దేశంలో ఈ కారు కొనేందుకు పోటీపడతారు.. అలాంటి కారు ఇప్పుడు కొంటే ఏకంగా రూ.60000 ఆదా

సొంతంగా ఒక మంచి సేఫ్టీ ఉన్న SUV కారును కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న కార్ లవర్స్‎కు టాటా మోటార్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో నంబర్-1 SUVగా దూసుకుపోతున్న తన పాపులర్ మోడల్ టాటా నెక్సాన్ (Tata Nexon) పై జూలై 2026 నెలకు గానూ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

ఈ నెలలో నెక్సాన్ కారును సొంతం చేసుకునే కస్టమర్లకు రకరకాల ఆఫర్ల రూపంలో గరిష్టంగా రూ.60,000 వరకు బెనిఫిట్స్ లభించనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.37 లక్షల నుంచి మొదలై టాప్ వేరియంట్ రూ.13.70 లక్షల వరకు ఉంది. ఈ బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు, తిరుగులేని బాడీ క్వాలిటీ లభిస్తుండటంతో కస్టమర్లు ఈ కారును కొనేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు.

Tata Nexon Gets Up to Rs 60 000 Discount in July 2026 with Premium Features and 5-Star Safety

ఏ వేరియంట్‌పై ఎంత డిస్కౌంట్?
టాటా మోటార్స్ తన కస్టమర్ల ఇంధన ప్రాధాన్యతలను బట్టి నెక్సాన్ కారును పెట్రోల్, డీజిల్, సరికొత్త సిఎన్‌జి ఆప్షన్లలో విక్రయిస్తోంది. అయితే ఈ జూలై ఆఫర్ల సేల్‌లో మీరు ఎంచుకునే ఇంజన్ ఆప్షన్‌ను బట్టి డిస్కౌంట్ వివరాలు మారుతుంటాయి. నెక్సాన్ పెట్రోల్ మోడల్‌పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, పాత కారును మార్చుకునే వారికి రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, పాత బండిని స్క్రాప్ కింద ఇస్తే రూ.20,000 స్క్రాపేజ్ బోనస్ లభిస్తాయి.

ఇకపోతే సరికొత్త నెక్సాన్ సిఎన్‌జి (CNG) మోడల్‌పై కూడా ఇదే తరహా నగదు, ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుండగా, దీనిపై స్క్రాపేజ్ బోనస్ మాత్రం మరింత పెరిగి రూ.25,000 వరకు అందుబాటులో ఉంది. మరోవైపు, నెక్సాన్ డీజిల్ వేరియంట్ కొనాలనుకునే వారికి రూ.20,000 వరకు కేవలం స్క్రాపేజ్ బోనస్ మాత్రమే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్లు మీ నగరం లేదా స్థానిక డీలర్‌షిప్‌ను బట్టి మారే అవకాశం ఉన్నందున కొనే ముందు ఒకసారి షోరూమ్‌లో క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది.

Tata Nexon Gets Up to Rs 60 000 Discount in July 2026 with Premium Features and 5-Star Safety

టాటా నెక్సాన్ స్మార్ట్ బేస్ వేరియంట్..
తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారి కోసం టాటా నెక్సాన్ స్మార్ట్ (Smart) బేస్ వేరియంట్ అందుబాటులో ఉంది. ఇందులో పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్, సిఎన్‌జి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. బేస్ వేరియంట్ అయినప్పటికీ ఇందులో భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.

కారులో ప్రయాణించే అందరి సురక్షితం కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, హిల్-హోల్డ్ అసిస్ట్, మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లను అందించారు. ఇవే కాకుండా మల్టీ డ్రైవ్ మోడ్స్ (ఇకో, సిటీ, స్పోర్ట్స్), ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కూడిన సరికొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి మోడ్రన్ ఫీచర్లు ఈ బేస్ మోడల్‌లోనే లభిస్తాయి.

సన్‌రూఫ్ ఫీచర్‌తో నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్
మధ్యస్థ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం నెక్సాన్ ప్యూర్ ప్లస్ ఎస్ (Pure+ S) వేరియంట్ ఒక అద్భుతమైన ఛాయిస్. ఇందులో పెట్రోల్ మాన్యువల్/ఏఎంటీ, సిఎన్‌జి మాన్యువల్, డీజిల్ మాన్యువల్ వంటి అన్ని రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

స్మార్ట్ వేరియంట్‌లోని సేఫ్టీ ఫీచర్లతో పాటు ఇందులో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ వైపర్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు తోడవుతాయి. వీటితో పాటు కారు వెనుక ప్రయాణించే వారి సౌకర్యం కోసం రియర్ ఏసీ వెంట్స్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేను సపోర్ట్ చేసే పెద్ద 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ కెమెరాలను ఇందులో అమర్చారు.

లగ్జరీ లుక్‌తో నెక్సాన్ క్రియేటివ్ ప్లస్ పీఎస్
ఇంకాస్త లగ్జరీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఇష్టపడే కస్టమర్ల కోసం టాటా మోటార్స్ క్రియేటివ్ ప్లస్ పీఎస్ (Creative+ PS) వేరియంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో పెట్రోల్ మాన్యువల్/డీసీటీ (DCT), సిఎన్‌జి మాన్యువల్, డీజిల్ మాన్యువల్/ఏఎంటీ ఆప్షన్లు లభిస్తాయి.

ఈ వేరియంట్‌లో ప్యూర్ ప్లస్ ఎస్ ఫీచర్లతో పాటు డ్రైవింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, కార్నరింగ్ ఫంక్షన్‌తో కూడిన ఫ్రంట్ ఫాగ్ లైట్లు, రియర్ డిఫాగర్ ఉన్నాయి.

కారు లోపల మరింత రిచ్ లుక్ కోసం ఇందులో అదిరిపోయే పనోరమిక్ సన్‌రూఫ్, బయో-ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కీ‌లెస్ ఎంట్రీ, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, వెనుక సీట్లో కూర్చునే వారి కోసం 60:40 స్ప్లిట్ ఫోల్డింగ్ సీట్లు మరియు సెంటర్ ఆర్మ్‌రెస్ట్ సదుపాయం కల్పించారు.

టాప్ ఎండ్ ఫియర్లెస్ ప్లస్ పీఎస్
ఫీచర్ల విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ వద్దు అనుకునే వారి కోసం నెక్సాన్ టాప్ ఎండ్ వేరియంట్ ఫియర్లెస్ ప్లస్ పీఎస్ (Fearless+ PS) మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ హై-ఎండ్ మోడల్‌లో క్రియేటివ్ ప్లస్ వేరియంట్ ఫీచర్లతో పాటు వేసవి కాలంలో చల్లటి అనుభూతిని ఇచ్చే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెదరెట్ సీట్ అప్హోల్స్టరీ, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్ వంటి లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి.

మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో 4 స్పీకర్లు, 4 ట్వీటర్లు, ఒక పవర్‌ఫుల్ సబ్‌వూఫర్‌తో కూడిన జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్‌ను అమర్చారు. అంతేకాకుండా, బిల్ట్-ఇన్ నేవిగేషన్‌ను సపోర్ట్ చేసే 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎయిర్ ప్యూరిఫైయర్, అత్యవసర సమయాల్లో సాయం కోసం ఎమర్జెన్సీ, బ్రేక్‌డౌన్ కాల్ అసిస్ట్ వంటి అత్యాధునిక సాంకేతిక ఫీచర్లు ఇందులో కొలువుదీరాయి.

Article Published On: Saturday, July 4, 2026, 7:35 [IST]
English summary
Tata nexon gets up to rs 60 000 discount in july 2026 with premium features and 5 star safety
Read more on: #tata motors #tata nexon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+