Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

దేశీయ మార్కెట్లో ఎంతోమంది కస్టమర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన Ola Electric యొక్క Ola Electric Scooter ఇటీవల విడుదలై విషయం తెలిసిందే. విడుదలకు ముందే ఈ స్కూటర్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇటీవల భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త Ola Electric అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంది.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన Ola Electric Scooter యొక్క డెలివరీ ప్రక్రియను పూర్తిగా కొత్తగా మార్చడానికి కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ కొత్త స్కూటర్‌ను కస్టమర్ ఇంటికి డెలివరీ చేయడానికి కూడా శ్రీకారం చుట్టింది.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

అయితే ఇప్పుడు కంపెనీ ఈ Ola Electric Scooter కోసం డోర్-స్టెప్ సర్వీస్ అందించడానికి కూడా ముందడుగు వేసింది. అంటే, స్కూటర్‌లో ఏదైనా సమస్య ఉంటే, ఆ కంపెనీ టెక్నీషియన్‌లు స్కూటర్ రిపేర్ చేయడానికి కస్టమర్ ఇంటికి రావడం జరుగుతుంది. Ola Electric Scooter మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్‌సైట్‌లో సర్వీస్ రిక్వెస్ట్ సౌకర్యం అందించబడుతుంది.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

Ola Electric Scooter ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినియోగదారులకు నిర్వహణ సంబంధిత హెచ్చరికలను అందిస్తూనే ఉంటుంది. తదుపరి దశలో కంపెనీ స్కూటర్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో విక్రయించవచ్చని కూడా తెలిపింది. దీని కోసం, కంపెనీ దేశంలోని అనేక నగరాల్లో తన డీలర్‌షిప్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే మూడు నెలల్లో దేశంలోని ప్రతి నగరంలో ఒక కస్టమర్ టచ్ పాయింట్‌ను కంపెనీ ప్రారంభించనుంది.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

Ola కంపెనీ తన Ola Electric Scooter ని భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అంటే ఆగస్టు 15 న, S1 మరియు S1 Pro అనే రెండు వేరియంట్లను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు వరుసగా ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ. 99,999 మరియు రూ. 1,29,999.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

Ola Electric Scooter డిజైన్ విషయానికి వస్తే, ఇది సింపుల్‌గా కనిపించే ఫ్రంట్ ఆప్రాన్‌ మధ్యలో OLA బ్యాడ్జ్‌తో చూడవచ్చు. స్కూటర్ ముందు భాగంలో ఉన్న ఏకైక ఫీచర్ హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్, ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ ల చుట్టూ ట్విన్-పాడ్ ఎల్ఈడీ సెటప్ ఉంటుంది.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లో క్షితిజ సమాంతరంగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, రియర్ ఫుట్-రెస్ట్, కాంటూర్డ్ సీట్లు, అల్లాయ్ వీల్స్, 36-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్, రియర్ గ్రాబ్ రైల్స్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్స్, లగేజ్ హుక్ మరియు రబ్బర్-లైన్డ్ ఫ్రంట్ ఫుట్‌వెల్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

Ola Electric Scooter 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌తో శక్తినిస్తుంది, ఇది 3.92 కిలో వాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జతచేయబడుతుంది. దీనిని బయటకు తీయటానికి అవకాశం లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 181 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

Ola S1 Electric Scooter 60 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం నుండి ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అయితే, ఇది 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. 50 శాతం ఛార్జ్ తో 75 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 6 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

Ola Electric Scooter కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 115 కి.మీ. ఈ స్కూటర్ లో మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. అవి నార్మల్, స్పోర్ట్ మరియు హైపర్ మోడ్స్. Ola S1 స్కూటర్ మరియు S1 Pro రెండింటికీ 750W పోర్టబుల్ ఛార్జర్ లభిస్తుంది.

Electric Scooter సర్వీస్ కోసం మేమే మీ చెంతకు వస్తాం; Ola

Ola Electric Scooter యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 1860 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1155 మిమీ ఎత్తు, 1345 మిమీ వీల్‌బేస్ మరియు 74 కిలోల బరువు ఉంటుంది.

Ola Electric Scooter వినియోగదారుల నుండి గొప్ప స్పందనను అందుకుంది మరియు ఇప్పుడు ధర ప్రకటించిన తర్వాత, మరిన్ని బుకింగ్‌లను అందుకునే అవకాశం ఉంటుంది. Ola Electric Scooter భారత మార్కెట్లో Ather 450X, Bajaj Chetak మరియు TVS iQube వంటి స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Ola to provide home service for electric scooters details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X