పెద్ద ఫ్యామిలీలు, లాంగ్ డ్రైవ్స్‌కు బెస్ట్.. థార్ నుంచి క్రెటా వరకు రాబోయే టర్బో డీజిల్ SUVలు ఇవే

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా పెరుగుతున్నా.. డీజిల్ ఇంజిన్‌ల క్రేజ్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా SUVలను ఇష్టపడే వారు ఇప్పటికీ డీజిల్ వాహనాల(diesel suvs)కే పెద్దపీట వేస్తున్నారు. కారణం ఒక్కటే.. పవర్, టార్క్, హైవే పనితీరు. అందుకే మహీంద్రా, హ్యుందాయ్, టయోటా(Toyota), కియా వంటి దిగ్గజ కంపెనీలు ఇప్పుడు తమ పాపులర్ SUVలను కొత్త డీజిల్ అవతారంలో తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో గానీ, లాంగ్ డ్రైవ్స్ చేసే వారిలో గానీ డీజిల్ SUVలకు ఉన్న క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్‌లతో పోలిస్తే డీజిల్ వాహనాలు( diesel suvs ) ఎక్కువ టార్క్ ఇవ్వడం, భారీ బరువును సులభంగా లాగగలగడం, ఎక్కువ మైలేజ్ అందించడం వాహనదారులను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హైవే ట్రావెలర్స్, రైతులు, బిజినెస్ పీపుల్, ఆఫ్‌రోడ్ లవర్స్ ఇంకా డీజిల్ వాహనాలనే నమ్ముతున్నారు.

upcoming diesel suv india 2026 thar facelift creta hilux launch details

కొత్త థార్ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా తన అత్యంత పాపులర్ ఆఫ్‌రోడ్ SUV థార్‌ను మరోసారి సరికొత్త అవతారంలో తీసుకురాబోతోంది. ఇప్పటికే టెస్టింగ్‌లో కనిపిస్తున్న థార్ ఫేస్‌లిఫ్ట్(Mahindra Thar) మోడల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా థార్ రాక్స్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఈ కొత్త మోడల్‌లో కనిపించనుంది. ముందు భాగంలో కొత్త గ్రిల్, ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్స్, మరింత మస్క్యులర్ బంపర్ ఈ SUVకి అదిరిపోయే లుక్ ఇవ్వనున్నాయి.

లోపల పెద్ద డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త టచ్‌స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఇంజిన్ విషయానికి వస్తే.. 1.5 లీటర్, 2.2 లీటర్ టర్బో డీజిల్ ఆప్షన్లు కొనసాగనున్నాయి. ముఖ్యంగా ఆఫ్‌రోడ్ డ్రైవింగ్ ఇష్టపడేవారికి ఈ SUV మరోసారి బెస్ట్ ఆప్షన్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.

upcoming diesel suv india 2026 thar facelift creta hilux launch details

క్రెటా కొత్త జనరేషన్
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUVలలో హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta) ఒకటి. ఇప్పుడు ఈ SUV నెక్స్ట్ జనరేషన్ రూపంలో మార్కెట్లోకి రానుంది. కొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో పాటు మరింత ప్రీమియం ఫీల్ ఇవ్వడానికి కంపెనీ భారీ మార్పులు చేస్తోంది. కొత్త క్రెటాలో సరికొత్త డ్యాష్‌బోర్డ్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశముంది.

1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను కంపెనీ కొనసాగించనుండటం డీజిల్ ప్రేమికులకు గుడ్ న్యూస్‌గా మారింది. ముఖ్యంగా హైవేలపై సాఫ్ట్ డ్రైవింగ్, మంచి మైలేజ్, సిటీ-హైవే బ్యాలెన్స్ కారణంగా క్రెటా ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల ఫస్ట్ ఛాయిస్‌గా కొనసాగుతోంది.

upcoming diesel suv india 2026 thar facelift creta hilux launch details

టయోటా హైలక్స్..
ఆఫ్‌రోడ్ వాహనాల్లో టయోటా హైలక్స్‌(Toyota hilux)కు ఉన్న క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. ఇప్పుడు ఈ పికప్ ట్రక్ ఆధారిత SUV మరింత దూకుడైన డిజైన్‌తో రాబోతోంది. కంపెనీ దీనిని "సైబర్ సుమో" స్టైల్‌లో రూపొందిస్తున్నట్టు సమాచారం. కొత్త గ్రిల్, భారీ వీల్ ఆర్చెస్, కొత్త LED లైటింగ్ సిస్టమ్ ఈ SUVని మరింత బోల్డ్‌గా మార్చనున్నాయి. 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో ఇది భారీ టార్క్‌ను అందించనుంది. అడ్వెంచర్ ట్రిప్స్, కొండ ప్రాంతాలు, రఫ్ రోడ్లపై డ్రైవింగ్ ఇష్టపడే వారికి ఇది డ్రీమ్ SUVగా మారొచ్చు.

సెల్టోస్, స్కార్పియో క్లాసిక్ కూడా రెడీ
కియా సెల్టోస్‌(kia seltos)లో కంపెనీ కొత్త టాప్ ఎండ్ వేరియంట్లను తీసుకురానుంది. ఇందులో డాష్‌క్యామ్, 360 డిగ్రీ కెమెరా, లెవల్-2 ADAS, వెంటిలేటెడ్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశముంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న మహీంద్రా స్కార్పియో క్లాసిక్ కూడా ఫేస్‌లిఫ్ట్ రూపంలో రాబోతోంది. కొత్త గ్రిల్, మెరుగైన ఇంటీరియర్స్, కొత్త లైటింగ్ సెటప్ ఈ SUVకి మరోసారి కొత్త ఊపు తీసుకురానున్నాయి.

Article Published On: Monday, May 11, 2026, 11:17 [IST]
English summary
Upcoming diesel suv india 2026 thar facelift creta hilux launch details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+