5-స్టార్ సేఫ్టీ, 27 కిమీ మైలేజ్.. టాప్‎లోకి దూసుకొచ్చిన మధ్య తరగతి ఎక్కువగా కొనే కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. గత నెల, అంటే మే 2026 సేల్స్ రిపోర్ట్‌ను గమనిస్తే టాటా కార్లకు కస్టమర్లు బ్రహ్మరథం పట్టారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మోడల్ వైజ్ కార్ల అమ్మకాలను పరిశీలిస్తే, టాటా పంచ్ (Tata Punch) మైక్రో ఎస్‌యూవీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని మార్కెట్లో రారాజుగా నిలిచింది. ఈ ఒక్క మోడల్ అమ్మకాల ధాటికి కంపెనీకి చెందిన మిగిలిన 8 మోడళ్లు వెనుకబడిపోయాయి.

టాటా పంచ్ అమ్మకాల సునామీ
గత మే నెలలో టాటా మోటార్స్ మొత్తం 20,208 యూనిట్ల టాటా పంచ్ కార్లను విక్రయించింది. గత ఏడాది (మే 2025) ఇదే నెలలో జరిగిన 13,133 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి పంచ్ అమ్మకాలు ఏకంగా 54 శాతం మేర బంపర్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. మిడిల్ క్లాస్ కుటుంబాల భద్రతకు పెద్దపీట వేస్తూ గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం కూడా ఈ కారు ఇంతటి భారీ విజయం సాధించడానికి ఒక ముఖ్యమైన కారణం.

Tata Punch Dominates Car Market in May 2026 Beats 8 Models with Massive 54 Sales Growth

టాటా నెక్సాన్, సియెర్రా హవా
ఈ అమ్మకాల జాబితాలో రెండో స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. నెక్సాన్ ఎస్‌యూవీ గత నెలలో 46 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 19,100 యూనిట్ల అమ్మకాలను జరుపుకుంది. ఇక మూడో స్థానంలో టాటా సియెర్రా నిలిచింది. సియెర్రా మోడల్ మే నెలలో మొత్తం 6,606 యూనిట్ల విక్రయాలతో మంచి ఆదరణ పొందింది. అయితే నాలుగో స్థానంలో ఉన్న టాటా టియాగో అమ్మకాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గి, కేవలం 4,178 యూనిట్లకు పరిమితమయ్యాయి.

హారియర్ అద్భుతమైన జంప్
ఐదో స్థానంలో నిలిచిన టాటా ఆల్ట్రోజ్ 5 శాతం స్వల్ప వృద్ధితో 2,915 యూనిట్ల అమ్మకాలను సాధించింది. కాగా, ఆరో స్థానంలో ఉన్న టాటా హారియర్ ఎస్‌యూవీ ఏకంగా 215 శాతం బంపర్ వార్షిక వృద్ధితో మొత్తం 2,815 యూనిట్లు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏడో స్థానంలో ఉన్న టాటా కర్వ్ 45 శాతం క్షీణతతో 1,680 యూనిట్లు, ఎనిమిదో స్థానంలోని టాటా సఫారీ 5 శాతం తగ్గుదలతో 1,057 యూనిట్ల సేల్స్ నమోదు చేశాయి. ఇక అందరికంటే చివరి స్థానంలో టాటా టిగోర్ నిలిచింది. ఇది 51 శాతం భారీ తగ్గుదలతో కేవలం 531 యూనిట్ల అమ్మకాలకే పరిమితమైంది.

Tata Punch Dominates Car Market in May 2026 Beats 8 Models with Massive 54 Sales Growth

తక్కువ ధర.. మైండ్ బ్లోయింగ్ మైలేజ్
టాటా పంచ్ కారు బేస్ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.64 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 10.60 లక్షల వరకు ఉంటుంది. ఫీచర్ల పరంగా చూస్తే ఇందులో 7-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి. ఇందులో 1.2-లీటర్ రెవట్రాన్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది పెట్రోల్ వేరియంట్‌లో లీటరుకు 20.09 కిలోమీటర్లు, సిఎన్‌జి (CNG) వేరియంట్‌లో కిలోకు ఏకంగా 26.99 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుంది.

Article Published On: Sunday, June 7, 2026, 9:34 [IST]
English summary
Tata punch dominates car market in may 2026 beats 8 models with massive 54 sales growth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+