హోండా యాక్టివాకు చెక్ పెట్టేందుకు కొత్త హీరో స్కూటర్

By Ravi

హోండా మోటార్‌సైకిల్ అందిస్తున్న ఫుల్ మెటల్ బాడీ 110సీసీ స్కూటర్ యాక్టివా, స్కూటర్ సెగ్మెంట్లో మంచి పట్టును సాధించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, యాక్టివాకు గట్టి పోటీనిచ్చేలా దేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్ సన్నాహాలు చేస్తోంది.

హీరో మోటోకార్ప్ ఇటు పురుషులను అటు స్త్రీలను టార్గెట్‌గా చేసుకొని హోండా యాక్టివాకు ధీటుగా ఓ సరికొత్త స్కూటర్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం హీరో మోటాకార్ప్ నుంచి ప్లెజర్, మ్యాస్ట్రో స్కూటర్లు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

Hero Scooter

భారత ద్విచక్ర మార్కెట్లో స్కూటర్ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. పెరుగుతున్న వాహన రద్దీని దృష్టిని ఉంచుకొని, మోటారిస్టులు చికాకు లేని గేర్‌లెస్ స్కూటర్లను ఆశ్రయిస్తుండటంతో, ఈ సెగ్మెంట్లో అమ్మకాలు జోరందుకున్నాయి.

సరికొత్త ప్లాట్‌‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని హీరో మోటోకార్ప్ తమ యాక్టివా కాంపిటీటర్‌ను డెవలప్ చేయనుంది. ఇదిలా ఉండగా.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ కూడా ఈ సెగ్మెంట్లో తన స్థాన్ని మరింత పదిలం చేసుకునేందుకు ఇటీవలే యాక్టివా 3జి అనే కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా.. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది.

Most Read Articles

English summary
Honda Motorcycle and Scooter India has dominated the scooter segment in the country with its Activa model. The first generation Activa was introduced in India during 2001 and is regularly updated to keep up with the times. Now Indian two-wheeler manufacturer Hero MotoCorp has decided to compete with the Activa head on.
Story first published: Tuesday, February 10, 2015, 18:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X