యమపాశాన్ని సైతం అడ్డుకునే కార్లు..వీటిలో వెళ్తే ఫ్యామిలీ అంతా ఫుల్ సేఫ్

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ (Tata Motors) పేరు ఇప్పుడు ఒక భరోసాగా మారింది. ఒకప్పుడు కేవలం మైలేజ్, లగ్జరీ చూసే జనాలు ఇప్పుడు సేఫ్టీ (Safety)కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వినియోగదారుల ప్రాణాలకు అత్యంత విలువనిస్తూ, టాటా కంపెనీ తన వాహనాలను ఉక్కు కోటల్లా నిర్మిస్తోంది. దీనికి నిదర్శనమే భారత్ ఎన్‌క్యాప్ (BNCAP) క్రాష్ టెస్టుల్లో ఆ కంపెనీ సాధించిన రికార్డులు. ప్రస్తుతం టాటా మోటార్స్ నుంచి ఏకంగా 9 కార్లు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో మార్కెట్లో రారాజుల్లా వెలుగొందుతున్నాయి. ఆ 9 కార్ల పూర్తి వివరాలు, అవి సాధించిన పాయింట్ల గురించి తెలుసుకుందాం.

1. టాటా సియెర్రా (Tata Sierra)
టాటా మోటార్స్ నుంచి వచ్చిన సరికొత్త, అత్యంత సురక్షితమైన కారు సియెర్రా, ఇది సౌకర్యానికి, సేఫ్టీకి మారుపేరు. భారత్ ఎన్‌క్యాప్ టెస్టులో ఇది అడల్ట్ సేఫ్టీలో 32 పాయింట్లకు గాను 31.14 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. 64 కి.మీ వేగంతో ఢీకొట్టినప్పుడు కూడా డ్రైవర్ తల, మెడ, తొడల భాగాలు చాలా సురక్షితంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇక పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 44.73 పాయింట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Tata Motors Dominates BNCAP 9 Models Achieve 5 Star Safety Rating to Protect Indian Families

2. టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV)
ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో హారియర్ ఈవీ ఒక పెను సంచలనం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు, సేఫ్టీలోనూ నంబర్-1 అని నిరూపించుకుంది. అడల్ట్ సేఫ్టీలో 32కి 32 పాయింట్లు సాధించి అజేయంగా నిలిచింది. చిన్న పిల్లల సేఫ్టీలో 45 పాయింట్లు సాధించింది. ఫ్రంటల్, సైడ్ ఇంపాక్ట్ టెస్టుల్లో ఈ కారు లోపల ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగదని భారత్ ఎన్‌క్యాప్ ధృవీకరించింది.

3. టాటా హారియర్ ICE (Tata Harrier)
డీజిల్ వెర్షన్ హారియర్ కూడా సేఫ్టీలో ఏమాత్రం తక్కువ కాదు. 2023 డిసెంబర్‌లో జరిగిన పరీక్షల్లో ఇది 5-స్టార్ రేటింగ్ పొందింది. అడల్ట్ సేఫ్టీలో 30.08 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 44.54 పాయింట్లు సాధించింది. భారత్ ఎన్‌క్యాప్ టెస్టుకు వెళ్లిన మొదటి మోడళ్లలో ఇది ఒకటి కావడం విశేషం.

Tata Motors Dominates BNCAP 9 Models Achieve 5 Star Safety Rating to Protect Indian Families

4. టాటా కర్వ్ ఈవీ (Tata Curvv EV)
టాటా నుంచి వచ్చిన మొదటి ఎస్‌యూవీ కూపే కర్వ్ ఈవీ. స్టైలిష్ లుక్‌తో పాటు ఫాదర్ ఆఫ్ సేఫ్టీగా దీనికి పేరు వచ్చింది. అడల్ట్ సేఫ్టీలో 30.81 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 44.83 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. ఎలక్ట్రిక్ కార్లు అంటే కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, ప్రాణాలకు రక్షణ కూడా అని ఇది నిరూపించింది.

5. టాటా కర్వ్ ICE (Tata Curvv)
పెట్రోల్/డీజిల్ ఇంజన్ తో వచ్చే కర్వ్ మోడల్ కూడా సేఫ్టీలో దుమ్మురేపింది. సిట్రోయెన్ బసాల్ట్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ కారు, అడల్ట్ సేఫ్టీలో 29.50 పాయింట్లు సాధించింది. చిన్న పిల్లల సేఫ్టీ విషయానికి వస్తే 43.66 పాయింట్లు సాధించి కుటుంబాలకు భరోసానిస్తోంది.

Tata Motors Dominates BNCAP 9 Models Achieve 5 Star Safety Rating to Protect Indian Families

6. టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV)
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు నెక్సాన్ ఈవీ. మే 2024లో జరిగిన పరీక్షల్లో ఇది 5-స్టార్ రేటింగ్ సాధించింది. అడల్ట్ సేఫ్టీలో 29.86 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 44.95 పాయింట్లు పొందింది. నగరాల్లో తిరిగే వారికి ఇది అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్ కారు.

7. టాటా నెక్సాన్ ICE (Tata Nexon)
నెక్సాన్ ఈవీ తరహాలోనే దీని పెట్రోల్/డీజిల్ వెర్షన్ కూడా 5-స్టార్ రేటింగ్‌ను కంటిన్యూ చేసింది. అక్టోబర్ 2025లో జరిగిన టెస్టులో అడల్ట్ సేఫ్టీలో 29.41 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 43.83 పాయింట్లు సాధించింది. నెక్సాన్ కారును టాటా మోటార్స్ మొదటి నుంచీ ఒక సేఫ్టీ ఐకాన్‌గా ప్రమోట్ చేస్తూ వస్తోంది.

8. టాటా సఫారీ (Tata Safari)
టాటా మోటార్స్ లైనప్‌లో అత్యంత లగ్జరీ కారు సఫారీ. రోడ్లపై రాజసం ఉట్టిపడేలా ఉండే ఈ భారీ ఎస్‌యూవీ, సేఫ్టీలోనూ కింగ్ అనిపించుకుంది. అడల్ట్ సేఫ్టీలో 30.08 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 44.54 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్ పొందింది. పెద్ద కుటుంబాలకు ఇది ఒక సురక్షితమైన ప్రయాణ సాధనం.

9. టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
చిన్న కారు అయినా చిచ్చర పిడుగులాంటిది పంచ్ ఈవీ. గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో నంబర్-1 స్థానంలో ఉన్న ఈ కారు, సేఫ్టీలోనూ రికార్డులు తిరగరాసింది. అడల్ట్ సేఫ్టీలో 31.46 పాయింట్లు, చైల్డ్ సేఫ్టీలో 45 పాయింట్లు సాధించి అత్యంత సురక్షితమైన చిన్న ఎస్‌యూవీగా నిలిచింది.

More from DriveSpark

Article Published On: Thursday, March 19, 2026, 17:59 [IST]
English summary
Tata motors dominates bncap 9 models achieve 5 star safety rating to protect indian families
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+