పల్లెల్లో.. పట్టణాల్లోనూ దీనిదే హవా.. ఏప్రిల్‌లో దుమ్మురేపిన టాప్ 5 కార్లు ఇవే.. నంబర్ 1 ఏదో తెలుసా?

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంపాక్ట్ ఎస్‌యూవీ( Compact SUVs)ల మాటే వినిపిస్తోంది. ఒకప్పుడు సెడాన్(sedan), హ్యాచ్‌బ్యాక్ కార్ల వైపు మొగ్గు చూపిన భారతీయ వినియోగదారులు, ఇప్పుడు ఎస్‌యూవీల వైపు వేగంగా మళ్లుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 2026 విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టాటా మోటార్స్(Tata Motors) తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, మారుతి సుజుకి(Maruti suzuki), హ్యుందాయ్ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

విక్రయాల్లో టాటా పంచ్ టాప్
టాటా పంచ్(tata punch) కేవలం ఒక కారు మాత్రమే కాదు, అదొక సంచలనంగా మారింది. ఏప్రిల్ 2026లో ఏకంగా 19,107 యూనిట్ల విక్రయాలతో ఈ కారు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే 52.9 శాతం భారీ వృద్ధిని నమోదు చేయడం విశేషం.

top 5 compact suvs sales india april 2026 tata punch maruti brezza venue update

కేవలం నాలుగు మీటర్ల లోపు పొడవు ఉన్నప్పటికీ, దీనికి ఉన్న గంభీరమైన ఎస్‌యూవీ లుక్, విశాలమైన ఇంటీరియర్, బడ్జెట్ ధరలో లభిస్తుండటం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఇది మొదటి ఛాయిస్‌గా మారింది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచ్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

మారుతి సుజుకి ఫ్రాంక్స్
మారుతి సుజుకి నుండి వచ్చిన ఫ్రాంక్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏప్రిల్ నెలలో ఈ కారు 18,829 యూనిట్ల విక్రయాలను సాధించింది. నంబర్ వన్ స్థానంలో ఉన్న పంచ్ కంటే కేవలం 278 యూనిట్ల తేడాతో మాత్రమే వెనుకబడి ఉంది. ఫ్రాంక్స్ స్పోర్టీ క్రాస్ ఓవర్ డిజైన్, అద్భుతమైన మైలేజీ దీని విజయానికి ప్రధాన కారణాలు. త్వరలో దీనికి సంబంధించిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయాలని మారుతి యోచిస్తోంది, ఇది జరిగితే రాబోయే నెలల్లో పంచ్‌ను వెనక్కి నెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

top 5 compact suvs sales india april 2026 tata punch maruti brezza venue update

టాటా నెక్సాన్
సేఫ్టీ, పెర్ఫార్మెన్స్‌కు మారుపేరుగా నిలిచే టాటా నెక్సాన్(Tata Nexon) 18,126 యూనిట్ల విక్రయాలతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. గత ఏడాదితో పోలిస్తే 17.3 శాతం వృద్ధిని సాధించి తన పట్టును నిరూపించుకుంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలోని పంచ్, నెక్సాన్ ద్వారానే సుమారు 37,233 యూనిట్ల విక్రయాలను సాధించి కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వేరియంట్లు, ఫీచర్లు నెక్సాన్ అమ్మకాలకు మరింత బలాన్ని ఇచ్చాయి.

మారుతి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ
ఒకప్పుడు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగాన్ని ఏలిన మారుతి సుజుకి బ్రెజ్జా(maruti suzuki breeza) ఈసారి నాలుగో స్థానానికి పరిమితమైంది. ఏప్రిల్ నెలలో దీని విక్రయాలు 14,124 యూనిట్లుగా నమోదయ్యాయి. మరోవైపు, హ్యుందాయ్ వెన్యూ 12,420 యూనిట్ల విక్రయాలతో ఐదో స్థానంలో నిలిచింది.

top 5 compact suvs sales india april 2026 tata punch maruti brezza venue update

అయితే వెన్యూ(hyundai venue) అమ్మకాల్లో ఏకంగా 56.2 శాతం భారీ వృద్ధి కనిపించడం విశేషం. భారత్ ఎన్‌క్యాప్ (Bharat NCAP) పరీక్షల్లో వెన్యూ 5-స్టార్ రేటింగ్ సాధించడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు ఇప్పుడు మైలేజీతో పాటు సేఫ్టీకి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Article Published On: Monday, May 11, 2026, 8:55 [IST]
English summary
Top 5 compact suvs sales india april 2026 tata punch maruti brezza venue update
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+