ఫోటో చూసి ఏ బైకో గుర్తుపట్టగలరా...?

Written By:

మోడిఫికేషన్‌లో ఎలాంటి ఆకారానికి అత్యంత సులువుగా ఇమిడిపోయే బైకులు రాయల్ ఎన్ఫీల్డ్ కే సొంతం. రాయల్ ఎన్ఫీల్డ్ లోని అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లెట్ 500 మోటార్ సైకిల్‌ శరీరాన్ని భారీ మెటల్‌తో నిర్మించడం జరిగింది. పూర్తి స్థాయిలో మోడిఫికేషన్ అనంతరం బుల్లెట్టీర్ కస్టమ్స్ సంస్థ దీనికి నాటిలస్ అనే పేరును కూడా ఖరారు చేసింది.

మొదటి చూపులోనే పెద్ద పరిమాణంలో ఉన్న వి-ట్విన్, మరియు కండలు తిరిగిన శరీరాకృతి అదే విధంగా డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి వాటిని గమనిస్తాము. మరింత క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కు చెందిన 500సీసీ మోటార్ సైకిల్ అనే విషయం స్పష్టం అవుతుంది.

మోటార్ సైకిల్ యొక్క మొత్తం రూపం చూడటానికి చాలా భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకించి పెద్ద పరిమాణంలో ఉన్న ఇంధన ట్యాంకు, విశాలమైన సీటు, హ్యాండిల్ బార్ మరియు చిన్న చిన్న గొట్టాలను కలిగి ఉండే రెండు ఎగ్జాస్ట్ పైపులు వంటివి ఈ బైకును మరింత భిన్నంగా మార్చేశాయి.

ఈ మోటార్ సైకిల్ అత్యంత ఆకర్షణీయైమ బ్లూ పెయింట్ ను ధరించి అల్లాయ్ వీల్స్ మీద కూర్చుంది. నాటిలస్ మోటార్ సైకిల్ ను నిమో జలాంతర్గామికి అంకితం చేస్తున్నట్లు బుల్లెట్టీర్ సంస్థ పేర్కొంది.

సాంకేతికంగా అన్ని పరికరాలను రాయల్ ఎన్ఫీల్డ్ వే ఉపయోగించారు. ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు ఇందులో చోటు చేసుకోలేదు.

అచ్చం ఇదే స్టైల్లో ఉండే బొన్‌విల్లే బాబర్ మీకు నచ్చుతుందేమో చూడండి. బాబర్ మోటార్ సైకిల్ కోసం క్రింది గ్యాలరీని వీక్షించండి.

 

English summary
Meet Nautilus, The Custom Built Royal Enfield From Bulleteer Customs
Story first published: Monday, February 13, 2017, 10:47 [IST]
Please Wait while comments are loading...

Latest Photos