గుంతల రోడ్లకు ఇక చెక్.. అదిరిపోయే గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న టాప్ 6 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు ఇవే
మన దేశంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు, రోడ్లన్నీ చెరువులను తలపిస్తాయి. గుంతలమయమైన ఇలాంటి రోడ్లపై చిన్న కార్లు నడపాలంటే నరకం కనిపిస్తుంది, ఎక్కడ కారు అండర్‌బాడీ రోడ్డుకు తగిలి పాడైపోతుందోననే భయం ప్రతి డ్రైవర్‌నూ వెంటాడుతుంది.
దీనికి తోడు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఈ రెండు సమస్యలకు ఒకే ఒక బెస్ట్ సొల్యూషన్.. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (Electric SUV) కార్లు. ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ హై-గ్రౌండ్ క్లియరెన్స్ ఈవీల గురించి ఇప్పుడు చూద్దాం.
మహీంద్ర XEV 9e:
ప్రస్తుతం భారతీయ ఈవీ మార్కెట్లో అత్యధిక గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్న క్రేజీ మోడల్ మహీంద్ర XEV 9e. దీనికి ఏకంగా 207 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అంటే ఎలాంటి గతుకుల రోడ్డునైనా ఇది ఈజీగా దాటేస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.21.90 లక్షల నుంచి రూ.31.25 లక్షల వరకు ఉంది. ఇందులో 59 kWh, 79 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ కారు ఏకంగా 542 కిమీ నుంచి 656 కిమీల భారీ రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

టాటా హారియర్ ఈవీ:
టాటా మోటార్స్ నుంచి వస్తున్న హారియర్ ఈవీ (Harrier EV) రోడ్లపై తిరుగుతుంటే రాజసం ఉట్టిపడుతుంది. దీనికి 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం వల్ల అడుగు భాగం అస్సలు తగలదు. ఇందులో ఆప్షనల్ డ్యూయల్-మోటార్ AWD (ఆల్ వీల్ డ్రైవ్) ఫీచర్ కూడా ఉంది. దీని ధర రూ. 21.49 లక్షల నుంచిప్రారంభమై రూ.30.23 లక్షల వరకు ఉంటుంది. 65 kWh, 75 kWh బ్యాటరీలతో వచ్చే ఈ కారు ఫుల్ చార్జ్‌పై 627 కిమీల రేంజ్ ఇస్తుంది.
టాటా నెక్సాన్ ఈవీ:
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సాన్ ఈవీ(Tata Nexon Ev) టాప్‌లో ఉంటుంది. దీని మీడియం రేంజ్ (MR) మోడల్‌కు 205 మిమీ, లాంగ్ రేంజ్ (LR) మోడల్‌కు 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. దీని ధర రూ.12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల వరకు అందుబాటులో ఉంది. ఇందులో 30 kWh, 45 kWh బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఇది సింగిల్ చార్జ్‌పై గరిష్టంగా 489 కిమీల రేంజ్‌ను అందిస్తుంది.

టాటా పంచ్ ఈవీ:
తక్కువ బడ్జెట్‌లో మంచి ఎస్‌యూవీ ఫీలింగ్ కావాలనుకునే వారికి టాటా పంచ్ ఈవీ(Tata Punch Ev) బెస్ట్ ఛాయిస్. చిన్న కారే అయినప్పటికీ దీనికి ఏకంగా 195 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.69 లక్షల నుంచి రూ.12.59 లక్షల వరకు చాలా అందుబాటులో ఉంది. 30 kWh, 40 kWh బ్యాటరీలతో వచ్చే ఈ చిన్న కారు 468 కిమీల రేంజ్ ఇస్తుంది. కేవలం 26 నిమిషాల్లోనే 80 శాతం చార్జ్ అయ్యే డిసి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
విన్ఫాస్ట్ VF7:
భారత మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన విన్ఫాస్ట్ కంపెనీ నుండి వచ్చిన VF7 ఒక ప్రీమయం లుక్ ఉన్న సిటీ కాంపాక్ట్ ఈవీ. దీనికి 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. దీని ధర రూ. 21.89 లక్షల నుంచి రూ. 26.79 లక్షల వరకు ఉంటుంది. 59.6 kWh, 70.8 kWh బ్యాటరీ ఆప్షన్లతో వచ్చే ఈ కారు 510 కిమీల రేంజ్ ఇస్తుంది. అంతేకాదు, దీనికి ఏకంగా 10 ఏళ్లు లేదా 2 లక్షల కిలోమీటర్ల భారీ వారంటీని కంపెనీ అందిస్తోంది. ఇందులో 12.9 ఇంచుల టచ్‌స్క్రీన్, అద్యాధునిక లెవెల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్ర XUV 3XO ఈవీ:
మహీంద్ర నుండి వస్తున్న మరో బెస్ట్ ఆప్షన్ XUV 3XO ఈవీ. దీనికి 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, ఇది మన ఊర్లలోని రోడ్లకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దీని ధర రూ. 13.89 లక్షల నుంచి రూ. 15.46 లక్షల మధ్యలో ఉంటుంది. ఇందులో 39.4 kWh బ్యాటరీ ఉండగా, నిజమైన రోడ్లపై ఇది 285 కిమీల రియల్ వరల్డ్ రేంజ్‌ను ఇస్తుంది. కేవలం 8.3 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత.


Click it and Unblock the Notifications