10 ఇంచుల భారీ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు.. బ్రెజ్జా, నెక్సాన్‌లకు పోటీగా ఫోక్స్‌వ్యాగన్ సరికొత్త అస్త్రం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత రసవత్తరంగా సాగుతున్న విభాగం సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO వంటి కార్ల హవా నడుస్తోంది. ఈ పాపులర్ మోడల్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) ఈ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టడానికి సంచలన ప్లాన్ సిద్ధం చేసింది. తన అద్భుతమైన జర్మన్ బిల్డ్ క్వాలిటీ, మోడ్రన్ డిజైన్‌తో మార్కెట్లోకి సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకురాబోతోంది.

స్కోడా కైలాక్ ప్లాట్‌ఫారమ్, లాంచ్ టైమ్‌లైన్
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫోక్స్‌వ్యాగన్ తీసుకురాబోతున్న ఈ కొత్త ఎస్‌యూవీ, ఇటీవలే మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన స్కోడా కైలాక్ (Skoda Kylaq) కారు ప్లాట్‌ఫారమ్ ఆధారంగానే రూపొందనుంది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా ఈ సరికొత్త వాహనాన్ని డెవలప్ చేస్తున్నారు. ఈ కారులోని చాలా రకాల మెకానికల్ పార్ట్స్, ఇంజన్ ఆప్షన్లను స్కోడా కైలాక్ నుంచి షేర్ చేసుకోనున్నారు. ఆటోమొబైల్ నిపుణుల అంచనా ప్రకారం, ఈ సరికొత్త ఎస్‌యూవీ రాబోయే 2027 మిడ్ నాటికి భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

volkswagen upcoming sub 4 meter compact suv india launch date price features specs

ఫోక్స్‌వ్యాగన్ టెరా ఇన్స్‌పైర్డ్ ఎక్స్ టీరియర్
ఫోక్స్‌వ్యాగన్ సంస్థ ఈ కొత్త కారును కేవలం రీబ్యాడ్జ్ మోడల్‌లా కాకుండా, స్కోడా కైలాక్ కంటే పూర్తి భిన్నమైన, అత్యంత ఆకర్షణీయమైన లుక్‌తో డిజైన్ చేస్తోంది. దీని బాహ్య డిజైన్ గత ఏడాది బ్రెజిల్‌లో లాంచ్ అయి అంతర్జాతీయంగా సూపర్ హిట్ అయిన ఫోక్స్‌వ్యాగన్ టెరా (Volkswagen Tera) ఎస్‌యూవీ నుంచి ప్రేరణ పొంది ఉంటుందని సమాచారం.

కారు ముందు భాగంలో స్పోర్టీ బ్లాక్ గ్రిల్, మధ్యలో మెరిసిపోయే క్రోమ్ ఫినిషింగ్ ఫోక్స్‌వ్యాగన్ లోగో, షార్ప్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, సరికొత్త సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (DRL) ఉండబోతున్నాయి. అంతేకాకుండా, దీని సైడ్ ప్రొఫైల్‌లో మస్కులర్ ఫెండర్స్, బ్లాక్ రూఫ్, రియర్ సైడ్‌లో కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, సరికొత్త గ్లాస్ బ్లాక్ బంపర్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇస్తాయి.

volkswagen upcoming sub 4 meter compact suv india launch date price features specs

లగ్జరీ ఇంటీరియర్, హైటెక్ ఫీచర్లు
కారు లోపలి భాగం (ఇంటీరియర్) చాలా ప్రీమియంగా, హైటెక్ ఫీచర్లతో నిండి ఉండబోతోంది. కేబిన్ లేఅవుట్ చాలా వరకు స్కోడా కైలాక్ తరహాలోనే ఉన్నప్పటికీ, ఫోక్స్‌వ్యాగన్ తన మార్క్ లగ్జరీని జోడించనుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేసే పెద్ద 10-ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ సమాచారం కోసం 8-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇవ్వనున్నారు.

ప్రయాణాన్ని మరింత సుఖమయంగా మార్చేందుకు వెంట్లేటెడ్ ఫ్రంట్ సీట్లు, ప్రీమియం లెదరెట్ సీట్ అపోలిస్ట్రీ, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, ఆకర్షణీయమైన సింగిల్-పాన్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

volkswagen upcoming sub 4 meter compact suv india launch date price features specs

సేఫ్టీ, పవర్‌ఫుల్ టర్బో ఇంజన్ పర్ఫార్మెన్స్
ప్రయాణికుల సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఫోక్స్‌వ్యాగన్.. ఈ కారులో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అనేక అవసరమైన సేఫ్టీ ఫీచర్లను అందించనుంది. అయితే ఇందులో అడ్వాన్స్‌డ్ ADAS టెక్నాలజీ ఉంటుందా లేదా అనేదానిపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ఇంజన్ పరంగా, ఈ కారులో పవర్‌ఫుల్ 1.0-లీటర్, 3-సిలిండర్ టీఎస్ఐ (TSI) టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఇది 115 bhp పవర్‌ను, 178 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ అవసరాల కోసం కస్టమర్లకు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు లభించనున్నాయి.

Article Published On: Thursday, June 18, 2026, 12:23 [IST]
English summary
Volkswagen upcoming sub 4 meter compact suv india launch date price features specs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+