డిక్కీలో బోలెడంత స్థలం.. బడ్జెట్‌లో అదిరిపోయే మైలేజీ.. ఫ్యామిలీ ట్రిప్స్ కోసం టాప్ 5 కార్లు ఇవే

కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్లాలన్నా లేదా పండగలకు ఊరికి వెళ్లాలన్నా మనకు మొదట గుర్తొచ్చేది కారులో ఖాళీ స్థలం (Space). పెళ్లిళ్లు, సెలవుల సీజన్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోని సామాన్లన్నీ కారులో పడతాయా లేదా అన్నదే పెద్ద టెన్షన్. ప్రస్తుతం మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తోంది. కానీ, చూడటానికి పెద్దగా ఉన్నా లోపల ఇరుకుగా ఉండే కార్లు చాలానే ఉన్నాయి. మీ బడ్జెట్ 12 లక్షల రూపాయల లోపు ఉండి, మంచి స్పేస్ కావాలని కోరుకుంటే.. మీకోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. టాటా కర్వ్ (Tata Curvv)
టాటా మోటార్స్ నుంచి వచ్చిన సరికొత్త ఎస్‌యూవీ కూపే డిజైన్ కార్ 'టాటా కర్వ్'. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, ప్రయాణికులకు కావలసినంత స్థలాన్ని అందిస్తుంది. ఈ కారులో ప్రధాన ఆకర్షణ దీని బూట్ స్పేస్ (డిక్కీ స్థలం). దాదాపు 500 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఇందులో ఉంటుంది.

Top 5 Spacious SUVs Under 12 Lakhs Tata Curvv to MG Hector Full List

అంటే మీ ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద సూట్‌కేసులు, ఇతర సామాన్లు అన్నీ ఇందులో ఇట్టే సర్దేయవచ్చు. కారు లోపల ఐదుగురు ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ఇంజన్ పరంగా చూస్తే, ఇది పెట్రోల్, డీజిల్ రెండింటిలోనూ లభిస్తుంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.65 లక్షల నుంచి మొదలవుతుంది. స్టైల్, స్పేస్ రెండూ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

2. సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt)
ఫ్రెంచ్ ఆటో మేకర్ సిట్రోయెన్ నుంచి వచ్చిన 'బసాల్ట్' కూడా ఎస్‌యూవీ కూపే సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తోంది. ఈ కారులో 470 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. దీని లోపలి క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది, దీనివల్ల వెనుక కూర్చునే ప్రయాణికులకు కాళ్ల దగ్గర స్థలం (Legroom) ఎక్కువగా ఉంటుంది. నలుగురైదుగురు ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గంటల తరబడి ప్రయాణించవచ్చు.

Top 5 Spacious SUVs Under 12 Lakhs Tata Curvv to MG Hector Full List

ఇది 1.2 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దీని ధర చాలా ఆకర్షణీయంగా ఉంది. కేవలం రూ.8.55 లక్షల ప్రారంభ ధరతో ఇది ఒక గొప్ప ఫ్యామిలీ ఎస్‌యూవీగా నిలుస్తోంది.

3. టాటా సియెర్రా (Tata Sierra)
టాటా సియెర్రా పేరు వింటేనే పాత తరం వారికి ఒక రకమైన ఎమోషన్ గుర్తొస్తుంది. ఇప్పుడు దాన్ని సరికొత్తగా, మరింత విశాలంగా టాటా కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ విభాగంలోనే అత్యధికంగా 600 లీటర్ల భారీ బూట్ స్పేస్ కలిగిన కారు ఇదే. పెద్ద కుటుంబాలు, ఎక్కువ సామాన్లతో ప్రయాణించే వారికి సియెర్రా ఒక వరమనే చెప్పాలి.

Top 5 Spacious SUVs Under 12 Lakhs Tata Curvv to MG Hector Full List

దీని క్యాబిన్ లోపల కూడా ప్రీమియం అనుభూతిని ఇస్తుంది. ఐదుగురు వ్యక్తులు చాలా లగ్జరీగా కూర్చోవచ్చు. పెట్రోల్, డీజిల్ ఇంజన్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ప్రారంభ ధర రూ.11.49 లక్షలు. లాంగ్ జర్నీలు ఎక్కువగా చేసే వారికి ఇది పర్ఫెక్ట్ పార్ట్నర్.

4. హోండా ఎలివేట్ (Honda Elevate)
హోండా కంపెనీకి ఉన్న నమ్మకమే ఈ కారుకు అతిపెద్ద బలం. హోండా ఎలివేట్ కారులో 1.5 లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ ఉంటుంది, ఇది సిటీ ట్రాఫిక్‌లోనూ, హైవేలపైనూ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇక స్పేస్ విషయానికి వస్తే, ఇందులో 458 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. దీని క్యాబిన్ డిజైన్ చాలా తెలివిగా చేశారు.

Honda Elevate

దీనివల్ల లోపల కూర్చున్న వారికి చాలా గాలిగా, వెలుతురుగా (Airy feeling) ఉంటుంది. తల దగ్గర స్థలం (Headroom) కూడా ఎక్కువగా ఉండటంతో ఎత్తు ఉన్నవారు కూడా హాయిగా కూర్చోవచ్చు. దీని ప్రారంభ ధర రూ.11.59 లక్షలుగా ఉంది. క్వాలిటీ , స్పేస్ కోరుకునే వారు దీని వైపు మొగ్గు చూపవచ్చు.

5. ఎంజీ హెక్టర్ (MG Hector)
భారతీయ మార్కెట్లో ఫీచర్ల రారాజుగా పేరున్న ఎంజీ హెక్టర్, స్పేస్ విషయంలోనూ తగ్గేదేలే అంటోంది. ఇందులో 587 లీటర్ల భారీ బూట్ స్పేస్ ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్లినా సామాన్ల కోసం అదనంగా ఆలోచించాల్సిన పనే ఉండదు.

Top 5 Spacious SUVs Under 12 Lakhs Tata Curvv to MG Hector Full List

1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ గల ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ లతో వస్తుంది. వెనుక సీట్లో ముగ్గురు పెద్దలు ఇరుకు లేకుండా కూర్చోవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు. బడ్జెట్ కాస్త అటు ఇటు అయినా సరే, లగ్జరీ మరియు భారీ స్పేస్ కావాలనుకుంటే హెక్టర్ ది బెస్ట్ ఆప్షన్.

More from DriveSpark

Article Published On: Sunday, March 15, 2026, 9:13 [IST]
English summary
Top 5 spacious suvs under 12 lakhs tata curvv to mg hector full list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+