ఒక్క కారుతో దుమ్ములేపుతున్న టాటా.. 69,000 మందిని ఫిదా చేసిన ఆ కారు సీక్రెట్ ఇదే

కారు కొనాలి అనుకుంటున్నారా? మైలేజ్ కావాలి, బడ్జెట్ లో ఉండాలి, ఫ్యామిలీకి సేఫ్ కావాలి... ఇవన్నీ ఒక్క కారులో దొరికితే ఎలా ఉంటుంది? అదే కారణంతో ఇప్పుడు భారతదేశంలో వేల మంది ఒకే కారుపై పడిపోతున్నారు. అది మరేదో కాదు టాటా కంపెనీ ఉత్పత్తి చేసిన టాటా నెక్సాన్ CNG.

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ పేరు ఇప్పుడు మార్మోగిపోతుంది. ఒకప్పుడు కేవలం డీజిల్ ఇంజిన్లకు పెట్టింది పేరుగా ఉన్న టాటా, ఇప్పుడు ఎలక్ట్రిక్, సిఎన్‌జి (CNG) విభాగాల్లోనూ దుమ్ములేపుతోంది. ముఖ్యంగా టాటా ప్రవేశపెట్టిన ట్విన్ సిలిండర్ (రెండు సిలిండర్ల) టెక్నాలజీ సిఎన్‌జి కార్ల రూపురేఖలనే మార్చేసింది.

Tata Nexon CNG Dominates FY2026 Outshines Punch Tiago and Altroz with Record Sales

తాజాగా ఆర్థిక సంవత్సరం 2026 గణాంకాల ప్రకారం.. టాటా నెక్సాన్ సీఎన్జీ ఏకంగా 69,168 యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కారు దెబ్బకు సొంత కంపెనీ మోడళ్లయిన పంచ్, టియాగో, ఆల్ట్రోజ్ కూడా వెనకంజ వేశాయంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

మనదేశంలో టాప్ 3 కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇస్తోంది. ప్రస్తుతం సిఎన్‌జి మార్కెట్లో మారుతీ సుజుకి తర్వాత రెండో అతిపెద్ద కంపెనీగా టాటా అవతరించింది. టాటా పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్ అనే ఐదు సిఎన్‌జి మోడళ్లు ఉన్నాయి.

Tata Nexon CNG Dominates FY2026 Outshines Punch Tiago and Altroz with Record Sales

2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం 1.72 లక్షలకు పైగా సిఎన్‌జి కార్లను విక్రయించింది. ఇందులో నెక్సాన్, పంచ్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, నెక్సాన్ కేవలం 1,700 యూనిట్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచింది.

టాటా నెక్సాన్ సిఎన్‌జి ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం దానిలోని ట్విన్ సిలిండర్ టెక్నాలజీ. సాధారణంగా సిఎన్‌జి కార్లలో డిక్కీ (బూట్ స్పేస్) మొత్తం సిలిండర్ తోనే నిండిపోతుంది. కానీ టాటా రెండు చిన్న సిలిండర్లను కారు కింద అమర్చడం ద్వారా లగేజీ పెట్టుకోవడానికి తగినంత స్థలాన్ని కల్పించింది.

Tata Nexon CNG Dominates FY2026 Outshines Punch Tiago and Altroz with Record Sales

దీనితో పాటు నెక్సాన్ కి ఉన్న 5-స్టార్ గ్లోబల్ ఎన్‌క్యాప్ సేఫ్టీ రేటింగ్ కస్టమర్లను బాగా ఆకర్షిస్తోంది. నెక్సాన్ సిఎన్‌జి ప్రారంభ ధర రూ.9.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో టాటా కార్ల అమ్మకాలను గమనిస్తే.. టాటా నెక్సాన్ 69,168 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది.

దీని తర్వాతి స్థానంలో టాటా పంచ్ 67,468 యూనిట్లతో రెండో స్థానంలో ఉంది. హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టియాగో 19,883 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానాన్ని దక్కించుకోగా, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ 10,663 యూనిట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక కాంపాక్ట్ సెడాన్ టిగోర్ 4,907 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

మొత్తంగా ఈ ఐదు మోడళ్లు కలిసి 1,72,089 యూనిట్ల విక్రయాలతో టాటా సిఎన్‌జి మార్కెట్ ను శాసిస్తోంది. నెక్సాన్ లోని బేస్ వేరియంట్ స్మార్ట్ నుంచి టాప్ ఎండ్ వరకు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ వేరియంట్ లో పెట్రోల్, సిఎన్‌జి ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ISOFIX మౌంట్స్, హిల్-హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లను అందించారు.

ఇది మల్టీ డ్రైవ్ మోడ్స్ (Eco, City, Sports), LED హెడ్‌లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. మధ్య తరగతి కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా ప్యూర్+ S వేరియంట్ లో సన్‌రూఫ్, ఆటో హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్లు ఉన్నాయి.

ఇందులో 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే వంటి ఫీచర్లు ప్రయాణాన్ని సరదాగా మారుస్తాయి. ఇక క్రియేటివ్+ PS వేరియంట్ లో పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), వైర్‌లెస్ ఛార్జర్ వంటి హై-ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

నెక్సాన్ లో అత్యంత ఖరీదైన ఫీర్ లెస్+ PS వేరియంట్ లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోదు. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (వేసవిలో చల్లదనాన్ని ఇచ్చేవి), లెదరెట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, నావిగేషన్ తో కూడిన 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, సబ్‌వూఫర్‌తో కూడిన JBL ఆడియో సిస్టమ్ మ్యూజిక్ లవర్స్ కు పండగ లాంటిది. సిఎన్‌జి కారులో ఇన్ని ప్రీమియం ఫీచర్లు ఉండటం వల్లే జనం నెక్సాన్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Article Published On: Friday, May 1, 2026, 15:46 [IST]
English summary
Tata nexon cng dominates fy2026 outshines punch tiago and altroz with record sales
Read more on: #tata motors #tata nexon #cng
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+