రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్‌ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!

స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors).. తన ప్రముఖ మోడల్‌ నెక్సాన్ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ లైనప్‌ను మరింత విస్తరించింది. నెక్సాన్‌లో ఇప్పుడు 5 కొత్త వేరియంట్లను ఆటోమేటెడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌(AMT) వెర్షన్‌లో తీసుకువచ్చింది. ధర, ఇతర వివరాలు పూర్తి సమాచారం ఈ కథనంలో...

భారత మార్కెట్లో టాటా మోటార్స్‌ అగ్రగామిగా ఉంది. ప్రతి నెలా సేల్స్‌లో టాప్‌ 3 లో కొనసాగుతున్న టాటా మోటార్స్‌.. ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లో కూడా సత్తా చాటుతోంది. ఈ క్రమంలో మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందుతున్న నెక్సాన్‌(Tata Nexon) కాంపాక్ట్‌ ఎస్‌యూవీని సంస్థ AMT వెర్షన్‌లో తీసుకువచ్చింది. వేరియంట్ల వారీగా ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

Tata-Nexon-AMT-In-5-VariantsTata-Nexon-AMT-In-5-Variants

టాటా నెక్సాన్‌లో ఇప్పుడు సంస్థ కొత్త ఆటోమేటిక్ వేరియంట్లు స్మార్ట్+ పెట్రోల్ AMT, ప్యూర్ పెట్రోల్ AMT, ప్యూర్ డీజిల్ AMT, ప్యూర్ S పెట్రోల్ AMT మరియు ప్యూర్ S డీజిల్ AMT లను తీసుకువచ్చింది. కాగా Tata Nexon Smart Plus (Smart+) పెట్రోల్ AMT వేరియంట్ ధర రూ.10 లక్షలు(ముంబయి)గా ఉంది.

ఇక నెక్సాన్‌ ప్యూర్ డీజిల్ AMT ప్రారంభ ధర రూ.11.80 లక్షలు కాగా.. నెక్సాన్ క్రియేటివ్ పెట్రోల్ AMT మోడల్‌ను ధర రూ. 11.70 లక్షలుగా ఉంది. ఇక క్రియేటివ్‌ డీజిల్ AMT ధర రూ. 13 లక్షలు. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్‌ ధరలు. ప్రస్తుతం టాటా నెక్సాన్‌లో ఇవి సరసమైన ధరలో అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు.

Tata-Nexon-AMT-In-5-Variants

భారత మార్కెట్లో ప్రస్తుతం కొత్త నెక్సాన్ స్మార్ట్ ప్లస్ వేరియంట్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్, LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 4 స్పీకర్లు, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల వింగ్ మిర్రర్లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌) వంటి వివిధ ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

టాటా నెక్సాన్ ప్యూర్ మోడల్‌లో పుల్ LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ ల్యాంప్స్, వీల్ కవర్లు, రూఫ్ రైల్స్, రియర్‌ AC వెంట్స్ ఉన్నాయి. ఫీచర్ల పరంగా ఇందులో 4-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌లు, సన్‌రూఫ్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు, వైపర్‌లు మరియు ఎలక్ట్రోక్రోమిక్ రియర్ వ్యూ మిర్రర్ వంటి డజన్ల కొద్దీ అద్భుతమైన ఫీచర్లను ఇందులో చూడవచ్చు.

Tata-Nexon-AMT-In-5-Variants

టాటా నెక్సాన్‌ కొత్త AMT వేరియంట్లో పవర్ ట్రెయిన్‌ విషయానికొస్తే.. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 120 HP శక్తిని మరియు 170 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ AMT మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇక టాటా నెక్సాన్‌ AMT 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 115 hp పవర్ మరియు 260 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-AMT లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

Tata-Nexon-AMT-In-5-Variants

మార్కెట్లో టాటా నెక్సాన్‌ మహీంద్రా XUV300, మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి ప్రముఖ మోడల్‌ కార్లకు గట్టి పోటీనిస్తోంది. సంస్థ టాటా నెక్సాన్‌ను ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో కూడా విక్రయిస్తోంది. దీని ధర రూ. 14.74 లక్షల నుండి రూ. 19.99 లక్షల ఎక్స్-షోరూమ్ మధ్య ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, March 29, 2024, 12:16 [IST]
English summary
Tata nexon gets new 5 variants with amt version prices starting from rs 10 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+