కారు కొనాలనుకుంటే ఇప్పుడే సరైన సమయం..టాటా కార్లపై రూ.35 వేల నుండి రూ.85 వేల వరకు తగ్గింపు

కొత్త ఏడాదిలో కొత్త కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. 2026 జనవరి నెలకు గానూ తన పాపులర్ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్‎ను తీసుకువచ్చింది. హ్యుందాయ్, మహీంద్రా వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ, తన సేల్స్ పెంచుకోవడమే లక్ష్యంగా టాటా ఈ నిర్ణయం తీసుకుంది. మీరు ఎంచుకునే మోడల్‌ను బట్టి వేల రూపాయల నుంచి లక్షకు చేరువలో తగ్గింపులు లభిస్తున్నాయి. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి.

టియాగో, టిగోర్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
టాటా మోటార్స్ ఎంట్రీ లెవల్ కార్లయిన టియాగో (Tiago), టిగోర్ (Tigor) లపై మంచి ఆఫర్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ XE మినహా మిగిలిన అన్ని వేరియంట్లపై దాదాపు రూ.35,000 వరకు కన్స్యూమర్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇవి 2024, 2025 మోడళ్లకు వర్తిస్తాయి. ఇప్పటికే కొత్త ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్‌తో వచ్చిన ఈ కార్లు, ఇప్పుడు ఈ డిస్కౌంట్లతో మరింత చౌకగా లభిస్తున్నాయి.

Tata Motors New Year Offers 2026 Massive Discounts on Safari Nexon and Punch

ఆల్ట్రోజ్‌పై ఏకంగా రూ.85,000 వరకు సేవింగ్స్
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో ఉన్న ఆల్ట్రోజ్ (Altroz) కొనాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. పాత మోడల్ (Pre-facelift) పై కన్స్యూమర్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ కలిపి ఏకంగా రూ.85,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇక తాజాగా లాంచ్ అయిన ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ కావాలనుకునే వారికి కూడా రూ.25,000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు ఎస్‌బీఐ యోనో (SBI Yono), కార్పొరేట్ డిస్కౌంట్లు అదనం.

నెక్సాన్, పంచ్.. ఎస్‌యూవీలపైనా తగ్గిన ధరలు!
టాటాలో అత్యధికంగా అమ్ముడయ్యే నెక్సాన్ (Nexon) పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ.50,000 వరకు ఏకీకృత ఆఫర్ ప్రకటించారు. ఇందులో రూ.20,000 లాయల్టీ బోనస్ కూడా ఉంది. అలాగే దేశంలోనే టాప్ సెల్లింగ్ ఎస్‌యూవీ అయిన పంక్ (Punch) పై పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లకు కలిపి రూ.40,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. కొత్తగా వచ్చిన టాటా కర్వ్ (Curvv) పై కూడా రూ.40,000 వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు.

Tata Motors New Year Offers 2026 Massive Discounts on Safari Nexon and Punch

సఫారీ, హారియర్.. ఫ్లాగ్‌షిప్ కార్లపై భారీ గిఫ్ట్!
టాటా ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన సఫారీ (Safari), హారియర్ (Harrier) పై కంపెనీ అత్యధికంగా రూ.75,000 తగ్గింపును ఇస్తోంది. ఇందులో రూ.25,000 డైరెక్ట్ డిస్కౌంట్ కాగా, మిగిలిన రూ.50,000 ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ రూపంలో లభిస్తుంది. ఇవే కాకుండా టాటా గ్రూప్ ఉద్యోగులకు, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సభ్యులకు, ఆదిత్య బిర్లా గ్రూప్ వంటి ఎంపిక చేసిన సంస్థల ఉద్యోగులకు ప్రత్యేక అలయన్స్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఎప్పటి నుంచో టాటా కారును సొంతం చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలకు, ఎస్‌యూవీ ప్రేమికులకు ఈ జనవరి నెల ఒక అద్భుతమైన అవకాశం. గత ఏడాది సేల్స్ రికార్డులను తిరగరాయడమే కాకుండా, పెరుగుతున్న పోటీని తట్టుకుని కస్టమర్లకు చేరువయ్యేందుకు టాటా మోటార్స్ వేసిన ఈ అడుగు నిజంగా ప్రశంసనీయం.

Tata Motors New Year Offers 2026 Massive Discounts on Safari Nexon and Punch

సురక్షితమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన టాటా కార్లు, ఇప్పుడు ఈ భారీ తగ్గింపులతో మరింత అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ ఆఫర్లు కేవలం జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, స్టాక్ ఉన్నంత వరకే వర్తిస్తాయని గమనించాలి. కాబట్టి, ఆలస్యం చేయకుండా మీ సమీప టాటా మోటార్స్ డీలర్‌ను సంప్రదించి, మీ కలల కారును ఈ రోజే బుక్ చేసుకోండి.

More from DriveSpark

Article Published On: Sunday, January 11, 2026, 7:24 [IST]
English summary
Tata motors new year offers 2026 massive discounts on safari nexon and punch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+