని టాప్ మోడల్ ధర రూ.11.13 లక్షల వరకు ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో గ్లోబల్ 5-స్టార్ సేఫ్టీ, ప్రీమియం ఎస్‌యూవీ లుక్ లభిస్తుండటంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇండియన్ మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ కారు.. టాటా నెక్సాన్ (Tata Nexon), మారుతి బ్రెజ్జా (Brezza), కియా సోనెట్ (Kia Sonet), మహీంద్రా XUV 3XO, రెనాల్ట్ కైగర్ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీని ఇస్తోంది.

Article Published On: Wednesday, June 17, 2026, 11:20 [IST]
English summary
Nissan magnite suv sales beats nissan gravite 7 seater mpv features price safety rating
Read more on: #nissan #nissan magnite
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+