మధ్య తరగతి ప్రజల కోసం నిస్సాన్ భారీ గిఫ్ట్ ఇవ్వబోతుంది.. ధర, మైలేజ్ చూస్తే కళ్లు బైర్లు గమ్మాల్సిందే

ఒకప్పుడు భారతీయ రోడ్లపై రారాజులా వెలిగిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) గుర్తుంది కదా? ఆ కారు మళ్ళీ కొత్త అవతారంలో తిరిగి వస్తోంది. అయితే ఈసారి డస్టర్‌తో పాటు దాని తమ్ముడు లాంటి మరో పవర్‌ఫుల్ కారు కూడా మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అదే జపాన్ దిగ్గజం నిస్సాన్ తయారు చేసిన నిస్సాన్ టెక్టాన్ (Nissan Tekton).

ఈ రెండు కార్ల రాకతో భారత మిడ్-సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి కంపెనీలు ఈ సరికొత్త పోటీని చూసి ఇప్పుడే టెన్షన్ పడుతున్నాయి. భారత మార్కెట్లో రెనాల్ట్, నిస్సాన్ కంపెనీలు భాగస్వామ్యంతో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్త తరం రెనాల్ట్ డస్టర్‌ను జనవరి 26న (రిపబ్లిక్ డే) దేశం ముందుకు తీసుకురాబోతున్నారు.

Renault Duster Returns Nissan Tekton Set to Shake Up Indias Mid-Size SUV Market

దీనికి కొనసాగింపుగా, ఫిబ్రవరి 4వ తేదీన నిస్సాన్ తన కొత్త ఎస్‌యూవీ టెక్టాన్‎ను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ రెండు కార్లు ఒకే ప్లాట్‌ఫామ్‌పై తయారైనప్పటికీ, నిస్సాన్ టెక్టాన్ తన ప్రత్యేకమైన డిజైన్, జపాన్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.

నిస్సాన్ టెక్టాన్ ఫీచర్ల గురించి కంపెనీ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, డస్టర్ ఆధారంగా వస్తోంది కాబట్టి, ఇందులో పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు హైబ్రిడ్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. ఆధునిక కాలానికి తగ్గట్లుగా పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి ఫీచర్లతో ఈ కారు రానుంది.

Renault Duster Returns Nissan Tekton Set to Shake Up Indias Mid-Size SUV Market

డిజైన్ పరంగా డస్టర్ కంటే టెక్టాన్ కొంచెం షార్ప్‌గా, స్పోర్టీగా ఉంటుందని సమాచారం. ఆటోమొబైల్ నిపుణుల అంచనా ప్రకారం.. నిస్సాన్ టెక్టాన్ బేస్ వేరియంట్ ధర కేవలం రూ.10 లక్షల నుండి రూ.10.50 లక్షల మధ్య ఉండవచ్చు. ఇదే జరిగితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి కార్లకు ఇది పెను ముప్పుగా మారుతుంది.

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, పవర్‌ఫుల్ ఇంజిన్ అందించడమే లక్ష్యంగా నిస్సాన్ ఈ కారును డిజైన్ చేస్తోంది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం విపరీతమైన పోటీ ఉంది. మారుతి సుజుకి విక్టోరిస్, హోండా ఎలివేట్, టాటా కర్వ్, స్కోడా కుషాక్ వంటి కార్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి.

ఇప్పుడు డస్టర్, టెక్టాన్ జంటగా రంగంలోకి దిగితే, కస్టమర్ల చూపు కచ్చితంగా వీటిపైనే ఉంటుంది. ముఖ్యంగా టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఫోక్స్‌వ్యాగన్ టైగూన్ వంటి కార్లకు కూడా నిస్సాన్ టెక్టాన్ గట్టి పోటీ ఇవ్వనుంది.

మొత్తానికి, ఒకప్పుడు తన రఫ్ అండ్ టఫ్ లుక్స్‌తో ఇండియాను ఊపేసిన డస్టర్ ఇప్పుడు తన సొంత తమ్ముడు 'టెక్టాన్'ను వెంటబెట్టుకుని వస్తోంది. ఈ రెండు ఎస్‌యూవీలు ఫిబ్రవరి నాటికి మార్కెట్లో సందడి చేయనున్నాయి. అదిరిపోయే డిజైన్, అదిరిపోయే ఫీచర్లు, అన్నింటికీ మించి సామాన్యుడికి అందుబాటులో ఉండే ధరకు గనుక ఇవి వస్తే.. ఖచ్చితంగా మిడ్-సైజ్ ఎస్‌యూవీ మార్కెట్లో ఒక భారీ కుదుపు రావడం ఖాయం!

More from DriveSpark

Article Published On: Tuesday, January 6, 2026, 17:56 [IST]
English summary
Renault duster returns nissan tekton set to shake up indias mid size suv market
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+