ఈ కంపెనీ కార్లంటే భారతీయులకు పిచ్చి..రోజుకు కొన్ని వేల కార్లు అమ్ముతూ రికార్డులు బ్రేక్ చేస్తోంది

టాటా మోటార్స్ సంస్థ భారతీయ ఆటోమొబైల్ రంగంలో తన ఆధిపత్యాన్ని చాటుతూనే ఉంది. 2025 సంవత్సరం ముగింపులో (డిసెంబర్ నెలలో) కంపెనీ అమ్మకాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు పెరిగినప్పటికీ, మునుపటి నెల (నవంబర్)తో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ, దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ తన మూడవ స్థానాన్ని పటిష్టంగా కాపాడుకుంది.

టాటా మోటార్స్ అంటేనే మనకు మొదట గుర్తొచ్చేది నెక్సాన్. ఈ మోడల్ మరోసారి కంపెనీకి పెద్ద దిక్కుగా నిలిచింది. డిసెంబర్ 2025లో ఏకంగా 19,375 నెక్సాన్ (EVతో కలిపి) యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 డిసెంబర్‌లో కేవలం 13,536 కార్లు మాత్రమే అమ్ముడవగా, ఈసారి ఏకంగా 43% పైగా వృద్ధిని సాధించడం విశేషం. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో నెక్సాన్ క్రేజ్ ఇంకా తగ్గలేదని ఈ నంబర్లు నిరూపిస్తున్నాయి.

Tata Motors Dec 2025 Sales SUV Powerhouse Hits 50K Milestone

చిన్న సైజులో ఉంటూ.. భారీ ఫీచర్లతో అలరిస్తున్న టాటా పంచ్ కూడా తన జోరును కొనసాగిస్తోంది. డిసెంబర్ నెలలో 15,980 పంచ్ కార్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 6% వృద్ధి. ముఖ్యంగా పట్టణాల్లో పంచ్ EVకి వస్తున్న స్పందన టాటాకి కలిసి వస్తోంది. టాటా కార్ల మొత్తం విక్రయాల్లో దాదాపు 32 శాతం వాటా ఈ ఒక్క మోడల్ నుంచే రావడం గమనార్హం.

ప్రీమియం SUV విభాగంలో టాటా హారియర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఏకంగా 81.94% వార్షిక వృద్ధితో 2,378 యూనిట్లు అమ్ముడయ్యాయి. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హారియర్‌ను జనం బాగా ఆదరిస్తున్నారు. అయితే, టాటా సఫారి మాత్రం ఆశించిన స్థాయిలో వేగాన్ని అందుకోలేకపోయింది. కేవలం 1,446 యూనిట్ల విక్రయాలతో 4% స్వల్ప వృద్ధిని మాత్రమే నమోదు చేసింది.

Tata Motors Dec 2025 Sales SUV Powerhouse Hits 50K Milestone

కేవలం SUVలు మాత్రమే కాదు, హ్యాచ్‌బ్యాక్ విభాగంలోనూ టాటా తన పట్టు నిలుపుకుంది. టాటా టియాగో (Tiago) 5,826 యూనిట్లతో 16% వృద్ధిని సాధించగా, టాటా ఆల్ట్రోజ్ ఏకంగా 53% వృద్ధిని నమోదు చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఆల్ట్రోజ్ సేఫ్టీ రేటింగ్స్ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

చాలా ఆశలతో, ఎంతో శ్రమించి తయారు చేసిన టాటా కర్వ్(Curvv) మాత్రం కంపెనీని కాస్త నిరాశకు గురిచేసింది. దీని అమ్మకాలు గతేడదితో పోలిస్తే ఏకంగా 77% తగ్గాయి. డిసెంబర్‌లో కేవలం 1,104 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

Tata Motors Dec 2025 Sales SUV Powerhouse Hits 50K Milestone

ఇదే సమయంలో, సరికొత్త టాటా సియెర్రా ఎంట్రీ ఇచ్చింది. డిసెంబర్‌లో కేవలం 291 యూనిట్లు మాత్రమే లిస్ట్ అయినప్పటికీ, జనవరి నుంచి డెలివరీలు ప్రారంభం కానుండటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. సియరా రాకతో 2026లో టాటా సేల్స్ గ్రాఫ్ మళ్ళీ పైకి లేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

నవంబర్ 2025లో 57,436 కార్లను విక్రయించిన టాటా, డిసెంబర్ నాటికి ఆ సంఖ్యను 50,046కి తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇది సాధారణంగా ఏడాది చివరలో వచ్చే మార్కెట్ మందగింపుగానే చూడాలి. మొత్తం మీద చూస్తే, మారుతీ సుజుకి, మహీంద్రా తరువాత మూడవ స్థానంలో నిలిచిన టాటా మోటార్స్, తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకుంటే మున్ముందు నంబర్ 2 స్థానానికి ఎగబాకడం పెద్ద కష్టమేమీ కాదు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 13, 2026, 9:45 [IST]
English summary
Tata motors dec 2025 sales suv powerhouse hits 50k milestone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+