నిస్సాన్ గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్; భారీ డిస్కౌంట్స్

By Ravi

ఇటీవలే ఆన్‍‌లైన్ ద్వారా వాహనాలను విక్రయిస్తామని ప్రకటించిన జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ మోటార్ ఇండియా, ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జిఓఎస్ఎఫ్) 2013లో చేరింది. http://www.nissan-gosf.in/ వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 11 నుంచి 13వ తేదీలలోపు నిస్సాన్ కార్లను బుక్ చేసుకునే వారికి, సదరు కార్లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.

గూగుల్ ద్వారా ప్రారంభించబబడిన ఈ జిఓఎస్ఎఫ్ ఆన్‌లైషాపింగ్ ఫెస్టివల్‌లో నిస్సాన్ తమ కార్లపై రూ.10,000 (టెర్రానో ఎస్‌యూవీ) నుంచి రూ.5.6 లక్షలు (టియానా సెడాన్) వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్‌ను పొందేందుకు నేడే (డిసెంబర్ 13, 2013) చివరి అవకాశం త్వరపడండి. మరిన్ని వివరాలకు http://www.nissan-gosf.in/ సైట్‌ను సందర్శించండి.

Nissan Great Online Shopping Festival 2013

ఈ ఆఫర్‌లో భాగంగా, కంపెనీ విక్రయిస్తున్న వివిధ ఉత్పత్తులపై అందిస్తున్న ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి:
  • నిస్సాన్ టెర్రానో - రూ.10 వేలు
  • నిస్సాన్ మైక్రా యాక్టివ్ - రూ.15 వేలు
  • నిస్సాన్ మైక్రా - రూ.40 వేలు
  • నిస్సాన్ సన్నీ - రూ.75 వేలు
  • నిస్సాన్ ఇవాలియా - రూ.2.3 లక్షలు
  • నిస్సాన్ టియానా - రూ.5.6 లక్షలు

నిస్సాన్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. ఎందుకంటే, నిస్సాన్ మోటార్ ఇండియా వచ్చే నెల నుంచి ఉత్పత్తుల ధరలను పెంచనుంది. ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ 2012లో తొలిసారిగా గ్రేట్ ఆన్‌లైన్ షాపింగ్‌ను 24 గంటల కార్యక్రమంగా ప్రారంభించింది. ఇది మంచి సక్సెస్‌ను సాధించడంతో ఈసారిగా 24 గంటలు కాకుండా, ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించాలని గూగుల్ నిర్ణయించింది. ఈ మూడు రోజుల్లో అనేక ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను ఆఫర్ చేస్తాయి.

More from DriveSpark

Article Published On: Friday, December 13, 2013, 12:12 [IST]
English summary
Earlier this week, Nissan India announced it's intent to sell its vehicles online. Now, taking it one step further, the automaker has joined the on-going Great Online Shopping Festival (GOSF) 2013, by launching the Nissan.in/gosf site.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+