రోడ్ల మీద దమ్ము చూపించాలంటే ఈ కార్లు ఉండాల్సిందే.. మార్కెట్లోకి రాబోతున్న 6 పవర్‌ఫుల్ ఎస్‌యూవీలివే

డీజిల్ ఇంజిన్ అంటేనే ఒక రకమైన పవర్, లాంగ్ జర్నీలో ఇచ్చే నమ్మకం. అందుకే మార్కెట్లో ఎన్ని ఎలక్ట్రిక్ కార్లు వచ్చినా, డీజిల్ ఎస్‌యూవీల (Diesel SUVs) క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత మార్కెట్లోకి టాప్ బ్రాండ్ల నుంచి 6 పవర్ఫుల్ డీజిల్ ఎస్‌యూవీలు రాబోతున్నాయి. వీటిలో మహీంద్రా, టయోటా, స్కోడా వంటి దిగ్గజ సంస్థల కార్లు ఉన్నాయి. ఆ కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. స్కోడా కోడియాక్ డీజిల్ (Skoda Kodiaq Diesel)
చాలా కాలం తర్వాత స్కోడా తన పాపులర్ ఎస్‌యూవీ కోడియాక్‎లో డీజిల్ ఇంజిన్‌ను తిరిగి తీసుకువస్తోంది. ఇది 2.0-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో రానుంది. లగ్జరీ ఇంటీరియర్స్, 9 ఎయిర్‌బ్యాగ్స్, 4x4 డ్రైవ్ సిస్టమ్‌తో ఈ కారు లగ్జరీ ప్రియులను అలరించనుంది. ఇది భారత్‌లోకి సీబీయూ (CBU) మార్గంలో రానున్నందున ధర కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Top 6 Upcoming Diesel SUVs in India 2026 Mahindra Toyota and Skoda Lead the Pack

2. మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్ (Mahindra Thar 3-Door Facelift)
మహీంద్రా తన ఐకానిక్ 3-డోర్ థార్‌ను సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకువస్తోంది. ఇందులో థార్ రాక్స్ (Roxx) లాంటి ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్, 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉండనున్నాయి. ఇంజిన్ పరంగా 2.2-లీటర్ డీజిల్, 1.5-లీటర్ డీజిల్ ఆప్షన్లు కొనసాగుతాయి. రాక్స్ తరహాలో లోపల వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు రానున్నాయి.

3. కొత్త టయోటా హిలక్స్ (New Toyota Hilux)
టయోటా తన 9వ జనరేషన్ హిలక్స్‎ను భారత్‌లోకి తీసుకురానుంది. ఇది కొత్త ఐఎంవీ (IMV) ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇందులో 2.8-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 201 hp పవర్, 500 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని లుక్ మునుపటి కంటే చాలా రగ్గడ్‌గా, అడ్వెంచర్ ప్రియులకు నచ్చేలా ఉంటుంది.

Top 6 Upcoming Diesel SUVs in India 2026 Mahindra Toyota and Skoda Lead the Pack

4. మహీంద్రా థార్ రాక్స్ 1.5 డీజిల్ (Mahindra Thar Roxx 1.5L)
ప్రస్తుతం థార్ రాక్స్‌లో 2.2-లీటర్ ఇంజిన్ మాత్రమే ఉంది. అయితే, ధరను తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి మహీంద్రా ఇందులో 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుంది. ఇది 115 bhp పవర్, 300 Nm టార్క్‌ను ఇస్తుంది. దీనివల్ల రాక్స్ ప్రారంభ ధర భారీగా తగ్గే అవకాశం ఉంది.

5. మహీంద్రా స్కార్పియో-N ఫేస్‌లిఫ్ట్ (Mahindra Scorpio-N Facelift)
మార్కెట్లో తిరుగులేని విజయం సాధించిన స్కార్పియో-N ఇప్పుడు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రాబోతోంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజైన్ గ్రిల్ ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజిన్ అలాగే కొనసాగుతుంది, కానీ పర్ఫార్మెన్స్‌లో మరిన్ని మెరుగుదలలు ఉండవచ్చు.

Top 6 Upcoming Diesel SUVs in India 2026 Mahindra Toyota and Skoda Lead the Pack

6. కొత్త టయోటా ఫార్చ్యూనర్ (Next-Gen Toyota Fortuner)
ఎస్‌యూవీల రారాజు ఫార్చ్యూనర్ సరికొత్త జనరేషన్ వెర్షన్‌లో భారత్‌లోకి అడుగుపెట్టనుంది. 2026 చివరలో ఇది విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 2.8-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో పాటు మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీని కూడా జోడించనున్నారు. దీనివల్ల పవర్ పెరగడమే కాకుండా మైలేజీ కూడా మెరుగుపడుతుంది. ఏడీఏఎస్ (ADAS), సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో వచ్చే ఛాన్స్ ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, March 27, 2026, 13:30 [IST]
English summary
Top 6 upcoming diesel suvs in india 2026 mahindra toyota and skoda lead the pack
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+